Jump to content

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

వికీపీడియా నుండి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గ్రామీణ నేపథ్యం, రైతుల కష్టాలను ఇతివృత్తంగా స్వీకరించిన రచయిత[1].

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
జననంసన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
(1963-02-16) 1963 ఫిబ్రవరి 16 (వయసు 61)
India బాలరాజుపల్లె గ్రామం, కాశి నాయన మండలం,కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తిఉపాధ్యాయుడు
రచయిత
మతంహిందూ
భార్య / భర్తఇంద్రావతి
పిల్లలుపావని, శ్రావణి, శ్రీనాథ్
తండ్రిసన్నపురెడ్డి లక్ష్మిరెడ్డి
తల్లిచెన్నమ్మ

విశేషాలు

[మార్చు]

ఇతడు 1963, ఫిబ్రవరి 16వ తేదీన సన్నపురెడ్డి చెన్నమ్మ, లక్ష్మిరెడ్డి దంపతులకు కడప జిల్లా, కాశినాయన మండలం బాలరాజుపల్లె గ్రామములో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతడు బి.ఎస్సీ, బి.ఈడీ. చదివాడు. 1989నుండి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 1987 నుండి కథలు, నవలలు, కవితలు వ్రాస్తున్నాడు. ఇతడి నవల చినుకుల సవ్వడి ఇంగ్లీషు భాషలోనికి అనువదించబడింది.[2] కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువదించబడ్డాయి. ఇతని రచనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయాలలో పి.హెచ్.డి.స్థాయిలో మూడు పరిశోధనలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్. స్థాయిలో రెండు పరిశోధనలు జరిగాయి.

రచనలు

[మార్చు]

నవలలు

[మార్చు]
  1. కాడి
  2. పాండవబీడు
  3. తోలుబొమ్మలాట
  4. చినుకుల సవ్వడి
  5. పాలెగత్తె
  6. ఒక్క వాన చాలు
  7. మబ్బులు వాలని నేల
  8. ఒంటరి
  9. కొండపొలం

కవితా సంపుటి

[మార్చు]
  1. బడి

కథాసంపుటులు

[మార్చు]
  1. కొత్త దుప్పటి
  2. బతుకు సేద్యం
  3. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథలు

కథలు

[మార్చు]

ఇతని కథలు ఆంధ్రప్రభ,ఆహ్వానం, చినుకు, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, ఆంధ్రజ్యోతి, సాహిత్యనేత్రం, ఈనాడు, స్వాతి మాసపత్రిక,వార్త,చతుర,నవ్య,రచన,స్రవంతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

