గిరిధర్ గమాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిధర్ గమాంగ్
గిరిధర్ గమాంగ్


పదవీ కాలం
17 ఫిబ్రవరి 1999 – 6 డిసెంబర్ 1999
ముందు జాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్
తరువాత హేమానంద బిశ్వాల్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2009
ముందు హేమ గమాంగ్
తరువాత జయరాం పాంగి
నియోజకవర్గం కోరాపుట్
పదవీ కాలం
1972 – 1999
ముందు భగీరథీ గమాంగ్
తరువాత హేమ గమాంగ్
నియోజకవర్గం లక్ష్మిపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1943-04-08) 1943 ఏప్రిల్ 8 (వయసు 81)
డిబిరిసింగి, రాయగడ జిల్లా, ఒడిశా
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ బీఆర్ఎస్
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి హేమ గమాంగ్
సంతానం 2 కుమారులు & 1 కుమార్తె
నివాసం రాయగడ, ఒడిశా
మూలం [1]

గిరిధర్‌ గమాంగ్‌ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 ఫిబ్రవరి 17 నుండి 1999 డిసెంబర్ 6 వరకు ఒడిషా రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1972లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1972 నుండి 2004 వరకు 9 సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు.

గిరిధర్ గమాంగ్ లోక్‌సభ సభ్యుడిగా ఉంటూనే 1999 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు పది నెలల పాటు ఒడిశా 13వ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాడు. అప్పట్లో బలాబలాలు చాలా క్లిష్టంగా ఉండటంతో చివరికి ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. గిరిధర్ గమాంగ్ ఆ తరువాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాడు. గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీని విడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన 2023 జనవరి 27న హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ సమక్షంలో భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేరాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2023). "Giridhar Gamang". loksabha.nic.in. Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  2. The Hindu (12 June 2015). "Former Odisha CM Giridhar Gamang joins BJP" (in Indian English). Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  3. Eenadu (27 January 2023). "కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  4. HMTV (27 January 2023). "కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
  5. Eenadu (18 January 2024). "సొంతగూటికి మాజీ సీఎం.. కాంగ్రెస్‌లో చేరిన గిరిధర్‌ గమాంగ్‌". Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.