చుషుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చుషుల్
—  గ్రామం  —
చుషుల్ is located in Ladakh
చుషుల్
చుషుల్
లడఖ్ పటంలో చుషుల్
దేశం  India
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్
జిల్లా Leh
Tehsil Durbuk[1]
జనాభా (2011)
 - మొత్తం 949
Time zone IST (UTC+5:30)
Census code 908

చుషుల్, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతం, లేహ్ జిల్లాలోని ఒక గ్రామం. [2] ఇది పాంగోంగ్ సరస్సుకు దక్షిణంగా, స్పంగూర్ సరస్సుకి పశ్చిమాన ఉన్న "చుషుల్ లోయ" అనే ప్రాంతంలో దుర్బుక్ తహసిల్‌లో ఉంది. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ చుషుల్‌కి తూర్పున 5 మైళ్ల దూరంలో చుషుల్ లోయ మీదుగా వెళ్తుంది. చారిత్రక యుద్ధభూమిగా ఇది ప్రసిద్ధి చెందింది.

1842 ఆగష్టులో డోగ్రా-టిబెటన్ యుద్ధం ముగింపు యుద్ధం చుషుల్ వద్ద జరిగింది. ఈ యుద్ధ పర్యవసానంగా 1842 సెప్టెంబరులో సరిహద్దులలో ఆయుధాల వ్యాప్తిని నిరోధించే చుషుల్ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.[3]


1962 నవంబరు 18 న భారత చైనా యుద్ధంలో, PVC మేజర్ షైతాన్ సింగ్, 120 మందితో కూడిన తన ఐదు ప్లాటూన్‌లతో రెజాంగ్ లా (చుషూల్) వద్ద - చివరి వ్యక్తి, చివరి రౌండ్' వరకు పోరాడారు. అప్పుడు చైనీయులు జరిపిన మారణకాండలో కేవలం 6 గురు సైనికులు మాత్రమే బయటపడ్డారు. [4]

స్థానం

[మార్చు]
చుషుల్‌ను చూపించే మ్యాప్ ( AMS, 1954) [a]
చుషుల్ ప్రాంతం ( DMA, 1992

చుషుల్, పాంగోంగ్ సరస్సుకి దక్షిణంగా 10 మైళ్ల దూరంలో ఉంది. ఇది చుషుల్ నది (లేదా త్సాకా చు) లోయలో ఉంది, ఇది త్సాకా లా సమీపంలో ఉద్భవించి, సుమారు 30 మైళ్ల ఉత్తరంగా ప్రవహించి, థాకుంగ్ సమీపంలో దాని దక్షిణం వైపున ఉన్న పాంగోంగ్ సరస్సులోకి ప్రవేశిస్తుంది. చుషుల్ సమీపంలో, నది దాదాపు 10 చదరపు మైళ్ల విస్తీర్ణమున్న చదునైన మైదానం గుండా ప్రవహిస్తుంది. ఇది ఇక్కడ గడ్డి, ఇంధన కలప వృద్ధికి దోహదపడుతుంది. [5]

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, చుషుల్‌లో 148 గృహాలు ఉన్నాయి. ఆరేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 61.47%. [6]

ప్రజలు ఎక్కువగా మేకలు, యాక్‌ల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంలో, బార్లీ, బఠానీలు సీజన్‌లో ప్రధాన పంటలు. చలి బాగా ఎక్కువగా ఉండే శీతాకాలంలో రాజధాని నగరం లేహ్ నుండి చుషుల్‌కు వెళ్ళే దారికి అవరోధం ఏర్పడుతుంది. చలికాలంలో, చుషుల్‌లో ఐస్ హాకీ ప్రధాన క్రీడ. చుషుల్‌లోని యువతకు ఐస్ హాకీ ఆడడంలో ఆసక్తి మెండు. చుషుల్ ఐస్ హాకీ జట్టు ఇటీవల జిల్లాతో పాటు కర్జూలోని లేహ్‌లో జరిగిన CEC కప్, NDS గ్రౌండ్‌లో కొత్త ఐస్ హాకీ రింగ్‌లో పాల్గొంది. చుషుల్‌లో వివిధ సంఘాలు చుషుల్ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఈ సంఘాలలో కొన్ని: ఉమెన్స్ అలయన్స్ చుషుల్, స్టూడెంట్ యూనియన్ ఆఫ్ చుషుల్, యూత్ అసోసియేషన్ ఆఫ్ చుషుల్, గొన్పా కమ్యూనిటీ ఆఫ్ చుషుల్, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆఫ్ చుషుల్. 2023 నాటికి చుషుల్ గ్రామ సర్పంచిగా త్సెరింగ్ డోల్కర్ ఉంది.

