Jump to content

భారత చైనా సరిహద్దు రోడ్లు

వికీపీడియా నుండి
భారత చైనా సరిహద్దు రోడ్లు
భారత చైనా సరిహద్దు రోడ్లు
ICBRలు, ICB రోడ్లు
లడఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో ఎరుపురంగులో హైలైటు చెయ్యబడ్డవి
Type of projectమౌలిక వసతుల అభివృద్ధి
Current statusజరుగుతోంది (నిర్మాణం, నిర్వహణ)
Locationఅరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్
Approved1999
రోడ్ల నిడివి
Phase 13,323 కి.మీ. (2005 లో ఆమోదం పొందినది)
Phase 26,700 కి.మీ. (2020 లో ఆమోదం పొందినది)
మొత్తం నిడివి10,023 కి.మీ.
Status
Phase 12012 నాటికి 15% పూర్తైంది,[1] 2015 నాటికి 20%,[2] 2021 నాటికి 46% పూర్తై, 95% సౌకర్యం ఏర్పడింది[3]
Phase 2జరుగుతోంది
రోడ్డులో కొన్ని భాగాలు వివాదాస్పద భూభాగంలో ఉన్నాయి

భారత చైనా సరిహద్దు రోడ్లు (ఇండియా-చైనా బోర్డర్ రోడ్స్ -ఐసిబిఆర్) భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. చైనా-భారతీయ సరిహద్దులో "వ్యూహాత్మక రహదారులను" నిర్మించి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. [4] ఐసిబిఆర్ లో అనేక సంస్థలు భాగంగా ఉన్నాయి. వీటిలో ఐసిబిఆర్ రహదారి నిర్మాణ పనులలో ఎక్కువ భాగం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) చేపట్టింది. NHAI, MoDNER, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD), నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NPCC), సంబంధిత రాష్ట్రాల PWD లు, తదితరులు కూడా మిగిలిన భాగాన్ని చేపట్టాయి. [5] టిబెట్ స్వాధికార ప్రాంతంలో ఐదు ఎయిర్‌బేస్‌లు, విస్తృతమైన రైలుమార్గ నెట్‌వర్కు 58,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్ల నెట్‌వర్కు‌లతో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచుకున్న చైనా, భారతదేశాన్ని భౌగోళిక-వ్యూహాత్మక ఒత్తిడికి గురిచేయడానికి "నెమ్మదిగానే అయినప్పటికీ, స్థిరమైన కార్టోగ్రాఫిక్ దూకుడు" ను ఆశ్రయిస్తోంది. [6]

2020 డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సిన ఫేజ్ -1 లోని 73 ఐసిబిఆర్ రోడ్లు, ఫేజ్ -2 లో 32 ఐసిబిఆర్ రోడ్లతో సహా మొత్తం 105 ఐసిబిఆర్ రోడ్లను బిఆర్ఓ నిర్మిస్తుంది. [5] [7] BRO బాధ్యత వహించే మొత్తం రహదారి నెట్‌వర్కు పొడవు 32,000 కిలోమీటర్లు కాగా, ఇందులో 67% ఐసిబిఆర్ కు చెందినవి. [4] ఫేజ్ -1 లోని 73 ఐసిబిఆర్‌లలో, 2018 నాటికి 50% కన్నా తక్కువ పని జరిగింది. తరువాత అదనపు నిధులతో నిర్మాణ వేగం పెరిగింది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో ఇప్పటికే పూర్తయినవి డార్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ (DS-DBO) రహదారి, అటల్ సొరంగం (రోహ్‌తాంగ్ సొరంగం) కాగా, ఈశాన్యంలో సెలా సొరంగం, బ్రహ్మపుత్ర నది క్రింద రైల్వే సొరంగం నిర్మాణంలో ఉన్నాయి. [8]

చరిత్ర

[మార్చు]

వ్యూహాత్మక మౌలిక వస్తుల ఆవశ్యకత

[మార్చు]

భారతదేశపు ఉత్తర, తూర్పు సరిహద్దుల వెంట చైనా చేపట్టిన రోడ్డు, రైల్వే నిర్మాణ పనుల నేపథ్యంలో, యుద్ధ సమయంలో చైనా సరిహద్దులో సైనికులను చురుగ్గా తరలించేందుకు గాను రోడ్ల అవసరాన్ని అధ్యయనం చేయడానికి భారతదేశం 1997 లో చైనా స్టడీ గ్రూప్ (సిఎస్జి) ను ఏర్పాటు చేసింది. అధ్యయనం ముగింపులో, ఇండో-చైనా సరిహద్దులో అభివృద్ధి చేయాల్సిన ఇండియా-చైనా బోర్డర్ రోడ్లు (ఐసిబిఆర్) అని పిలువబడే 73 రోడ్ల నెట్‌వర్క్‌ను సిఎస్‌జి గుర్తించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) చేత ఈ రోడ్లను నిర్మించేందుకు 1999 లో క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును 2006 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కాని ఆ గడువును 2012 కు పొడిగించారు. రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, 2018 లో వ్యూహాత్మక రహదారి కనెక్టివిటీని సమీక్షించింది. సరిహద్దు రహదారుల నిర్మాణం నెమ్మదిగా జరగడానికి సంబంధించి, బోర్డర్ రోడ్ల సంస్థ కమిటీకి ఇలా చెప్పింది:

