Jump to content

ఉత్తర‌కాశి

అక్షాంశ రేఖాంశాలు: 30°44′N 78°27′E / 30.73°N 78.45°E / 30.73; 78.45
వికీపీడియా నుండి
Uttarkashi
Kashi of North, Shivnagri, Somyakashi or Barahat
Town
Uttarkashi Town
Uttarkashi Town
Nickname: 
Uki
Uttarkashi is located in Uttarakhand
Uttarkashi
Uttarkashi
Location in Uttarakhand, India
Uttarkashi is located in India
Uttarkashi
Uttarkashi
Uttarkashi (India)
Coordinates: 30°44′N 78°27′E / 30.73°N 78.45°E / 30.73; 78.45
Country India
Stateదస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
DistrictUttarkashi
Government
 • TypeMunicipality
 • BodyNagar Palika Barahat
Elevation
1,158 మీ (3,799 అ.)
జనాభా
 (2019

population_total = 329,686

area_magnitude= sq. km)
 • Total40,220
Languages
 • Native SGarhwali, , Parvati
 • OfficialHindi, Sanskrit
Time zoneUTC+5:30 (IST)
PIN
249193
Telephone code01374
Vehicle registrationUK10

ఉత్తరకాశి, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని ఉత్తరకాశీ జిల్లాకు చెందిన పట్టణం. ఇది సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తులోఉంది. ఇది జిల్లా ముఖ్యపట్టణం. ఉత్తరకాశీ జిల్లా 1960 ఫిబ్రవరి 24 న స్థాపించబడింది. తూర్పున చమోలి జిల్లా, ఉత్తరన హిమాచల్ ప్రదేశ్, టిబెట్ ఉంటాయి. ఈ ప్రదేశం హిందువులకు ఎంతో మతసంబంధ ప్రాముఖ్యత కలిగి ఉంది.'నార్త్ కాశీ' అదే విధంగా 'టెంపుల్స్ టౌన్' అనే ఇతర పేర్లతో పిలువబడుతుంది.[1] గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర పట్టణాలలో ఉత్తరకాశి ఒకటి. ఇది ఋషికేష్‌కు 172 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశం ప్రసిద్ధ మత సంబంధమైన ప్రాంతాలకు, గంగోత్రి, యమునోత్రికి చేరువలో ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర కురుస్, ఖసస్, కిరతాస్, కునిన్దాస్, తంగనస్, ప్రతంగనస్ తెగలకు చెందినవారు నివసించేవారు.

భౌగోళికం

[మార్చు]

ఉత్తరకాశీ 30.73°N 78.45°E వద్ద ఉంది.[1] ఇది సగటున సముద్రమట్టానికి 1,165 మీటర్లు (4,436 అడుగులు) ఎత్తులో ఉంది. భూభాగంలో ఎక్కువ భాగం కొండలతో ఉంటుంది. ఉత్తరకాశీ సమీపంలో అనేక చిన్న, పెద్ద నదులు ఉన్నాయి. వాటిలో యమునా, గంగ (భాగీరథి) అతి పెద్దవి. యమునా నది యమునోత్రి నుండి ఉద్భవించగా, భాగీరథి గంగోత్రి (గోముఖ్) నుండి ఉద్భవించింది. అసి గంగా, జడ్ గంగా గంగానదికి కొన్ని ఉపనదులు.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా ఉత్తరకాశి నగర జనాభా మొత్తం 3,30,086. అందులో పురుష జనాభా 1,68,597 మందికాగా, స్త్రీల జనాభా 1,61,489 మంది ఉన్నారు. నగరం 8,016 చ.కి.మీ (కిమీ2) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జన సాంద్రత/కిమీ 2 41. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 958 స్త్రీలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి (0-6 వయస్సు లోపు) 916 అక్షరాస్యులు 2,15,126. వారిలో పురుష అక్షరాస్యులు 1,28,237 మందికాగా, స్త్రీల అక్షరాస్యులు 86,889 మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత 75.81% శాతం ఉంది. పురుషుల అక్షరాస్యత 88.79% శాతం ఉండగా, స్త్రీల అక్షరాస్యత 62.35% శాతం ఉంది. పిల్లల జనాభా (0-6 వయస్సు లోపు) 46,307 మంది ఉన్నారు.వారిలో బాలుర జనాభా (0-6 వయస్సులోపు) 24,165 మంది ఉండగా, బాలికల జనాభా (0-6 వయస్సులోపు) 22,142 మంది ఉన్నారు.[2]

ఆలయాలు

[మార్చు]
యమునోత్రి దేవాలయం

ఉత్తరకాశిలో అందమైన ఆలయాలు, ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ ఆలయాలు విశ్వనాథ్ ఆలయం, పోఖు దేవతా ఆలయం, భైరవుని ఆలయం, కుట్టి దేవి ఆలయం, కర్ణ దేవతా ఆలయం, గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం, శని దేవాలయం ఉన్నాయి.

