హేమానంద బిశ్వాల్
హేమానంద బిశ్వాల్ | |||
| |||
12వ ముఖ్యమంత్రి
| |||
---|---|---|---|
పదవీ కాలం 6 డిసెంబర్ 1999 – 5 మార్చి 2000 | |||
గవర్నరు | ఎం.ఎం. రాజేంద్రన్ | ||
ముందు | గిరిధర్ గమాంగ్ | ||
తరువాత | నవీన్ పట్నాయక్ | ||
పదవీ కాలం 7 డిసెంబర్ 1989 – 5 మార్చి 1990 | |||
గవర్నరు | సైయిద్ నూరుల్ హాసన్ యాగ్య దత్ శర్మ | ||
ముందు | జానకి బల్లభ్ పట్నాయక్ | ||
తరువాత | బిజు పట్నాయక్ | ||
నియోజకవర్గం | లయికెరా | ||
ఎంపీ, లోక్‌సభ
| |||
పదవీ కాలం 2009-2014 | |||
ముందు | జుయల్ ఓరం | ||
తరువాత | జుయల్ ఓరం | ||
నియోజకవర్గం | సుందర్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఠకురొపొడా గ్రామం, ఒడిషా, భారతదేశం | 1939 డిసెంబరు 1||
మరణం | 2022 ఫిబ్రవరి 25 భుబనేశ్వర్, ఒడిషా, భారతదేశం | (వయసు 82)||
జీవిత భాగస్వామి | ఊర్మిళ బిస్వాల్ | ||
సంతానం | సబితా, సంజూక్త, మంజులత, సునీతా & అమిత | ||
నివాసం | ఠకురొపొడా గ్రామం, ఝార్సుగుడ జిల్లా | ||
వెబ్‌సైటు | http://hemanandbiswal.com/ |
హేమానంద బిశ్వాల్ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఒడిషా రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]హేమానంద బిశ్వాల్ 1939 డిసెంబరు 1న ఒడిషా రాష్ట్రం, ఝార్సుగూడ జిల్లాలోని ఠాకూర్‌పాడలో జన్మించాడు. అతను ఇంటర్మీడియట్ వరకు చదివాడు.
రాజకీయ జీవితం
[మార్చు]హేమానంద బిశ్వాల్ 1970లో ఝార్సుగుడ జిల్లా, కిరిమిరా పంచాయతీ సర్పంచ్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. అతను 1974లో లయికెరా నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను తరువాత 1980 నుంచి 2004 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1985 నుంచి 1986 వరకు రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.
హేమానంద బిశ్వాల్ 1989 డిసెంబరు 7 నుండి 1990 మార్చి 5 వరకు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై ఒడిషా రాష్ట్రంలో మొదటి గిరిజన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు. అతను ఆ తర్వాత 1999 డిసెంబరు 6 నుంచి 2000 మార్చి 5 వరకు రెండవసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. హేమానంద బిశ్వాల్ 2009 నుంచి 2014 వరకు సుందరగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికై ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును అందుకున్నాడు.
నిర్వహించిన భాద్యతలు
[మార్చు]- 1967 నుండి 1971 - కిరిమిరా పంచాయతీ సర్పంచ్
- 1974 నుండి 1977 & 1980 నుండి 2004 వరకు (6 సార్లు ఎమ్మెల్యే)
- 1985 నుండి 1986 వరకు రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
- 1989 డిసెంబరు 7వ తేదీ నుంచి 1990 మార్చి 5 రాష్ట్ర ముఖ్యమంత్రి
- 1995 నుండి 1998 వరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
- 1999 డిసెంబరు 6వ తేదీ నుంచి 2000 మార్చి 5 రాష్ట్ర ముఖ్యమంత్రి
- 2000 - 2014 సుందరగఢ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ[1]
మరణం
[మార్చు]హేమానంద బిశ్వాల్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022 ఫిబ్రవరి 25న మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Members : Lok Sabha (2014). "Hemanand Biswal". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ V6 Velugu (25 February 2022). "ఒడిశా మాజీ సీఎం హేమానంద బిశ్వాల్ కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (26 February 2022). "ఒడిశా మాజీ సీఎం హేమానంద బిశ్వాల్ కన్నుమూత". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ Eenadu (26 February 2022). "ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కన్నుమూత". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.