సాధ్యమైనంతవరకు సరిహద్దుకు దగ్గరగా రహదారులను వేయరాదనేది కొన్ని సంవత్సరాల క్రితం మన దేశ అభిప్రాయం అని చెబితే అది తప్పు కాదు. ఈ రోజున మనకు రోడ్లు ఎందుకు లేవో ఈ అభిప్రాయాన్ని చూస్తే బోధపడుతుంది. ఓ రెండు సంవత్సరాల క్రితం మాత్రమే మనం అకస్మాత్తుగా ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నాం; ఇలాక్కాదు, మనం ఎంత ముందుకు పోగలిగితే అంత ముందుకు వెళ్ళాల్సిందే అని అనుకున్నాం. దీనికి సమయం పడుతుంది. దురదృష్టవశాత్తు, సమయాన్ని కుదించలేం. ఏం చేసినా సరే, దీనికి మాత్రం సమయం పడుతుంది. ఈ పని పిడబ్ల్యూడీ లాంటే వేరే ఏ సంస్థ అయినా చేస్తే తీసుకునే అత్యల్ప సమయాన్నే మేమూ తీసుకుంటున్నాం.

—బిఆర్వో, 15వ నివేదిక, రక్షణ వ్యవహారాల స్థాయీ సంఘం (2018-19)

వాతావరణం, భౌగోళికం, భూసేకరణ, ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలు కూడా ఆలస్యానికి కారణమయ్యాయి. [9] 2013 లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ప్రభుత్వం నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అనేక పరిపాలనా నిర్ణయాలు తీసుకుంది. 2017 డోక్లాం ప్రతిష్టంభన, చైనా సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాల కల్పనపై మోడీ ప్రభుత్వానికి మేల్కొలుపు.

వ్యూహాత్మక రహదారుల అవసరం

[మార్చు]

మొత్తం 30,118 కిలోమీటర్ల పొడవు గల 852 రోడ్ల అవసరాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ BRO కి సమర్పించింది. వీటిలో, సరిహద్దు రహదారులను లాంగ్ టర్మ్ రోల్ ఆన్ వర్క్స్ ప్లాన్ (LTRoWP) కింద వర్గీకరించారు; అంటే 73 ఐసిబిఆర్‌లతో సహా 22803 కిలోమీటర్ల విస్తీర్ణంలో 530 రోడ్లు. 73 ఐసిబిఆర్‌లలో 61 రోడ్ల బాధ్యత బిఆర్‌ఓ కు అప్పగించగా, మిగిలినవి నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బిసిసి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సిపిడబ్ల్యుడి), నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌పిసిసి), రాష్ట్ర ప్రజా పనుల విభాగాలకు అప్పగించారు. [10] జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో ఐసిబిఆర్ లు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 27 ఐసిబిఆర్‌లు ఉన్నాయి.

ఐసిబిఆర్ ప్రాజెక్ట్ దశలు

[మార్చు]

మొదటి దశ / ఐసిబిఆర్ I.

[మార్చు]

జనవరి 2020 నాటికి, మొదటి దశ పూర్తవ్వాల్సిన సవరించిన గడువు తేదీ 2020 డిసెంబరు. [11] ఈ దశ లోని 73 ఐసిబిఆర్లలో 61 రోడ్లు బిఆర్ఓకు, మిగిలిన 12 సిపిడబ్ల్యుడికి కేటాయించారు . [12]

ఐసిబిఆర్ పురోగతి:

  • దాదాపు 4,000 కిలోమీటర్ల పొడవుతో 73 వ్యూహాత్మక ఐసిబిఆర్‌లను నిర్మించడానికి దశ -1 లేదా ఐసిబిఆర్ -1 ప్రాజెక్టు 2012 లో పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో 1999 లో ప్రారంభమైంది. [13] [4]
  • వార్షిక బర్డెట్: 2020-21లో రూ 11,800 కోట్లు, 2019-20లో రూ 8,050 కోట్లు, 2018-19లో రూ 6,700 కోట్లు, 2017-18లో రూ 5450 కోట్లు, 2008 నుండి 2016 వరకు రూ 3,300 కోట్ల నుండి 4,600 కోట్ల రూపాయలు. [12] 2016, 2020 మధ్య వాస్తవాధీన రేఖ రోడ్లపై పై ఖర్చుచేస్తున్న మొత్తం ₹ 4,600 కోట్ల నుండి ₹ 11,800 కోట్లకు చేరింది. [14]
  • పూర్తయిన రహదారులు: 2020 డిసెంబరు నాటికి రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో 2018 లో అదనపు నిధులు విడుదల చేసారు., మార్చి 2018 నాటికి 50% కన్నా తక్కువ (36 కన్నా తక్కువ) రోడ్లు పూర్తయ్యాయి. [5] [8] BRO కి కేటాయించిన 61 రహదారులలో, దాదాపు 75% (41) 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి. మరో 11 మార్చి 2020 నాటికి పూర్తి కావాలి. మిగిలిన 9 రోడ్లు, 2020 డిసెంబరు నాటికి పూర్తౌతాయి. [11]
  • నిర్మించిన రహదారి పొడవు: 2008-14 కాలంలో 3,610 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగ్గా, 2014-20 కాలంలో 4,764 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. [12]
  • రహదారి సొరంగాలు:2008-14లో 1 రోడ్డు సొరంగం పూర్త్వగా, 2014-20లో 6 పూర్తయ్యాయి. 2020 జూన్ నాటికి 19 రహదారి సొరంగాలు ప్రణాళిక దశలో ఉన్నాయి. [12]
  • వంతెనలు: 2008-14లో 7,270 మీటర్ల పొడవైన వంతెనల నిర్మాణం జరగ్గా, 2014-20లో 14,450 మీటర్ల వంతెనలను నిర్మించారు. [12]

