సిలిగురి కారిడార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిలిగురి కారిడార్ అనేది, ఎరుపు రంగులో హైలైట్ చేసిన వృత్తం లోని భూభాగం.

సిలిగురి కారిడార్, భారతదేశం, పశ్చిమ బెంగాల్‌ లోని సిలిగురి నగరం చుట్టూ విస్తరించి ఉన్న భూభాగం. [1] [2] ఈ భూభాగం వెడల్పు అత్యంత సన్నగా ఉండే చోట 20–22 kilometres (12–14 mi) ఉంటుంది. దీని ఆకారాన్ని బట్టి దీన్ని "కోడిమెడ" (చికెన్ నెక్) అని అంటారు. ఈ భౌగోళిక-రాజకీయ, భౌగోళిక-ఆర్థిక కారిడార్ ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. [1] కారిడార్‌కు ఇరువైపులా నేపాల్, బంగ్లాదేశ్ దేశాలు ఉండగా, కారిడారుకు ఉత్తర కొసన భూటాన్ ఉంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం, ఈ ప్రాంతంలోని ప్రధాన నగరం. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, సిక్కిం, డార్జిలింగ్, ఈశాన్య భారతదేశం - వీటన్నిటినీ కలిపే కేంద్ర బిందువు.

చరిత్ర[మార్చు]

భారతదేశ విభజనతో 1947-1948లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ ) ఏర్పాటవడంతో సిలిగురి కారిడార్ ఏర్పడింది. [3]

గతంలో సిక్కిం రాజ్యం కారిడార్‌కు ఉత్తరాన ఉండేది. 1975లో బహిరంగంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తరువాత, సిక్కిం భారతదేశంలో విలీనమై ఒక రాష్ట్రంగా ఏర్పడింది. [4] [5] ఇది సిలిగురి కారిడార్‌కు ఉత్తరాన భారతదేశానికి బఫర్‌ను అందించింది. చుంబి లోయ యొక్క పశ్చిమ భాగంలో భారతదేశ నియంత్రణను ఏకీకృతం చేసింది.

స్థానం, కొలతలు[మార్చు]

కారిడార్ కొలతలు. దూరాలు కిలోమీటర్లలో.

కారిడార్ కొలతలు వివిధాలుగా ఉన్నాయి. [6] 170 by 60 km (106 by 37 mi) వైశాల్యం కలిగిన భూభాగం ఇది. అత్యంత సన్నని చోట దీని వెడల్పు 20–22 km (12–14 mi) . [1] [2] కమల్ జిత్ సింగ్, దీని పొడవు 200 km (120 mi), వెడల్పు 17 to 60 km (11 to 37 mi) ఉంటుందని చెప్పాడు. ఆ ప్రకారం దీని విస్తీర్ణం సుమారు 12,200 km2 (4,700 sq mi) ఉంటుంది. [6] మరొక వివరణ ప్రకారం దాని కొలతలు సుమారుగా 200 km (120 mi) పొడవు, 20 to 60 km (12 to 37 mi) వెడల్పుతో సుమారు 12,200 km2 (4,700 sq mi) వైశాల్యం ఉంటుంది. [7]

కారిడార్‌కు సమీపంలో, నైరుతిలో బంగ్లాదేశ్, తూర్పున నేపాల్, ఉత్తరాన భూటాన్‌కు ఉన్నాయి. [8] సిక్కిం, భూటాన్ల మధ్య ఉన్న చుంబి లోయ టిబెటన్ భూభాగం నుండి బాకు లాగా చొచ్చుకు వచ్చిన ముక్క. [9] డోలామ్‌ పీఠభూమి లేదా డోక్లామ్ మూడు హద్దుల ప్రాంతానికి దక్షిణ కొసన కారిడార్‌లోకి వంగి ఉంటుంది. [10] అత్యంత సన్నగా ఉండే చోట ఈ కారిడార్, తూర్పున మెచి నది ద్వారా ఏర్పడుతుంది; నేపాల్‌లోని భద్రాపూర్ ఈ నది ఒడ్డున ఉంది. [11] ఉత్తరాన మెచ్చి బ్రిడ్జి మేచినగర్‌ను కలుపుతుంది. [12] [13]

ప్రస్తుత పరిస్థితి[మార్చు]

అనుసంధానం, లాజిస్టిక్స్[మార్చు]

ఆసియా రహదారి AH2 సిలిగురి కారిడార్ గుండా వెళుతుంది.

