Coordinates: 28°59′N 79°24′E / 28.98°N 79.40°E / 28.98; 79.40

రుద్రాపూర్ (ఉత్తరాఖండ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రాపూర్
పట్టణం
Radisson Hotel
Atariya templeGandhi Park
Metropolis mall
పైనుంచి సవ్యదిశలో:
రాడిసన్ హోటల్, గాంధీ పార్కు, మెట్రోపోలిస్ మాల్, అతారియా ఆలయం.
రుద్రాపూర్ is located in Uttarakhand
రుద్రాపూర్
రుద్రాపూర్
ఉత్తరాఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 28°59′N 79°24′E / 28.98°N 79.40°E / 28.98; 79.40
దేశం India
రాష్ట్రందస్త్రం:..Uttarakhand Flag(INDIA).png ఉత్తరాఖండ్
జిల్లాఉధంసింగ్ నగర్
స్థాపన1588
Area
 • పట్టణం47.65 km2 (18.40 sq mi)
Population
 (2011)[1]
 • పట్టణం1,40,857
 • Density3,000/km2 (7,700/sq mi)
 • Metro1,54,485
భాషలు
 • అధికారికహిందీ, కుమావొనీ
Time zoneUTC+5:30 (IST)
PIN
263153
Telephone code+91-5944
Vehicle registrationUK-06

రుద్రాపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉధంసింగ్ నగర్ జిల్లా లోని పట్టణం. ఇది న్యూఢిల్లీకి ఈశాన్యంగా 250 కి.మీ. దూరంలోను, డెహ్రాడూన్‌కు దక్షిణాన 250 కి.మీ. దూరంలోనూ ఉంది. రుద్రాపూర్‌కు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని 16 వ శతాబ్దంలో రుద్ర చంద్ స్థాపించాడు. ఇది తెరాయ్ ప్రాంతపు గవర్నరు నివాసంగా ఉండేది. నగరం నేడు ప్రధాన పారిశ్రామిక, విద్యా కేంద్రం గానే కాకుండా ఉధమ్ సింగ్ నగర్ జిల్లాకు ముఖ్యపట్టణంగా కూడా ఉంది. రుద్రపూర్ సారవంతమైన తెరాయ్ ప్రాంతంలో 27.65 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,40,857 జనాభాతో రుద్రపూర్, ఉత్తరాఖండ్‌లో అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో 5 వ స్థానంలో ఉంది. ఉత్తరాఖండ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్థాపించినప్పటి నుండి, పట్టణంలో అక్షరాస్యత, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతోంది.

జనాభా శాస్త్రం[మార్చు]

Population growth 
CensusPop.
19619,662
197125,173160.5%
198134,65837.7%
199161,28076.8%
200188,67644.7%
20111,40,85758.8%
Source: DCHB: Udham Singh Nagar[3]: 369 

2011 జనాభా లెక్కల ప్రకారం, రుద్రపూర్ పట్టణ ప్రాంత జనాభా 1,54,485. [2] [4] అందులో రుద్రాపూర్ పట్టణ జనాభా 1,40,884. [1] రుద్రపూర్ పట్టణ ప్రాంతంలో రుద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్, రుద్రపూర్ SIDCUL, జగత్‌పురా, రాంపురాలు భాగంగా ఉన్నాయి. [5] కుమావున్ ప్రాంతంలో రుద్రాపూర్ రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం. ఉత్తరాఖండ్ లో ఐదవ అత్యధిక జనాభా కలిగిన నగరం. రుద్రాపూర్‌లో దాదాపు 80% జనాభా అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. [6] దానికి తోడు రుద్రపూర్ మొత్తం జనాభాలో 41.95% మంది మురికివాడల్లో నివసిస్తున్నారు.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [7] రుద్రపూర్ జనాభా 88,720, ఇది 2011లో 1,40,857కి పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. రుద్రాపూర్ సగటు అక్షరాస్యత 71%: పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 63%. రుద్రాపూర్‌ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు.

మతం[మార్చు]

రుద్రాపూర్‌లో మతం (2011)[8][9]
మతం శాతం
హిందూమతం
  
80.29%
ఇస్లాం
  
15.76%
సిక్కుమతం
  
3.17%
బౌద్ధం
  
3.17%
క్రైస్తవం
  
0.43%
ఇతరులు
  
0.32%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం రుద్రాపూర్‌ జనాభాలో 80.29% మంది హిందువులు. 15.76% మంది ప్రజలు ముస్లిములు. క్రైస్తవం 0.43%, జైనమతం 0.12%, సిక్కు మతం 3.17%, బౌద్ధమతం 3.17% పాటిస్తున్నారు. దాదాపు 0.03% మంది 'ఇతర మతం' అని పేర్కొనగా, సుమారు 0.17% మంది 'ప్రత్యేకంగా మతమేమీ లేదు' అని పేర్కొన్నారు.

2011 అక్టోబరు 2 న పట్టణంలో మతకలహాలు జరిగాయి. [10] [11] ధృవీకరించని నివేదికలు ముగ్గురు వ్యక్తులు మరణించారని చెప్పినప్పటికీ, [12] అధికారిక ప్రకటన ప్రకారం ఈ హింసలో ఇద్దరు మరణించారు. [13] ఆ ఘర్షణల్లో దాదాపు 5 దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. [12]

భాష[మార్చు]

హిందీ 1,14,691 మంది, మాట్లాడతారు. బంగ్లా 20.362 మంది, పంజాబీ 6.740 మంది, ఉర్దూ 4,999 మంది, 4,018 మంది కుమావొనీ మాట్లాడుతున్నారు.