  1. అంటు
  2. అమ్మ
  3. అరలు అరలుగా
  4. ఆకలి
  5. ఆకుపచ్చని మాయ
  6. ఆమె చూపు
  7. ఆమె మొలకెత్తిన నేల
  8. ఆశ
  9. ఎంతెంత దూరం
  10. ఏడోకడ్డీ
  11. ఒక్క వాన చాలు
  12. కడితి వేట[3]
  13. కన్నీటి కత్తి
  14. కొక్కొరొకో
  15. కొడుకు-కూతురు
  16. గంపెడు గడ్డి
  17. గిరి గీయొద్దు
  18. చనుబాలు
  19. చినుకుల సవ్వడి
  20. తడి
  21. తమ్ముడి ఉత్తరం
  22. తోలు బొమ్మలాట
  23. దిగంబరం
  24. దెబ్బ
  25. నేను-తను
  26. నేర్చుకో
  27. పట్టుచీర
  28. పాటల బండి
  29. పిట్టపాట
  30. పునాది
  31. పేడదెయ్యం
  32. పేరులేని కథ (రాతిపూజ)
  33. ప్రతిమల మంచం
  34. బతుకు సేద్యం
  35. బురద
  36. బొగ్గులబట్టి
  37. భయం నీడ
  38. ముస్తాబు
  39. రాలిన చింతపండు
  40. వక్రదృష్టి
  41. వసంతం
  42. వాళ్లు మాపార్టీకాదు
  43. వీరనారి
  44. వీరమరణం
  45. సారీ సారీ లిటిల్ స్టార్
  46. సుడిగాలి ఆంధ్రజ్యోతిసండే 15.6.09
  47. ఆకుపచ్చని మాయ ఆంధ్రజ్యోతి Jun.09
  48. రాంభజన.March. 93
  49. రాతిపూజ. స్రవంతి M 1987
  50. వక్రదృష్టి స్రవంతి 26.3.87
  51. గొలుసుల పలక స్రవంతి3.4.88
  52. ఆకలి ఆంధ్రజ్యోతి వీక్లీ  8.3.91
  53. మబ్బుల్లో వెన్నెల స్వాతి వీక్లీ 26.2.93
  54. ముస్తాబు  ఆంధ్రభూమి వీక్లీ. 4.11.93
  55. పట్టుచీర రచన మంత్లీ Jan.97
  56. కాలిముల్లు  జాగృతి  మంత్లీ 29.11.10
  57. మరక. చినుకు  మంత్లీ.  Feb.11
  58. పరాధీన.      పాలపిట్ట. feb.11
  59. చివరి మజిలీ   స్వాతి వీక్లీ.11.3.11
  60. దేవుడు    పాలపిట్ట మంత్లీ  apr.11
  61. నేతిజిడ్డు     సాక్షి సండే 14.4.11
  62. పాలకంకులశోకం    ఆం•జ్యో15.7.12
  63. పంపకాలు రచన.aug12
  64. బిలం          పాలపిట్ట dec.12
  65. బొమ్మనాగలి       నవ్య.21.11.12
  66. తొక్కుడు కొమ్మ.  తె•వెలుగుjan.13
  67. సేద్దెగాడు ఆంధ్రజ్యోతి సండే 09.10.16 
  68. అవతలివైపు
  69. సరిజోడు
  70. రెండు భయాలు
  71. నాన్న కావాలి  నవ్య.11.11.09
  72. మేకల పెంపకం డెక్కన్ ల్యాండ్ 2017 ఆగస్టు
  73. అతడి బాధ తెలుగుపలుకుTANA  2017 మే
  74. ఎదురెదురు ఆంధ్రజ్యోతిసండే 14.04.2019
  75. లోపలి చొక్కా...'తానా' తెలుగు పత్రిక

పురస్కారాలు, సన్మానాలు

[మార్చు]
  • 1984లో ఆంధ్రప్రభ కథలపోటీలో ఒక్కవానచాలు కథకు ద్వితీయ బహుమతి
  • 1990లో సహృదయ సాహితి విశాఖపట్నం నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితలపోటీలో శైశవబాల కవితకు ఉత్తమ బహుమతి.
  • 1996లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళై ఫౌండేషన్, ఆంధ్రప్రభ సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో అంతు కథకు ప్రథమ బహుమతి.
  • 1997లో ఢిల్లీ తెలుగు అసోసియేషన్ సత్కారం
  • 1998లో ఆటా నిర్వహించిన అంతర్జాతీయ నవలల పోటీలో తొలినవల కాడికి ద్వితీయ బహుమతి.
  • 1998లో ఉండేల మాలకొండారెడ్డి పురస్కారం
  • 1999లో గౌరు సాహితీ పురస్కారం.
  • 2002లో పాండవ బీడు నవలకు స్వాతి వీక్లీ అవార్డు.
  • 2004, 2006లో అధికార భాషాసంఘం వారి పురస్కారం.
  • 2007లో ఆటా నవలలపోటీలో తోలుబొమ్మలాటకు ప్రథమ బహుమతి.
  • 2007లో స్వాతి వారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో పాలెగత్తె నవలకు ప్రథమ బహుమతి.
  • 2007లో చతుర నవలలపోటీలో చినుకుల సవ్వడి నవలకు ప్రథమ బహుమతి.
  • 2009వ సంవత్సరపు ” చాసో ” స్ఫూర్తి పురస్కారం[4].
  • 2009లో కొత్త దుప్పటి కథల సంపుటికి ఎం.వి.తిరుపతయ్య సాహిత్య పురస్కారం.
  • 2009లో కొత్త దుప్పటి కథల సంపుటికి విమలాశాంతి సాహిత్య పురస్కారం.
  • 2010లో కొత్త దుప్పటి కథల సంపుటికి మాడభూషి రంగాచార్య అవార్డు.
  • 2012లో కొత్త దుప్పటి కథల సంపుటికి రాచకొండ రచనా పురస్కారం.
  • 2013లో ఒక్క వాన చాలు నవలకు నవ్య వీక్లీ నవలల పోటీలో ప్రథమ బహుమతి.
  • 2013లో కొత్త దుప్పటి కథల సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం.
  • 2014లో కొత్త దుప్పటి కథల సంపుటికి కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.[5]
  • 2015లో మబ్బువాలని నేల నవలకు సిపియం 21వ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి.
  • 2017లో ఒంటరి నవలకు తానా నవలల పోటీలో బహుమతి.
  • 2017లో ఒక్కవాన చాలు నవలకు కొలకలూరి విశ్రాంతమ్మ సాహితీ పురస్కారం.

