ప్రొతిమా బేడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రొతిమా బేడీ
జననం
ప్రొతిమా గుప్తా[1]

(1948-10-12)1948 అక్టోబరు 12
ఢిల్లీ, భారతదేశం
మరణం1998 ఆగస్టు 18(1998-08-18) (వయసు 49)
మల్పా, పితోరాఘర్, భారతదేశం
జాతీయతఇండియన్
వృత్తి
  • భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి
  • మోడల్
జీవిత భాగస్వామి
(m. 1969; div. 1974)
పిల్లలు2, పూజా బేడి, సిద్ధార్థ్ బేడి
బంధువులుఅలయా ఫర్నిచర్‌వాలా (మనవరాలు)
నృత్యగ్రామ్ లో కేలుచరణ్ మోహపాత్రకు అంకితం చేయబడిన ఆలయం

ప్రొతిమా గౌరీ బేడీ[2][3] (1948 అక్టోబరు 12 - 1998 ఆగస్టు 18)[4] ఒక భారతీయ మోడల్. ఆమె ఒడిస్సీ సాంప్రదాయ నృత్య కళాకారిణి కూడా. ఆమె 1990లో బెంగుళూరు సమీపంలోని ఒక గ్రామంలో నృత్యగ్రామ్ అనే నృత్య పాఠశాలను స్థాపించింది.

జీవితం తొలి దశలో[మార్చు]

హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన లక్ష్మీచంద్ గుప్తా, బెంగాలీ అయిన రెబా లకు ప్రొతిమా బేడి ఢిల్లీలో జన్మించింది.[5] వీరికి నలుగురు సంతానం, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో ప్రొతిమా బేడి రెండవది.

ఆమె కుటుంబం 1953లో గోవాకు, 1957లో ముంబాయికి మారింది. ఆమె తొమ్మిదేళ్ల వయసులో కొంతకాలం కర్నాల్ జిల్లాలోని ఒక గ్రామంలో తన అత్త వద్ద ఉండి స్థానిక పాఠశాలలో చదువుకుంది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత, ఆమెను పంచగనిలోని కిమ్మిన్స్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఆ తరువాత ముంబాయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో 1965-67 సంవత్సరాలలో విద్యనభ్యసించి డిగ్రీ పట్టభద్రురాలైంది.[6]

కెరీర్[మార్చు]

మోడలింగ్[మార్చు]

ఆమె 1960ల చివరి నాటికి ఒక ప్రముఖ మోడల్. 1974లో ముంబాయిలోని జుహు బీచ్‌లో సినీబ్లిట్జ్ (Cine Blitz) అనే బాలీవుడ్ మ్యాగజైన్ ప్రారంభోత్సవం కోసం ఆమె పగటిపూట స్ట్రీకింగ్ చేయడం ద్వారా వార్తల్లో చేరింది.[7]

డ్యాన్సర్[మార్చు]

1975 ఆగస్టులో, 26 సంవత్సరాల వయస్సులో ప్రొతిమా బేడి ఒక ఒడిస్సీ డ్యాన్స్ రిసైటల్ యాదృచ్ఛికంగా భులాభాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌ వెళ్ళినప్పుడు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.[8] అక్కడ ఇద్దరు యువ నృత్యకారులు ఒడిస్సీ ప్రదర్శన ఇవ్వడం చూసింది. ఆమె గురు కేలుచరణ్ మోహపాత్ర విద్యార్థిగా మారింది. ఆమె ప్రారంభంలో రోజుకు 12 నుండి 14 గంటల పాటు కష్టపడి నృత్యం నేర్చుకుంది.[9]

ఒడిస్సీ నృత్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రొతిమా బేడి చెన్నైకి చెందిన గురువు కళానిధి నారాయణన్ దగ్గరకు చేరింది. ఇక అప్పటి నుంచి ఆమె దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. అదే సమయంలో ముంబైలోని జుహూలోని పృథ్వీ థియేటర్‌లో ఆమె డ్యాన్స్ స్కూల్‌ను ప్రారంభించింది. ఇది తరువాత ఒడిస్సీ నృత్య కేంద్రంగా మారింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె మోడలింగ్ చేసే రోజుల్లోనే కబీర్ బేడీతో పరిచయం వివాహానికి దారితీసి తల్లిదండ్రుల నుండి విడిపోయింది. వారికి ఇద్దరు పిల్లలు - పూజా బేడి, సిద్ధార్థ్ బేడి. 1974లో ప్రొతిమా బేడి, కబీర్ బేడీ వారు విడిపోయారు.

మూలాలు[మార్చు]

  1. This Above All - She had a lust for life The Tribune, 5 February 2000.
  2. Obituary Archived 2 ఆగస్టు 2009 at the Wayback Machine India Today, 7 September 1998.
  3. Protima Gauri Bedi nrityagram.org.
  4. Dream Nrityagram.
  5. Time Pass: The Memoirs of Protima Bedi, Introduction, pp. 1–2. Biographical info: "Early Years"
  6. Time Pass: The Memoirs of Protima Bedi, Introduction, pp. 1–2. Biographical info: "Early Years"
  7. Protima's interview on naked run Archived 2006-03-06 at the Wayback Machine Hindustan Times.
  8. Protima Guari Interview Rediff.com, 22 August 1998.
  9. Bina Ramani Mourns... Indian Express, 22 September 1998.