రాసిపురం తాలూకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాసిపురం రైల్వే స్టేషన్,

రాసిపురం తాలూకా, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, నమక్కల్ జిల్లాకు చెందిన తాలూకాలలో ఇది ఒకటి. తాలూకు ప్రధాన కేంద్రం రాసిపురం పట్టణం.తాలూకా పరిధిలో పట్టణాలు 8, గ్రామాలు 109 గ్రామాలు ఉన్నాయి.[1]ఇందులో నిర్జన గ్రామాలు 17 పోగా 92 గ్రామాలు ఉన్నాయి.[2]ఇది రాసిపురం లోకసభ నియోజకవర్గం, రాసిపురం శాసనసభ నియోజకవర్గంలకు ప్రధాన కేంద్రంగా ఉంది.[3]

బౌగోళికం[మార్చు]

రాసిపురం 11.47 ° N 78.17 ° E వద్ద ఉంది. ఇది సముద్రమట్టానికి సగటు ఎత్తు 246 మీటర్లు (807 అడుగులు). కొల్లి హిల్స్ రాసిపురం నుండి సరిగ్గా 54 కి.మీ. (34 మైళ్ళు) దూరంలో ఉంది. జాక్‌ఫ్రూట్, పైనాపిల్, అరటి వంటి పండ్ల,ఔషధ మొక్కలు చాలా అందుబాటులో ఉన్నాయి.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, రాసిపురం తాలూకాలో మొత్తం జనాభా 339,790 మంది ఉన్నారు. అందులో 173,079 మంది పురుషులు, 166,711 మంది మహిళలు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 963 మంది మహిళలు ఉన్నారు. తాలూకా అక్షరాస్యత రేటు 66.49. 6 ఏళ్లలోపు వయస్సులో ఉన్న బాలల జనాభా 14,573 మంది పురుషులు, 12,917 ఆడవారు[4].

తాలూకా పరిధిలో పట్టణాలు, జనాభా[మార్చు]

 1. రాసిపురం మున్సిపాలిటీ - మొత్తం జనాభా 50,244
 2. నమగిరిపేట్టై పట్టణ పంచాయతీ - మొత్తం జనాభా 21,250
 3. వెన్నంతూర్ టౌన్ పంచాయతీ - మొత్తం జనాభా 14,568
 4. సీరపల్లి టౌన్ పంచాయతీ - మొత్తం జనాభా 12,403
 5. పిల్లనల్లూర్ టౌన్ పంచాయతీ - మొత్తం జనాభా 11,181
 6. అతనూర్ టౌన్ పంచాయతీ - మొత్తం జనాభా 9,827
 7. పట్టినం టౌన్ పంచాయతీ - మొత్తం జనాభా 8,912
 8. ఆర్.పుదుపట్టి పట్టణ పంచాయతీ - మొత్తం జనాభా 7,478

మూలాలు[మార్చు]

 1. "Villages and Towns in Rasipuram Taluka of Namakkal, Tamil Nadu - Census India". www.censusindia.co.in (in ఆంగ్లం). Retrieved 2020-08-06.
 2. "Villages & Towns in Rasipuram Taluka of Namakkal, Tamil Nadu". www.census2011.co.in. Retrieved 2020-08-06.
 3. "Wayback Machine" (PDF). web.archive.org. 2006-05-04. Retrieved 2020-08-06.
 4. "Provisional Population Totals - Tamil Nadu-Census 2011" (PDF). Census Tamil Nadu. Archived from the original (PDF) on 17 June 2013. Retrieved 4 July 2013.

వెలుపలి లంకెలు[మార్చు]