కేలూచరణ్ మహాపాత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేలూచరణ్ మహాపాత్ర
జననం(1926-01-08)1926 జనవరి 8
రఘురాజ్‌పూర్, పూరీ, ఒడిషా , భారతదేశం
మరణం2004 ఏప్రిల్ 7(2004-04-07) (వయసు 78)
భువనేశ్వర్, ఒడిషా, భారతదేశం
వృత్తిభారతీయ శాస్త్రీయ నృత్య కళాకారుడు,
క్రియాశీల సంవత్సరాలు1935–2004
జీవిత భాగస్వామినదితా మహాపాత్ర [1]
పిల్లలుశేఖర్ మహాపాత్ర
పురస్కారాలుపద్మవిభూషణ్

కేలూచరణ్ మహాపాత్ర (8 జనవరి 1926 – 7 ఏప్రిల్ 2004) ఒక భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారుడు, గురువు. ఇతడు ఒడిస్సీ నృత్యాన్ని జనబాహుళ్యం లోనికి తీసుకువచ్చాడు.[2] ఇతడు ఒడిషా రాష్ట్రం నుండి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తి.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

కేలూచరణ్ మహాపాత్ర యువకునిగా ఉన్నప్పుడు గోతిపువ అనే సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించేవాడు. ఈ నృత్యంలో యువకులు స్త్రీ వేషధారణలో జగన్నాథ స్వామిని ఆరాధిస్తారు. తరువాత ఈ సంప్రదాయ నృత్యంపై ఇతడు లోతుగా పరిశోధనలు చేశాడు. దీనితో పాటు మహరి నృత్యం గురించి కూడా లోతైన పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధనలు ఒడిస్సీ నృత్యాన్ని పునర్మించడానికి ఇతనికి ఉపయోగపడ్డాయి. ఇతడు మద్దెల, తబలా వంటి వాద్యపరికరాలను ఉపయోగించడంలో సిద్ధహస్తుడు. ఇతనికి ఒరిస్సా సంప్రదాయ చిత్రకళ పట్టచిత్రలో కూడా ప్రవేశం ఉంది.

కేలూచరణ్ మహాపాత్ర, అతని భార్య నర్తకి లక్ష్మీప్రియ, వారి కుమారుడు రజనీకాంత్ మహాపాత్ర 1993లో సృజన్ అనే నృత్య సంస్థను స్థాపించారు.[4]

పురస్కారాలు

[మార్చు]
రఘురాజపూర్‌లోని కేలూచరణ్ మహాపాత్ర జన్మించిన ప్రదేశం.
భువనేశ్వర్‌లోని కేలూచరణ్ మహాపాత్ర విగ్రహం

మూలాలు

[మార్చు]
  1. Remembering the maestro[permanent dead link] Leela Venkatraman, The Hindu, 15 April 2005.
  2. DANCE REVIEW; Sculptural And Sensual, It's Odissi by Anna Kisselgoff, New York Times, 19 October 2000.
  3. Sampad, Shilpi (26 January 2013). "Sun dreamer gets Padma". telegraphindia.com. Calcutta, India. Retrieved 5 February 2013. after late Odissi dancer Guru Kelucharan Mohapatra
  4. "History Of Srjan". Srjan. Retrieved 3 June 2018.
  5. 5.0 5.1 5.2 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.

ఇవి చదవండి

[మార్చు]
బెంగళూరు సమీపంలోని నృత్యగ్రామ్‌లో కేలూచరణ్ మహాపాత్రకు అంకితం చేసిన ఒక దేవాలయం
  • ది మేకింగ్ ఆఫ్ గురు:కేలూచరణ్ మహాపాత్ర, హిజ్ లైఫ్ అండ్ టైమ్స్, ఇలీనా సిటారిస్తి 2001. ISBN 81-7304-369-8.
  • ది డాన్సింగ్ ఫినామినన్: మ్యాడ్ బాయ్, షరాన్ లోవెన్, కేలూచరణ్ మహాపాత్ర, అవినాష్ పశ్రిచా 2001. ISBN 81-7436-179-0.

బయటి లింకులు

[మార్చు]
Video links