రచనలు- సాహిత్య పురస్కారాలు

[మార్చు]

ఇప్పటిదాకా - దాదాపు 150 కవితలు, 75 కథలు, 9 నవలలు ప్రచురితమయ్యాయి

  • కవితల సంపుటి-- 'బడి'
  • రెండు కథల సంపుటులు 1)'కొత్తదుప్పటి ' 2)'బతుకు సేద్యం' 3)మరొక కథల సంపుటి రాబోతోంది

నవలలు

[మార్చు]
  1. కాడి {1998- ఆటా నవలల పోటీలో ద్వితీయ బహుమతి}
  2. పాండవబీడు {2002- స్వాతి వీక్లీ అవార్ద్}
  3. పాలెగత్తె {2007- స్వాతి వీక్లీ అవార్ద్}
  4. తోలుబొమ్మలాట {2007-ఆటా నవలలపోటీలో ప్రథమ}
  5. చినుకులసవ్వడి {07-చతుర నవలలపోటీలో ప్రథమ }
  6. ఒక్కవాన చాలు {2013- నవ్య వీక్లీ నలల పోటీలో ప్రథమ}
  7. మబ్బులు వాలని నేల{2015- సిపియం 21వ అ.భా.మహాసభల సందర్భపు పోటీలో ద్వితీయ}
  8. ఒంటరి{2017 మే తానా నవలలపోటీలో ₹40,000/- బహుమతి}
  9. కొండపొలం (2019 తానా నవలల పోటీలో ₹200000/- బహుమతి)

సాహిత్య పురస్కారాలు

[మార్చు]
కొత్తదుప్పటి కథల సంపుటికి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాలు
  1. చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారం,విజయనగరం -- 2009
  2. ఎం.వీ.తిరుపతయ్య సాహిత్య పురస్కారం, వరంగల్—2009
  3. విమలాశాంతి సాహిత్య పురస్కారం, అనంతపురం -- 2009
  4. మాడభూషి రంగాచార్య స్మారక కథాపురస్కారం. హైదరాబాద్—2010
  5. రాచకొండ రచనాపురస్కారం, శ్రీకాకుళం -- 2012
  6. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపురస్కారం- 2013
  7. కొండేపూడి శ్రీనివాసరావు సాహితీసత్కారం, గుంటూరు – 2014
  8. రావూరి భరద్వాజ స్మారక సాహిత్య పురస్కారం 2022
  9. "ఒక్క వాన చాలు" నవలకు --2017 కొలకలూరి విశ్రాంతమ్మ సాహితీ పురస్కారం
  10. అమృతలత జీవన సాఫల్య పురస్కారం, 05.03.2023,ఆర్మూరు, నిజామాబాద్. మంత్రి శ్రీదేవి, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు, ఏనుగు నరసింహారెడ్డి, నెల్లుట్ల రమాదేవి
'బడి' కవితల సంపుటికి వచ్చిన పురస్కారాలు
  1. చం.స్పందన సాహిత్య పురస్కారం-2018; అనంతపురం 13.11.2019 సింగమనేని నారాయణ
  2. 'పాతూరి మాణిక్యమ్మ సాహిత్యపురస్కారం -నెల్లూరు'. 30.06.2019 శిలాలోలిత, దార్ల దేవదానంరాజు
  3. 'KNR (కొండసాని నారాయణరెడ్డి సాహిత్యపురస్కారం)' - పుట్టపర్తి, 03.11.2019,
  4. 'కళ్ళే శేషశయనం స్మారక సాహితీరత్న జాతీయ పురస్కారం' -బెంగలూరు. 10.11.2019 (Karnataka Telugu Writers Federation Bangalore)
'పంపకాలు' కథ నాటకముగా రూపొందించగా వివిధ ప్రాంతాలలో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీలలో 50కి పైగా బహుమతులు (ప్రథమ,ద్వితీయ) సాధించింది.
  • 'కన్నీటి కత్తి' కథ షార్ట్ ఫిల్మ్ గానిర్మించ బడింది.
  • 'కొండపొలం' నవల క్రిష్ దర్శకత్వంలో సినిమాగా రూపొందింది.

