కోడ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఒక భాగం సమాచారాన్ని (ఉదాహరణకు, ఒక అక్షరం, పదం, పదబంధం, లేదా సంజ్ఞ) ఇంకొక విధంగా మార్చే పద్ధతిని కోడ్ అంటారు. సాధారణంగా రూపాన్ని లేదా ప్రాతినిధ్యాన్ని, ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేని వాటిని కుదించేందుకు లేదా మార్చేందుకు కోడ్ ను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు రహస్య సందేశాన్ని రహస్యంగా ఉంచేందుకు, రహస్య సందేశాలు ఇతరులకు అర్థం కాకుండా మరొక చోటకు చేరవేసేందుకు ఈ కోడ్ మార్గాన్ని ఉపయోగిస్తారు. రహస్య సందేశాలు పంపేందుకు ఉపయోగించే కోడ్ లిపిని గూఢ లిపి అంటారు.
రెండు వేర్వేరు పడవలలోని ప్రజలు ఒక పడవ నుంచి మరొక పడవకు సందేశాలను పంపాలనుకున్నప్పుడు, వారు మాట్లాడుకోవడానికి చాలా దూరంలో ఉన్నట్లయితే, వారు జెండా కోడ్ తో సందేశాలను పంపుకుంటారు.
మోర్స్ కోడ్ అని పిలవబడే మరొక కోడ్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు, ఇది అక్షరాలను చుక్కలు, డాష్ లతో మారుస్తుంది. ఈ విధంగా: SOS: ···−−−···
కంప్యూటర్లలో 1, 0 అక్షరాలను మార్చడం ద్వారా, కోడులు ఉపయోగిస్తారు. దీనిని ASCII కోడ్ అంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- పిన్కోడ్ - ఊరు చిరునామాను తెలియజేసే తపాలా సూచిక సంఖ్య
- బార్ కోడ్ - దృశ్యమాన యంత్రం చదవడానికి ఉపయోగించే డేటా
- యూనికోడ్ -
- టెలిగ్రాఫ్లో ఉపయోగించే మోర్స్ కోడ్.
- క్యూఆర్ కోడ్ - త్వరిత స్పందన సంకేతం