2 వ దశలో సరిహద్దు వెంట 32 రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. [7] 2020 జూన్‌లో, భారత చైనా ప్రతిష్ఠంభన మధ్య, రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని సంస్థలను కోరింది. నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అదనపు కార్మికులను కూడా ఈ ప్రాంతాలకు పంపారు.

ఐసిబిఆర్ ప్రాజెక్టుల జాబితా

[మార్చు]

ఐసిబిఆర్ ప్రాజెక్టుల పాక్షిక జాబితాను కింది పట్టికలో చూడవచ్చు: [10]

క్ర. సం రోడ్డు పేరు దశ రాష్ట్రం నిడివి వంతెనలు పూర్తైందా మూలాలు
1 ఒరాంగ్- కలక్‌తాంగ్ –షేర్‌గావ్- రూపా- టెంగా అస్సాం/ అరుణాచల్ ప్రదేశ్ 158 కలక్‌తాంగ్, గజ్ని, షికారి, షేర్, బాలెమూ, బోమ్‌నాగ్ హాఫ్లాంగ్ అయింది [15]
2 జంగ్-రామసప్పర్ అరుణాచల్ ప్రదేశ్ 64 -
3 షుంగాస్టర్ – ఖర్సాంగ్లా I అరుణాచల్ ప్రదేశ్ 16 - అయింది [16]
4 ఘస్తోలి- రత్తాకోనా ఉత్తరాఖండ్ 18 - [17]
5 నెలాంగ్-నాగా I ఉత్తరాఖండ్ 8.10 - అయింది [18]
6 నగా-సోనమ్-కుమాల్ I ఉత్తరాఖండ్ 11.65 జడ్‌గంగ నది వంతెన అయింది [19]
7 నాగా-జధాంగ్ I ఉత్తరాఖండ్ 5.5 - అయింది
8 సుమ్నా-రిమ్‌ఖిమ్ ఉత్తరాఖండ్ 14 - అయింది
9 LGG (లుంగ్రోమ్-సిజి)-ముక్తో-తేలి అరుణాచల్ ప్రదేశ్ 53 -
10 తామా చుంగ్ చుంగ్ (TCC)-టాక్సింగ్ I అరుణాచల్ ప్రదేశ్ 54 - అయింది [20]
11 TCC-మాజా అరుణాచల్ ప్రదేశ్ 47.38 - [21]
12 యార్లంగ్-లమాంగ్ అరుణాచల్ ప్రదేశ్ 18.58 - [22]
13 ట్రైజంక్షన్-భీం బేస్-దోకాలా సిక్కిం 19.72 - [23][24]
14 టాటో-మణిగ్ంఆంగ్-తడగడే అరుణాచల్ ప్రదేశ్ 89.70 -
15 జోషిమఠ్-మలారి ఉత్తరాఖండ్ 62.67 ఢాక్, తమాక్, సురాయ్‌తోటా, సుబాయ్‌గధేరా అయింది (2016)[25] [26] [27]
16 మలారి-గిర్తిడోబ్లా ఉత్తరాఖండ్ - అయింది (2016) [28]
17 గిర్తిడోబ్లా-సుమ్నా ఉత్తరాఖండ్ - అయింది (2016)
18 సుమ్నా-రిమ్‌ఖిమ్ ఉత్తరాఖండ్ - అయింది (2016)
19 మూసాపానీ-ఘస్తోలి ఉత్తరాఖండ్ 9.52 -
20 నాచో-TCC అరుణాచల్ ప్రదేశ్ 78.45 - [29]
21 LGG-ముక్తో-తేలి అరుణాచల్ ప్రదేశ్ 53 - [30]
22 లేహ్-ఉప్షి-సర్చూ లడఖ్ 249.62 -
23 Tawaghat-Ghatiabagarh ఉత్తరాఖండ్ 19.51 - [31]
24 బోనా-గెల్లింగ్ అరుణాచల్ ప్రదేశ్ -
25 హరోంగ్ - చుషుల్ లడఖ్ -
26 ససోమా - ససెర్లా లడఖ్ -
27 D-S-DBO I లడఖ్ Shyok Gang-I, Shyok Gang-II, Shyok Gang-II, Shyok-II అయింది
28 Koyul – Photila – Chisumle - Zurasar లడఖ్ - [32]
29 Nemo-Padum-Darcha హిమాచల్ ప్రదేశ్/లడఖ్ - [33][34][35]
30 Ghatiabagarh-Lipulekh ఉత్తరాఖండ్ 80 - [36]
31 BJG-LGG అరుణాచల్ ప్రదేశ్ 45 తవాంగ్‌చు-II/ తవాంగ్‌చు-III [37]
32 బాలిపారా-చార్దువార్-తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ 334 - [38]
33 గాంగ్‌టక్- చుంగ్‌హాంగ్ సిక్కిం -
34 Khinzemane-Zemithang I అరుణాచల్ ప్రదేశ్ - అయింది [39]
35 Marsimikla-Hot Springs లడఖ్ -
36 Phobrang-Marsimikla లడఖ్ -
37 మనా-మనా కనుమ 56 కి.మీ. ఉత్తరాఖండ్ - అయింది
38 మున్సియారీ-మిలాం ఉత్తరాఖండ్ - అయింది
  • అండమాన్, నికోబార్ కమాండ్, భారతదేశపు ప్రత్యేక ఆర్థిక జోన్‌ను, భారతదేశ సరిహద్దులనూ రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల వివిధ సైనిక, ఇతర మౌలిక సదుపాయాల సామర్ధ్యాల నవీకరణలు జరుగుతున్నాయి.
  • భారతదేశం, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ల భద్రతా చతుర్భుజి ఇండో-పసిఫిక్ భౌగోళిక వ్యూహానికి ముఖ్యమైనది. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక వివాదాలలో చైనా దూకుడును ఎదుర్కోవడంలోను, బంగాళాఖాతం, మలక్కా జలసంధి, సింగపూర్ జలసంధుల గుండా వెళ్ళే అత్యంత రద్దీగా ఉండే, అత్యంత భారీ షిప్పింగ్ లేన్ల భద్రత కోసం ఇది చాలా ముఖ్యమైనది.