విశ్వనాథ్ ఆలయం

[మార్చు]

హిందూ మతదేవుడైన శివునికి అంకితమైన విశ్వనాథ్ ఆలయం, పర్యాటకులు నడుమ చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రసిద్ధ ఆలయం ఉత్తరకాశికి 300 మీ. దూరంలో స్థానిక బస్సు స్టాండ్ సమీపంలో ఉంది. మణికర్ణిక ఘాట్ ప్రాంతం మరొక ముఖ్యమైన మత సంబంధ కేంద్రంగా ఉంది.ఒక పురాణం ప్రకారం, ఉత్తరకాశి పట్టణం గొప్ప ఋషి జడభరతుడు పశ్చాత్తప్తుడు అయిన ప్రదేశం. ఈ ప్రదేశం గురించి హిందూ మత గ్రంథం స్కాంధ పురాణంలో కేదార్ ఖండ్ లో వివరించబడింది.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

గంగోత్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందనవన్ తపోవన్, శివ లింగ వంటి వివిధ పర్వత శిఖరాలు, తలే సాగర్, భాగీరథి, కేదర్ గోపురం,, సుదర్శన అందమైన దృశ్యాలను అందిస్తుంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉత్తరకాశి-గంగోత్రి రోడ్లో నెలకొని ఉన్న దయార బుగ్యల్ ను సందర్శిస్తారు. ఈ స్థలం 3048 మీటర్ల ఎత్తులో ఉండి స్కీయింగ్ కు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది.

ట్రెక్కింగ్

[మార్చు]

హర్ కి డూన్ సముద్ర మట్టానికి 3506 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రముఖ ట్రెక్కింగ్ ప్రాంతము. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనేక అతిథి గృహాలు, బంగాళాలు పర్యాటకులు ఉండడానికి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ్ ఆలయం ఎదురుగా ఉన్న శక్తి ఆలయం, ఇక్కడ ఒక ప్రముఖ మత ప్రదేశంగా ఉంది. ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి 26 అడుగులు అధిక త్రిశూల్ (త్రిశూలము) ఉంది.

దోదితల్

[మార్చు]

ఉత్తరకాశిలో దోదితల్, సముద్ర మట్టానికి 3307 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అందమైన సరస్సు . ఈ స్థలాన్ని సదర్సించే ఆసక్తి గల యాత్రికులు రోడ్ లేదా ట్రెక్కింగ్ మార్గాల ద్వారా ఇక్కడకు చేరవచ్చు. ఈ స్థలం కూడా యమునోత్రి, హనుమాన్ చత్తి ట్రెక్కింగ్ కొరకు స్థావరంగా పనిచేస్తుంది.

నెహ్రూ ఇన్స్టిట్యూట్

[మార్చు]

ఉత్తరకాశి నుండి 2 కి.మీ. దూరంలో ఉంది. సమయం అనుకూలిస్తే ప్రయాణికులు 1965 వ సంవత్సరంలో స్థాపించబడిన మౌంటెనీరింగ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ను పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ ఇన్స్టిట్యూట్ కు, పర్వతాలు అంటే చాలా ఇష్టం అయిన భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు. అవే కాక గంగ్నని, సత్తల్, దివ్య శైలి, సూర్య కుండ్ ప్రాంతంలోని ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

ప్రయాణ వసతులు

[మార్చు]

ఉత్తరకాశికి సమీపంలోని విమానాశ్రయం 160 కి.మీ. దూరంలో డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఉంది. ఋషికేష్ రైల్వే స్టేషను గమ్యానికి సన్నిహిత రైలు లింక్. యాత్రికులు డెహ్రాడూన్, హరిద్వార్, ఋషికేష్, ముస్సోరీ వంటి సమీపంలోని నగరాల నుండి ఉత్తరకాశికి బస్సులు లభిస్తాయి

వాతావరణం

[మార్చు]

ఉత్తరకాశిలో ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు సంవత్సరం పొడవునా ఉంటాయి. అయితే, వేసవి, వర్షాకాలంలలో వివిధ పండుగలు జరుపుకుంటారు. ఆ సమయంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించడానికి సిఫారసు చేయవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "Falling Rain Genomics, Inc - Uttarkashi". Archived from the original on 2013-07-05. Retrieved 2014-01-27.
  2. "Uttarkashi Population 2023". www.indiacensus.net. Retrieved 2023-06-17.

వెలుపలి లింకులు

[మార్చు]