అనువాదాలు

[మార్చు]

15 కథలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.

  • “చినుకుల సవ్వడి” నవల “Sound of raindrops” పేరుతో ఆంగ్లంలోకి అనువాదమయి “తరంగ” అంతర్జాల పత్రికలో ధారావాహికగా ప్రచురితమయ్యింది. 2017 లో పుస్తక రూపంలో వెలువడింది
  • కొత్తదుప్పటి, తడి, కన్నీటికత్తి,తమ్ముడి ఉత్తరం- మొదలైన కథలు హిందీలోకి అనువాదమయ్యాయి.
  • “భయం నీడ” 'కన్నీటి కత్తి' కథలు కన్నడ భాషలోకి అనువాదమయ్యాయి..
  • "కొత్తదుప్పటి" కథ ఒరియా భాషలోకి అనువాదమయ్యింది.
  • 'చనుబాలు' కథ తమిళంలోకి అనువాదం అయింది
  • 'బతుకు సేద్యం' కథ కన్నడలోకి అనువాదం అయ్యింది
  • 'కొండపొలం' నవల 'Tiger lessons' పేరుతో ఆంగ్లంలోకి అనువాదమై 'Bloomsbury' ప్రచురణసంస్థ 2022 ఏప్రిల్ న కుమారనరసింహ, నాతో ఒప్పందం కుదుర్చుకొంది.

సాహిత్యం మీద పరిశోధనలు

[మార్చు]
పీహెచ్.డీలు
  1. సన్నపురెడ్డి కథలు - నవలలు అనుశీలన :-- కుమ్మెత నారాయణ రెడ్డి, నవంబరు -2011, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం
  2. సన్నపురెడ్డి రచనలు- పరిశీలన :--పులి వెంకటరమణారెడ్డి, మే - 2015, ఆంధ్రా యూనివర్శిటీ
ఎంఫిల్ లు
  1. సన్నపురెడ్డి ' కాడి నవల-రైతు జీవిత చిత్రణ:--ఐ.జయకుమార్ జూన్ - 2011, హైదరాబాద్ యూనివర్శిటీ
  2. కాడి నవల- ఒక పరిశీలన:-- కె.మధుసూదన్ రెడ్డి మార్చి -2012, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటి

మూలాలు

[మార్చు]
  1. ఎం.విజయభాస్కర రెడ్డి. "సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి". ysrకడప. Retrieved 11 March 2015.[permanent dead link]
  2. స్వాతి శ్రీపాద. "Sound of Raindrops". కినిగె.కాం. Archived from the original on 3 మే 2015. Retrieved 11 March 2015.
  3. ఎస్.వెంకట్రామిరెడ్డి (1987-02-06). "కడితివేట". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 79 (23): 44–47. Archived from the original on 2016-03-10. Retrieved 11 March 2015.
  4. తవ్వా ఓబుల్‌రెడ్డి (2009-01-28). "సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కి ఘనంగా "చాసో స్ఫూర్తి" పురస్కార ప్రదానం". పొద్దు అంతర్జాల పత్రిక. Retrieved 11 March 2015.
  5. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.

బాహ్య లంకెలు

[మార్చు]