సరిహద్దుల వద్ద విమానాశ్రయ, ఏఎల్‌జి ప్రాజెక్టులు

[మార్చు]
వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఆఫ్ చైనా, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కింద ఉన్న ప్రాంతం.

ఎల్‌ఎసి వద్ద చైనీస్ మిలిటరీ లోని అన్ని విభాగాలన్నిటికీ కలిపి ఒక సమీకృత వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌ ఉంది. [40] భారత సాయుధ దళాలు ఎల్‌ఎసిని 3 రంగాలుగా విభజించాయి - లడఖ్‌, చైనా ఆక్రమణలో ఉన్న అక్సాయ్ చిన్‌లు కలిపి పశ్చిమ రంగం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో మధ్య రంగం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తూర్పు రంగం. [41] అదేవిధంగా, ఎల్‌ఎసిని కవర్ చేయడానికి భారత ఎయిర్‌ఫోర్స్‌లో ప్రయాగరాజ్ వద్ద వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఢిల్లీ ఆధారిత సెంట్రల్ ఎయిర్ కమాండ్, షిల్లాంగ్ ఆధారిత ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఉన్నాయి.

  • లడఖ్
    • దౌలత్ బేగ్ ఓల్డి ఏఎల్‌జి (అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్) ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ (షక్స్‌గామ్), అక్సాయ్ చిన్, సియాచిన్ వివాదాస్పద ప్రాంతాలకు సేవలు అందిస్తుంది.
    • ఫుక్‌చే ఏఎల్‌జి దెంచోక్, ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్, అక్సాయ్ చిన్ ప్రాంతంలో పనిచేస్తుంది.
    • లేహ్ విమానాశ్రయం ట్రాన్స్-కరాకోరం ట్రాక్ట్, అక్సాయ్ చిన్, సియాచిన్ వివాదాస్పద ప్రాంతానికి సేవలు అందిస్తుంది.
    • న్యోమా ఏఎల్‌జి చుమర్ నార్త్, చుమర్ సౌత్ అనే రెండు విడివిడిగా - కాని దగ్గరగా - ఉన్న వివాదాస్పద జంట ప్రాంతాలకు సేవలు అందిస్తుంది.
    • పాడుమ్ ఏఎల్‌జి [42] లడఖ్ లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి), కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ లకు రెండవ వరుస రక్షణ సేవలు అందిస్తుంది.
  • హిమాచల్ ప్రదేశ్కు టిబెట్ (చైనా) తో 250 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. [43]
    • సిమ్లా విమానాశ్రయం, సైనిక ఉపయోగం కోసం సివిల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉంది. ఇది కౌరిక్, తాషిగాంగ్-శ్హిప్కి లా, నెలాంగ్-పూలం సుమ్దా ప్రాంతానికి సేవ చేస్తుంది.
    • కులు-మనాలి విమానాశ్రయం, సైనిక ఉపయోగం కోసం ఈ పౌర విమానాశ్రయం అందుబాటులో ఉంది. కౌరిక్, తాషిగాంగ్-షిప్కి లా, నెలాంగ్-పూలం సుమ్దా వివాదాస్పద ప్రాంతానికి సేవలు అందిస్తుంది.
    • కిబ్బర్ - రాంగ్రిక్, సర్వే చేసారు గానీ, 2020 జూలై నాటికి పనిలో పురోగతి ఏమీ లేదు. చుమార్, కౌరిక్, తాషిగాంగ్-షిప్కి లా వివాదాస్పద ప్రాంతానికి అత్యంత దగ్గరగా ఉన్న ఏఎల్‌జి ఇది.
  • ఉత్తరాఖండ్కు టిబెట్‌తో 350 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.[27]
    • చిన్యాలిసౌర్ విమానాశ్రయం: ఈ ఏఎల్‌జి వివాదాస్పద బారా హోతి, నెలాంగ్-పూలం సుమ్దా రంగానికి సేవలు అందిస్తుంది. ఐటిబిపికి బారా హోతి సెక్టార్, మనా కనుమ ప్రాంతం (నెలాంగ్-పూలం సుమ్దా సెక్టార్) లో 42 సరిహద్దు అవుట్‌పోస్టులు ఉన్నాయి.[27]