భౌగోళికం[మార్చు]

రుద్రపూర్ 28.98⁰N అక్షాంశం, 79.40⁰E రేఖాంశాల వద్ద, [14] సముద్ర మట్టానికి 830 అడుగుల ఎత్తులో ఉంది. [15] నగరం నైనితాల్ నుండి 72 కి.మీ. దూరంలోను, రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుండి 259 కి.మీ., దేశ రాజధాని ఢిల్లీ నుండి 230 కి.మీ. [16] దూరంలో ఉంది.

రవాణా[మార్చు]

పట్టణం నుండి 12.2 km (7.6 mi) దూరంలో ఉన్న పంత్‌నగర్ విమానాశ్రయం సేవలు అందిస్తోంది. ఇక్కడి నుండి ఢిల్లీ, డెహ్రాడూన్‌లకు దేశీయ విమానాల సేవలు ఉన్నాయి. [17] దీనికి 4,500 ft (1,400 m) పొడవైన ఒకే రన్‌వే ఉంది. ఇక్కడ టర్బోప్రాప్ విమానాలు దిగే వీలుంది. [18]

1886 లో రోహిల్‌ఖండ్‌ కుమావున్ రైల్వేను నిర్మించడంతో రుద్రాపూర్‌లో రైలు సేవలు మొదలైనవి. ఈ నగరం భారతీయ రైల్వేలోని ఈశాన్య రైల్వే జోన్‌లోని ఇజ్జత్‌నగర్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మూడు ప్రధాన జాతీయ రహదారులు రుద్రాపూర్ గుండా వెళుతున్నాయి. పంజాబ్‌లోని మలౌట్ నుండి ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ వరకు వెళ్ళే జాతీయ రహదారి 9, రుద్రపూర్ గుండా వెళుతుంది. ఈ రహదారి రుద్రాపూర్‌ని ఢిల్లీ, రాంపూర్, హరిద్వార్, సహరాన్‌పూర్, డెహ్రాడూన్, నైనిటాల్, సితార్ గంజ్, ఖతిమా, తనక్ పూర్, పితోర్ ఘర్ వంటి అనేక నగరాలతో కలుపుతుంది. రుద్రపూర్ నుండి ప్రారంభమయ్యే ఇతర రహదారులు జాతీయ రహదారి 109, జాతీయ రహదారి 309. రుద్రపూర్ బస్ స్టేషన్ ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులకు సెంట్రల్ బస్ స్టాండ్‌గా నగరం నుండి రాష్ట్రాంతర మార్గాల్లో నడుస్తుంది. ఈ స్టేషను దాదాపు 4 ఎకరాలలో విస్తరించి ఉంది. [19]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Cities having population 1 lakh and above, Provisional Population Totals, Census of India 2011" (PDF). Office of the Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. Retrieved 25 August 2013.
 2. 2.0 2.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above, Provisional Population Totals, Census of India 2011" (PDF). Office of the Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. Retrieved 25 August 2013.
 3. District Census Handbook Udham Singh Nagar Part-A (PDF). Dehradun: Directorate of Census Operations, Uttarakhand.
 4. "Rudrapur Metropolitan Urban Region Population 2011 Census". www.census2011.co.in. Retrieved 12 July 2017.
 5. "CONSTITUENTS OF URBAN AGGLOMERATIONS HAVING POPULATION 1 LAKH & ABOVE, CENSUS 2011" (PDF). Retrieved 2017-06-15.
 6. "रुद्रपुर की 17 नजूल की कालोनियों पर 87 हजार से अधिक की आबादी है काबिज" (in హిందీ). Udham Singh Nagar: Amar Ujala. 23 November 2016. Retrieved 12 July 2017.
 7. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
 8. "C-1 Population By Religious Community". Government of India, Ministry of Home Affairs. Retrieved 11 May 2016. On this page, select "Uttarakhand" from the download menu. "Rudrapur (NPP + OG)" is at line 345 of the excel file.
 9. "Rudrapur City Census 2011 data". Census2011. Retrieved 9 March 2017.
 10. "Indefinite curfew imposed in Uttarakhand's Rudrapur town after communal tension". The Times of India. Dehradun. 2 October 2011. Retrieved 12 July 2017.
 11. "रुद्रपुर दंगा मामला : सरकार को जवाब देने के निर्देश" (in హిందీ). Nainital: Amar Ujala. 23 November 2013. Retrieved 12 July 2017.
 12. 12.0 12.1 Prashant, Shishir (3 October 2011). "Communal riots in Rudrapur, 3 killed". Business Standard India. New Delhi. Retrieved 12 July 2017.
 13. "Uttarakhand: 2 killed in communal clash, curfew in Rudrapur". Dehradun: India Today. 3 October 2011. Retrieved 12 July 2017.
 14. "Uttarakhand Situational Assessment Report-Faecal Sludge and Septage Management" (PDF). Sanitation Capacity Building platform (SCBP). 26 June 2019.
 15. "Maps, Weather, and Airports for Rudarpur, India". www.fallingrain.com. Retrieved 2020-09-29.
 16. "नगर निगम रुद्रपुर, उधम सिंह नगर, उत्तराखण्ड – 263153". www.nagarnigamrudrapur.com. Archived from the original on 2020-09-18. Retrieved 2020-09-28.
 17. "Pantnagar Airport to see regular flights again". The Pioneer. 11 September 2014. Retrieved 30 September 2014.
 18. "Fly to Pantnagar, Uttarakhand asks Deccan". Business Standard. 2008-03-26. Retrieved 2009-06-29.
 19. "अपना रुद्रपुर बस अड्डा होगा चकाचक". Jagran (in హిందీ). Rudrapur. 19 June 2016. Retrieved 19 April 2017.

 వెలుపలి లంకెలు[మార్చు]