సిలిగురి కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా మార్గాలను రూపొందించడానికి భారత-చైనా సరిహద్దు రోడ్లు, అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ (AGLs), ఈశాన్య భారతదేశం కనెక్టివిటీ, BIMSTEC, BBIN లతో సహా లుక్-ఈస్ట్ ట్రాన్స్‌నేషనల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులను భారతదేశం ప్రారంభించింది. వీటిలో కొన్ని బంగ్లాదేశ్ గుండా, సముద్రం గుండా వెళ్తాయి.

సుదూర ఈశాన్య రాష్ట్రాలకూ మిగిలిన భారతదేశానికీ మధ్య భూ రవాణా కోసం ఈ కారిడార్‌ను ఉపయోగిస్తారు. ఈ మార్గంలోనే ప్రధానమైన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ఉంది. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (CORE) సహాయంతో ఈ డబుల్-ట్రాక్ కారిడార్ విద్యుదీకరణ పురోగతిలో ఉంది. అదనంగా, పాత మీటర్ గేజ్ లైన్ (దీన్ని 1.676 metres (5 ft 6.0 in) బ్రాడ్-గేజ్ లైనుగా మార్చారు) పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌తో సిలిగురి జంక్షన్‌ను బాగ్‌డోగ్రా (కారిడార్‌లో ఉన్న ఏకైక జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉంది), నేపాల్‌ సరిహద్దు పట్టణాలైన అధికారి, గల్గాలియా, ఠాకూర్‌గంజ్, నక్సల్బరీ, తయాబ్‌పూర్‌లను కలుపుతుంది. జాతీయ రహదారి 10, సిలిగురి నుండి అస్సాంలోని గౌహతికి వెళ్తుంది. [14]

బంగ్లాదేశ్, భారతదేశాల మధ్య స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందం లేదు. 1980 నాటి భారత-బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం లోని VIIIఆర్టికల్ క్రింద సిలిగురి కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా టెతులియా కారిడార్‌ను ప్రతిపాదించారు. "రెండు దేశాల మధ్య వాణిజ్యం కోసం, ఒక దేశంలోని రెండు ప్రదేశాల మధ్య వస్తువులను మరొకరి భూభాగం ద్వారా రవాణా చేయడం కోసం తమ జలమార్గాలు, రైల్వేలు, రహదారి మార్గాలను ఉపయోగించుకునే పరస్పర ప్రయోజనకరమైన ఏర్పాట్లు చేయడానికి రెండు ప్రభుత్వాలు అంగీకరించాయి" అని ఈ ఒప్పందం తెలుపుతుంది.  అయితే, ఈ ప్రతిపాదన ఇంకా చర్చల ప్రారంభ దశలోనే ఉంది.

భద్రత[మార్చు]

భారతదేశం సరిహద్దుల్లో అనేక దళాలను మోహరించి ఉంది. సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు చైనా సరిహద్దుల్లో ఉన్నారు; నేపాల్, భూటాన్ సరిహద్దు వెంబడి సశస్త్ర సీమా బల్, బంగ్లాదేశ్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లను మోహరించారు. [6] ఈ కారిడార్‌లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, పశ్చిమ బెంగాల్ పోలీసులతో సహా కేంద్ర పోలీసు బలగాలు కూడా పహారా కాస్తున్నాయి. [6] బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ఈ కారిడార్‌లో భద్రతా ముప్పు తగ్గింది. [15] కారిడార్‌కు అంతర్గతంగా ముప్పులు ఉన్నాయి. [15] యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ULFA), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN) వంటి మిలిటెంట్ గ్రూపులు కారిడార్‌ను ఉపయోగించుకున్నట్లు తెలిసింది. [7]