    • పిథోరగఢ్ విమానాశ్రయం ఏఎల్‌జి వివాదాస్పదమైన కాలాపానీ భూభాగానికి సేవలు అందిస్తుంది.
  • అరుణాచల్ ప్రదేశ్
    • ఆలో ఏఎల్‌జి [44]
    • మెచుకా ఏఎల్‌జి
    • పాసీఘాట్ ఏఎల్‌జి
    • తవాంగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్
    • ట్యూటింగ్ ఏఎల్‌జి
    • విజోయానగర్ ఏఎల్‌జి
    • వాలోంగ్ ఏఎల్‌జి
    • జిరో ఏఎల్‌జి

సరిహద్దు వంతెన ప్రాజెక్టులు

[మార్చు]
  • 2020 లో పూర్తయిన సిక్కింలోని తీస్తా నది రోడ్డు వంతెన డోక్లాం రంగానికి ఉపయోగపడుతోంది.
  • తీస్తా నదిపై రైల్వే వంతెన, 2020 జూలై నాటికి నిర్మాణంలో ఉంది. 2020 డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. [45]
  • అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై కొత్త వంతెనలు తూర్పు రంగంలోని అరుణాచల్ ప్రదేశ్‌కు సేవలు అందిస్తాయి.

సరిహద్దు రైల్వే ప్రాజెక్టులు

[మార్చు]

దళాలను వేగంగాను, సులభంగానూ మోహరించడానికి చైనా, పాకిస్తాన్, నేపాల్ సరిహద్దుల సమీపంలో నిర్మించాల్సిన కనీసం 15 కొత్త వ్యూహాత్మక రైలు మార్గాలను భారత రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. [46] చైనా టిబెట్‌లోని షిగాట్సే వరకు లైన్లను నిర్మించింది. దీనిని నేపాల్‌కు, ఆపైన భారతదేశానికీ అనుసంధానించే ప్రణాళికలు ఉన్నాయి. [47] 2013 లో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించగా, 2014 లో మొత్తం 14 మార్గాల ప్రారంభ సర్వేలను భారత ప్రభుత్వం ఆమోదించింది. [48] వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

సరిహద్దు రహదారి ప్రాజెక్టులు

[మార్చు]
  • ఉత్తరాఖండ్
    • చార్ ధామ్ హైవే, ఐసిబిఆర్ లో భాగం కాదు,
    • కాలాపానీ భూభాగం, ఐసిబిఆర్‌లో భాగంగా 2020 లో కొత్తగా నిర్మించారు.
    • లిపులేఖ్ కనుమ రహదారి, ఐసిబిఆర్‌లో భాగంగా కాలాపానీ భూభాగాన్ని కలిపే రహదారిని ప్రతిపాదించింది.
    • ఫూ-చుమార్ రోడ్డు, ఐసిబిఆర్ లో భాగం కాదు. [49]
  • సిక్కిం
    • బాగ్రాకోట్ - గ్యాంగ్‌టాక్ హైవే: డూయార్స్ లోని బాగ్రాకోట్ సమీపంలో ఎన్‌హెచ్ 17 (పాత నంబరింగ్ ప్రకారం ఎన్‌హెచ్ 31) నుండి 250 కిలోమీటర్ల పొడవైన రహదారిని జాతీయ రహదారి ప్రమాణాలకు నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇది అల్గారా - లావా - రిష్యప్ (పశ్చిమ బెంగాల్ - సిక్కిం సరిహద్దు) - రెనోక్ - రోరతాంగ్ - పాక్యోంగ్ - రాణిపూల్ ల గుండా గాంగ్టక్ వెళుతుంది. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడుతూండే ఎన్‌హెచ్‌ 10 సెవోక్-గ్యాంగ్‌టాక్ హైవేతో పాటు, ఈ కొత్త రహదారి రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టాక్‌ను, దానికి ఆవల ఉన్న చైనా సరిహద్దునూ చేరుకునేందుకు మరొక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. [45]
  • అరుణాచల్ ప్రదేశ్
    • భారత-చైనా సరిహద్దులో అరుణాచల్ ఫ్రాంటియర్ హైవేను ప్రతిపాదించారు. ఇది ఐసిబిఆర్లో భాగం కాదు.
    • అరుణాచల్ ఈస్ట్-వెస్ట్ కారిడార్, దిగువ ఎగువ అరుణాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల గుండా ఈ రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. ఐసిబిఆర్‌లో భాగం కాదు.
    • ట్రాన్స్-అరుణాచల్ హైవే, ప్రస్తుతం పనిచేస్తున్న రహదారి.

