జగన్నాథ స్వామి
జగన్నాధస్వామి | |
---|---|
అనుబంధం | విష్ణుమూర్తి అంశ |
నివాసం | నీలగిరి |
మంత్రం | ఓం క్లిం కృష్ణాయ, గోవిందాయ, గోపీజన వల్లభాయ నమ: |
ఆయుధములు | సుదర్శన చక్రం |
భర్త / భార్య | లక్ష్మీ |
జగన్నాధుడు అంటే జగత్తు (ప్రపంచం)కు నాధుడు అని అర్ధం. హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు, బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు. భారత దేశం లోని ఒడిశా, [ఆంధ్ర ప్రదేశ్], చత్తీస్ గఢ్, బెంగాల్, ఝార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ[1], బంగ్లాదేశ్ లోని హిందువులు ఎక్కువగా కొలుస్తారు. జగన్నాధస్వామిని విష్ణుమూర్తిగానూ, విష్ణు అవతారమైన కృష్ణుని గానూ భావిస్తారు భక్తులు.[2] ప్రతీ సంవత్సరం పూరీ క్షేత్రంలోని రత్నవేది (రత్నాల వీధి)లో ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్ర లతో కలసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు.
జగన్నాధ స్వామి విగ్రహాన్ని దారువుతో తయారుచేస్తారు. శరీరం, చేతులు మాత్రమే ఉండే ఈ విగ్రహానికి కాళ్ళు ఉండవు. పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి. జగన్నాధుని పూజా కార్యక్రమాలు సాధారణంగా హిందూ సంప్రదాయ ఆగమాల ప్రకారం కాకుండా భిన్నంగా ఉంటాయి.[3] ఇతర విగ్రహాలను మట్టితోనో, రాతితోనో, ఏదైనా లోహంతోనో చేస్తే ఈ విగ్రహాన్ని మాత్రం చెక్కతో తయారు చేయడం విశేషం.[4] ఈ జగన్నాధస్వామి పూజ, విగ్రహ తయారీ ప్రారంభానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
నిజానికి వేదాలలో ఈ జగన్నాధస్వామి ప్రస్తావన తక్కువే అని చెప్పాలి. ఈ అవతారం దశావతారల్లో ఒకటి కాదు.[5] కానీ కొన్ని ఒరియా రచనలు 9వ అవతారమైన బుద్ధావతరం బదులు ఈ జగన్నాధ అవతారాన్ని వర్ణించాయి. దాంతో ఆ ప్రాంతంలోనూ, దాని చుట్టుపక్కల ప్రదేశాల్లోనూ ఈ స్వామి ఆరాధన ఎక్కువగా ఉంది.[6]
జగన్నాధస్వామి విష్ణుమూర్తికి అవతారంగా పేర్కొంటుంటారు.[7][8][9] వైష్ణవం, శైవం, శాక్తేయం, స్మార్తం, బౌద్ధం, జైనమతాలకు సమానంగా ఒక ప్రత్యేకమైన శాఖగా నిలిచింది ఈ జగన్నాధ ఆరాధన.
పూరీలో ఉన్నది జగన్నాధ దేవాలయాలలో అత్యంత ప్రాచీనమైనది. భారతదేశంలోని హిందువులు తప్పక దర్శించాల్సిన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పూరీని భావిస్తారు. దానినే చార్ ధామ్ (బద్రీనాధ్, పూరీ, కాశీ, రామేశ్వరం) యాత్ర అంటారు.[10]
జగన్నాధ రథయాత్ర అనేది జగన్నాధస్వామికి చేసే ప్రసిద్ధమైన ఉత్సవం. ఈ యాత్రలో జగన్నాధస్వామితో పాటు ఆయన అన్న బలభద్రుని, చెల్లెలు సుభద్రాదేవిని కూడా పూజించి, ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు కోసం విగ్రహాలను గర్భగుడిలో నుంచి బయటకు తీసుకొచ్చి పూరీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా గుడి వరకు రథయాత్రగా తీసుకెళ్తారు. ఈ ఉత్సవం మాదిరిగానే ప్రపంచంలోని చాలా జగన్నాధ ఆలయాల్లో కూడా రథయాత్ర చేస్తుంటారు.
జగన్నాధ శబ్ద ప్రాశస్త్యం
[మార్చు]జగన్నాధ అంటే లోకానికి నాధుడు అని అర్ధం.[11] ఈ పదం సంస్కృత భాష నుంచి ఉత్పన్నమైంది.
ఈ పదానికి ఒడియాలో "తిరిగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు" అని అర్ధం కూడా ఉంది.[12][13]
మూలాలు
[మార్చు]- ↑ Tripathy, B; Singh P.K. (June 2012).
- ↑ Jayanti Rath. "Jagannath- The Epitome of Supreme Lord Vishnu" (PDF).
- ↑ ""Synthetic Character of Jagannath Culture", Pp. 1–4" (PDF). Archived from the original (PDF) on 2011-07-08. Retrieved 2016-08-25.
- ↑ "The unfinished Jagannath idol at Puri". Our Dharma. Retrieved 21 October 2012.
- ↑ Wilkins, William Joseph (1900). Hindu Mythology, Vedic and Puranic. London: Elibron Classics. ISBN 81-7120-226-8.
- ↑ Mukherjee, Prabhat The history of medieval Vaishnavism in Orissa.
- ↑ Pradhan, Atul Chandra (June 2004).
- ↑ Patnaik, Bibhuti (July 3, 2011). "My friend, philosopher and guide". The Telegraph. Retrieved 1 December 2012.
- ↑ Misra, Narayan (2005). Annals and Antiquities of the Temple of Jagannātha. Jagannathism: Sarup& Sons. p. 97.
- ↑ See: Chakravarti 1994, p 140
- ↑ Das, Basanta Kumar (2009). "Lord Jagannath Symbol of National Integration" (PDF). Orissa Review. Retrieved 10 December 2012.
The term Jagannath etymologically means the Lord of the Universe
- ↑ Miśra, Mishra, Narayan, Durga Nandan (2007). Annals and antiquities of the temple of Jagannātha. Sarup & Sons. p. 190. ISBN 978-81-7625-747-3.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ Eschmann, Anncharlott (1978). The Cult of Jagannath and the regional tradition of Orissa. University of California, California, San Francisco, USA: Manohar. p. 537.