భారతీయ ప్రణాళికదారులు చైనా కారిడార్ లోకి చొచ్చుకుని వచ్చే ముప్పును పరిగణిస్తూనే ఉన్నారు. [15] చైనీయులు 130 km (81 mi) కంటే లోపే దూరం చొచ్చుకు వస్తే, దాదాపు 5 కోట్ల జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో భాగం, ఈశాన్య భారతదేశం మొత్తంతో పాటు భూటాన్‌తో కూడా మిగతా దేశానికి సంబంధాలు తెగిపోతాయి. 1962లో భారత చైనా యుద్ధంలో ఈ పరిస్థితి ఏర్పడింది. [9] 2017 డోక్లామ్ ఘటన సమయంలో ఈ కారిడార్‌కు భద్రతా ముప్పు పెరిగింది. [16] ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాల నుండి మిగతా దేశానికి సంబంధాలను చైనా తెగగొట్టే సంభావ్యత గురించిన ప్రశ్న రేకెత్తింది. [17]

జనాదరణ పొందిన సంస్కృతిలో[మార్చు]

హంఫ్రీ హాక్స్లీ, 2000 నాటి తన నవల డ్రాగన్ ఫైర్‌లో , భారత ఈశాన్య భూభాగాలకు మిగతా దేశం నుండి ఉన్న భూమార్గాన్ని చైనా తెగగొట్టే పరిస్థితిని క్లుప్తంగా రచించాడు. [7] బ్రిగేడియర్ బాబ్ బుటాలియా రచించిన అస్సాస్సిన్‌స్ మేస్ (2011) లో కూడా డోక్లాం, జల్ధకా నదికి సంబంధించిన అటువంటి పరిస్థితిని రాసాడు. [6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Singh, Mayank (7 November 2021). "Army steps up efforts to safeguard Siliguri Corridor". The New Indian Express. Retrieved 2022-01-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 Singh, Mohinder Pal (9 October 2019). "What if China wrings India's 'Chicken's Neck' – the Siliguri corridor? Here are some countermeasures". The Times of India. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-16 – via USI India.
  3. Atig Ghosh, The Importance of Being Siliguri (2018).
  4. "Sikkim Votes On Indian Merger". Daytona Beach Morning Journal. 15 April 1975. Retrieved 28 January 2018.
  5. "Sikkim Voters OK Merger With India". Sarasota Herald-Tribune. 16 April 1975. Retrieved 28 January 2018.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 Singh, Lt Gen (Retd) KJ (9 July 2017). "India ready, theoretically: 'Threats' to Siliguri Corridor war-gamed". Tribune India. Retrieved 2022-01-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. 7.0 7.1 7.2 Bhattacharya, Pinaki (2001). "The Shiliguri Corridor: Question Mark on Security". South Asia Terrorism Portal. Retrieved 2022-01-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. Marcus Franda, "Bangladesh, The First Decades", South Asian Publishers Pvt. Ltd, New Delhi, 1982, p-126
  9. 9.0 9.1 Partha S. Ghosh, "Cooperation and Conflict in South Asia", UPL, Dhaka, 1989, p-43
  10. Myers, Steven Lee; Barry, Ellen; Fisher, Max (2017-07-26). "How India and China Have Come to the Brink Over a Remote Mountain Pass". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2022-01-22.
  11. Dixit, Kanak Mani (2002-08-01). "Chicken's Neck". Himal Southasian. Retrieved 2022-01-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "Approval of MoU between India & Nepal for laying down implementation arrangement for construction of new Bridge over Mechi River at Indo-Nepal border". Business Standard India. 2017-08-23. Retrieved 2022-01-22.
  13. Khanal, Radha (26 November 2020). "Asian Highway now connected with Nepal". The Annapurna Express (in ఇంగ్లీష్). Retrieved 2022-01-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. Gokhale, Nitin A. (13 July 1998). "Chicken's Neck, All choked up". Outlook. Archived from the original on 28 April 2020. Retrieved 27 February 2011.
  15. 15.0 15.1 15.2 Joshi, Manoj (10 July 2017). "Chink In The Checker's Board". ORF/ Outlook. Archived from the original on 3 October 2018.
  16. Singh, D. K. (2018-08-11). "This is the first official account of the India-China face-off in Doklam". ThePrint. Retrieved 2022-01-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. Asthana, Alok (1 August 2017). "Does It Make Military Sense for India to Mount the Barricades at Doklam?". The Wire. Retrieved 2022-01-22.{{cite web}}: CS1 maint: url-status (link)