సరిహద్దు సొరంగ ప్రాజెక్టులు

[మార్చు]

జూన్ 2020 నాటికి, ఐసిబిఆర్లలో మొత్తం 26 రోడ్డు సొరంగాలు ప్రతిపాదించారు. వాటిలో 7 పూర్తయ్యాయి, 19 ప్రణాళిక దశలో ఉన్నాయి. [12] 2017 నవంబరు నాటికి, చైనా-ఇండియన్ సరిహద్దులోని 73 వ్యూహాత్మక రోడ్లలో మొత్తం 100 కి.మీ. పొడవున్న 17 రహదారి సొరంగాలను BRO నిర్మిస్తోంది. ఈ సొరంగాల వలన ఏడాది పొడవునా రైలు, రోడ్డు ప్రయాణాలకు వీలు కల్పిస్తాయి. వీటిలో కొన్ని సొరంగాల్లో రోడ్డు రైలు దారులు రెండూ ఉంటాయి. ప్రస్తుతం, హిమపాతం, వర్షం కారణంగా భారత చైనా సరిహద్దులోని ఎత్తైన పోస్టులకు వెళ్ళే రహదారులు ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు మూసివేస్తున్నారు. ఈ కాలంలో సరఫరాలు విమానాల ద్వారా మాత్రమే చేస్తారు. ఈ సొరంగాల వలన ప్రయాణ సమయం, ఖర్చూ తగ్గుతుంది. హిమపాతం, కొండచరియలు విరిగిపడే ముప్పు తొలగిపోతుంది. భారతదేశం చైనా సరిహద్దు వెంబడి తూర్పు నుండి పడమరగా సొరంగాల జాబితా క్రింది విధంగా ఉంది: [50] [51]

ఎస్.ఎన్ రంగం పేరు రాష్ట్రం కి.మీ పొడవు కార్యాచరణ స్థితి / వ్యాఖ్య
1 తూర్పు జోజి లా జమ్మూ కాశ్మీర్ ఎన్ శ్రీనగర్-కార్గిల్-లే NH1 లో .
2 తూర్పు లుంగలాచా లా లడఖ్ లే-మనాలి హైవేలో .
3 తూర్పు బారా-లాచా లా లడఖ్ లే-మనాలి హైవేలో.
4 తూర్పు టాంగ్లాంగ్ లా లడఖ్ లే-మనాలి హైవేలో.
5 తూర్పు నిమో సమీపంలో షింగో లా హిమాచల్ ప్రదేశ్ లే-మనాలి హైవేలో.
6 సెంట్రల్ రోహ్తాంగ్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ లే-మనాలి హైవేలో.
7 సెంట్రల్ చార్ ధామ్ బహుళ రైలు / రహదారి సొరంగాలు ఉత్తరాఖండ్ చార్ ధామ్ రైల్, రోడ్ ప్రాజెక్టులు చూడండి.
8 పశ్చిమ తెంగ్ పాస్ సిక్కిం 0.578 మధ్య NH310A న చుంగ్తంగ్, తుంగ్ ఉత్తర సిక్కిం లో.
9 పశ్చిమ నెచిపు పాస్ అరుణాచల్ ప్రదేశ్ NH13 బోగిబీల్ అస్సాం నుండి తవాంగ్ వరకు బొమ్డిలా, సేలా పాస్ సొరంగాల సమీపంలో.
10 పశ్చిమ బొమ్డిలా అరుణాచల్ ప్రదేశ్ ఎన్ "NH13 బోగిబీల్-తవాంగ్" లోని బొమ్డిలా, సేలా పాస్ సొరంగాల దగ్గర.
11 పశ్చిమ సెలా పాస్ అరుణాచల్ ప్రదేశ్ ఎన్ "NH13 బోగిబీల్-తవాంగ్" లోని బొమ్డిలా, సేలా పాస్ సొరంగాల దగ్గర.

సముద్ర రేవులు, జలమార్గాల ప్రాజెక్టులు

[మార్చు]

సాగరమాల నౌకాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టు, జలమార్గ ప్రాజెక్టుల వలన ఎల్‌ఎసి వెంట, ఇతర ప్రాంతాలలోను జియోస్ట్రాటజిక్ సామర్థ్యాలు పెరుగుతాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపైన దాని ఉపనదుల పైనా ఉన్న జలమార్గ ప్రాజెక్టులకు సైనిక దళాల సాయుధ సంపత్తి తరలింపుల పరంగా వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది:

ఎస్.ఎన్ రంగం కోడ్ పేరు రాష్ట్రం కి.మీ పొడవు కార్యాచరణ వ్యాఖ్య
1 తూర్పు NW2 బ్రహ్మపుత్ర నది యొక్క సాదియా-ధుబ్రి విభాగం అస్సాం 891 వై
2 తూర్పు NW6 ఐ నది అస్సాం 121
3 తూర్పు NW16 బరాక్ నది అస్సాం 121 వై
4 తూర్పు NW18 బెకి నది అస్సాం 73 వై
5 తూర్పు NW30 డిహింగ్ నది అస్సాం 114 వై
6 తూర్పు NW31 ధన్సిరి నది - చాతే నది అస్సాం 110 ఎన్
7 తూర్పు NW32 డిఖు నది అస్సాం 63 ఎన్
8 తూర్పు NW33 డోయాన్స్ నది అస్సాం, నాగాలాండ్ 61 ఎన్
9 తూర్పు NW57 కోపిలి నది అస్సాం 46 ఎన్
10 తూర్పు NW62 లోహిత్ నది అస్సాం 100 ఎన్
11 తూర్పు NW82 పుతిమారి నది అస్సాం 72 ఎన్
12 తూర్పు NW95 సుబన్సిరి నది అస్సాం 111 ఎన్
13 తూర్పు NW38 గంగాధర్ నది అస్సాం, పశ్చిమ బెంగాల్ 62

నది కింద సొరంగం

[మార్చు]
  1. గోహ్పూర్-నుమాలిగ సొరంగం బ్రహ్మపుత్ర నది క్రింద నిర్మాణంలో ఉంది [52]

రాడార్లు

[మార్చు]
  • ఉత్తరాఖండ్
    • ముక్తేశ్వర్, డాప్లర్ రాడార్ [53]
    • సుర్కంద దేవి, డాప్లర్ రాడార్
    • చమోలి, వాయు రక్షణ రాడార్, నిర్మాణంలో ఉంది [54]
    • పిథోరాగఢ్, వాయు రక్షణ రాడార్, నిర్మాణంలో ఉంది
    • ఉత్తరకాశి, వాయు రక్షణ రాడార్, నిర్మాణంలో ఉంది

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :TribuneBorderLogistics అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Sen, Sudhi Ranjan (27 February 2015). "Only 20 Per Cent of India-China Strategic Border Roads Ready Till Now". NDTV. Retrieved 2022-01-17.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :Status అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. 4.0 4.1 4.2 Singh, Rahul (2019-02-13). "Speed up road construction along China border: Parliamentary panel asks BRO". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. 5.0 5.1 5.2 Singh, Vijaita (2018-03-03). "Govt. puts delayed road projects on Indo-China border on track". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-18.
  6. China violated Line of Actual Control 500 times in last two years, Times of India, 17 May 2012.
  7. 7.0 7.1 Singh, Jitendra Bahadur (17 June 2020). "India to accelerate construction of roads along Chinese border: Sources". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. 8.0 8.1 "Amid Ladakh standoff with China, India puts border roads in fast lane". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2020-06-02. Retrieved 2020-06-18.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. Dubey, Amitabh (3 July 2020). "How True Is the Claim that Modi Govt Is the Architect of the Border Roads Project?". The Wire. Retrieved 2020-09-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. 10.0 10.1 Standing Committee on Defence (February 2019) Fifteenth Report: Provision of all weather road connectivity under Border Roads Organisation (BRO) and other agencies up to International borders as well as the strategic areas including approach roads- An appraisal. Ministry of Defence, Lok Sabha Secretariat, Government of India. Archived from the original on 19 June 2020.
  11. 11.0 11.1 Will Arunachal Pradesh Chinas next target, arunachalobserver.org, 2020/06/23.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 Govt to expedite work on 32 road prrojects along border with China: Officials, Times of India, 23 June 2020.
  13. Gurung, Shaurya Karanbir (2018-04-20). "Shortage of funds delaying strategic roads along China border". The Economic Times. Retrieved 2020-06-18.
  14. Tripathi, Rahul (2020-07-05). "India's spending on LAC roads has tripled in 4 years". The Economic Times. Retrieved 2020-07-07.
  15. "Kiren Rijiju inaugurates Orang-Kalaktang- Shergaon-Rupa-Tenga Road | Arunachal24" (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-10-17. Retrieved 2020-06-19.
  16. Desk, Sentinel Digital (2019-02-11). "Border Roads Organization To Speed Up Road Work In Arunachal - Sentinelassam". www.sentinelassam.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-19.
  17. "Struggling with 73 roads, govt plans 55 more on China border". Deccan Herald (in ఇంగ్లీష్). 2016-05-09. Retrieved 2020-06-19.
  18. "BRO constructs two strategically important roads on China border". The Pioneer. 2019-06-07. Archived from the original on 2020-06-21. Retrieved 2020-06-19.
  19. "BRO completes road project, reaching Nelong valley becomes convenient". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-06. Retrieved 2020-06-19.
  20. ANI (2018-05-17). "BRO creates history through road link to China border". Business Standard India. Retrieved 2020-06-19.
  21. "BRO links remote villages on Indo-China border". Outlook India. Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  22. "Govt to build 27 roads along India-China Border". One India (in ఇంగ్లీష్). 2006-12-13. Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  23. Som, Vishnu (3 October 2019). "How 7-Hour Journey On Mule Track To Doklam Now Takes Army Only 40 Minutes". NDTV. Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  24. "Doklam: one motorable road complete, second to be constructed by March 2021". The Economic Times. 2019-10-03. Retrieved 2020-06-19.
  25. After 24 years of work, strategic military outpost near India China border, Times of India, 2016.
  26. "Joshimath-Malari highway inaugurated". www.projectstoday.com. 26 December 2019. Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  27. 27.0 27.1 27.2 Eyeing national security, Uttarakhand, ITBP to improve border infrastructure, Hindustan Times, 18 July 2020.
  28. "BRO officials asked to speed up pending road projects". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-02-20. Retrieved 2020-06-19.
  29. "BRO toeing Army targets on Indo-China border roads: ADG". Arunachal Observer (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-05-20. Retrieved 2020-06-19.
  30. Das, Pranab Kumar (10 February 2018). "BRO links Mukto-Teli". Telegraph India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  31. "Nepal Objects Road Passing Through Lipulekh Pass, India Reacts". Outlook India. 10 May 2020. Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  32. Gurung, Shaurya Karanbir (2020-06-13). "3,500 Jharkhand workers to be hired for Ladakh road projects". The Economic Times. Retrieved 2020-06-19.
  33. Sharma, Suresh (11 September 2019). "Zanskar celebrates as new 'road' brings it 600km closer to Himachal Pradesh | Shimla News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  34. "Govt pushes hard to complete 1st all-weather route to Ladakh". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-25. Retrieved 2020-09-01.
  35. "India laying new road between Ladakh and Darcha in Himachal Pradesh". Livemint (in ఇంగ్లీష్). 2020-08-26. Retrieved 2020-09-01.
  36. Nandi, Shreya (2020-05-08). "BRO opens new 80-km road for Kailash Mansarovar pilgrims". Livemint (in ఇంగ్లీష్). Retrieved 2020-06-19.
  37. Ministry of Environment & Forests (10 March 2011). AGENDA FOR THE FOREST ADVISORY COMMITTEE MEETING CONVENED. Government of India
  38. Desk, Sentinel Digital (2018-08-29). "Balipara-Charduar-Tawang Road to be completed by 2021 - Sentinelassam". www.sentinelassam.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-19.
  39. "Work on border roads intensified: BRO DG | The Arunachal Times". The Arunachal Times (in అమెరికన్ ఇంగ్లీష్). 10 February 2019. Retrieved 2020-06-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  40. "Eye on India, China raises Tibet military command rank | Central Tibetan Administration". tibet.net. Archived from the original on 2016-11-07. Retrieved 2016-10-01.
  41. "Twisting India's Chicken's Neck". lowyinstitute.org. Retrieved 2020-07-18.
  42. India plans AGL strips, Deccan Herald, 2014.
  43. Himachal Pradesh: Demand for airstrip in Spiti area, TImes of India, 17 July 2020.
  44. IAF to have seven AGL in Arunachal Pradesh, Economic Times, 2018.
  45. 45.0 45.1 https://www.telegraphindia.com/west-bengal/scurry-to-finish-rail-and-road-links-to-india-china-border/cid/1782001 Scurry to finish rail and road links to border], The Telegraph, 16 July 2020.
  46. India to lay 14 strategic railway lines near China, Pakistan border, Pakistan Today, APRIL 4, 2014.
  47. Real reason why India is building 14 strategic rail lines, International Business Times,, Dec 1, 2016.
  48. Government gives go-ahead to 4 strategic rail lines along China border, Indian Express, October 22, 2014.
  49. "Modi, Xi Jinping and Six Years of Battle for the Psychological High Ground". The Wire. Retrieved 2020-09-27.
  50. "For year-round border security, India plans tunnels on China border.", Economic Times, 6 November 2017.
  51. "Voyants bagged Independent Engineer Services in Arunachal Pradesh"
  52. Chaturvedi, Amit, ed. (2020-07-14). "Centre gives in-principle approval for tunnel under the Brahmaputra amid tension with China: Report". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2020-09-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  53. Jha, Prashant (17 October 2019). "Doppler radars will be installed in Uttarakhand by March 2020". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-18.{{cite web}}: CS1 maint: url-status (link)
  54. Verma, Lalmani (2020-09-12). "IAF plans to set up Air Defence Radars in 3 Uttarakhand districts". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2020-09-18.{{cite web}}: CS1 maint: url-status (link)