జనాభా వివరాలు (2011 జనగణన ప్రకారం) [6]
మొత్తం పురుషుడు స్త్రీ
జనాభా 949 489 460
6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 121 69 52
షెడ్యూల్డ్ కులం 0 0 0
షెడ్యూల్డ్ తెగలు 945 489 456
అక్షరాస్యులు 509 315 194
కార్మికులు (అందరూ) 556 278 278
ప్రధాన కార్మికులు (మొత్తం) 398 244 154
ప్రధాన కార్మికులు: సాగుదారులు 197 130 67
ప్రధాన కార్మికులు: వ్యవసాయ కార్మికులు 18 12 6
ప్రధాన కార్మికులు: గృహ పరిశ్రమ కార్మికులు 25 14 11
ప్రధాన కార్మికులు: ఇతర 158 88 70
ఉపాంత కార్మికులు (మొత్తం) 158 34 124
ఉపాంత కార్మికులు: సాగుదారులు 49 25 24
ఉపాంత కార్మికులు: వ్యవసాయ కార్మికులు 13 2 11
ఉపాంత కార్మికులు: గృహ పరిశ్రమ కార్మికులు 85 2 83
ఉపాంత కార్మికులు: ఇతరులు 11 5 6
కార్మికులు కానివారు 393 211 182

విద్య

[మార్చు]

చుషుల్‌లో ఐదు పాఠశాలలు ఉన్నాయి. అవి, చుషుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బూక్ ప్రభుత్వ మిడిల్ స్కూల్, టైలింగ్ ప్రభుత్వ మిడిల్ స్కూల్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బౌద్ధ స్టడీస్. 

పరిపాలన

[మార్చు]

1962 చైనా యుద్ధానికి ముందు లడఖ్ జిల్లాలోని చాంగ్‌తంగ్ బ్లాక్‌కు చుషుల్ గ్రామం బ్లాక్ హెడ్‌క్వార్టర్సుగా ఉండేది.

విమానాశ్రయం

[మార్చు]

చుషుల్ ఎయిర్‌స్ట్రిప్ 1954 నుండి పనిచేస్తోంది. ఇది 1962 చైనా-భారత యుద్ధం సమయంలో సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చింది.[7] అప్పట్లో చుషుల్‌కు రోడ్లు లేనందున నం. 12 స్క్వాడ్రన్ IAF, నం. 43 స్క్వాడ్రన్ IAF, నం. 42 స్క్వాడ్రన్ IAF నుండి డకోటాలు, IL 14 లు అక్కడికి రవాణా సామాగ్రిని అందించాయి. [8] 1962 అక్టోబరు 25 & 26 న చైనా-భారత యుద్ధంలో, 44 స్క్వాడ్రన్ IAF యొక్క AN-12 రవాణా విమానాలు ఆరు AMX-13 ట్యాంకులను ఎయిర్‌లిఫ్ట్ చేసి స్పంగూర్ త్సో వద్ద ఉన్న గ్యాప్‌ను (చిల్లులు కలిగిన) ఫిష్‌ప్లేట్‌తో తయారు చేసిన తాత్కాలిక చుషుల్ ఏరోడ్రోమ్ ద్వారా పకడ్బందీగా అమర్చాయి. వీర చక్ర అవార్డు గ్రహీత, 23వ స్క్వాడ్రన్ IAF కి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ వీరేంద్ర సింగ్ పఠానియా చుషుల్ నుండి ఫోటో నిఘా కోసం గ్నాట్ విమానంలో ప్రయాణించారు. [9]

రహదారి

[మార్చు]

చుషుల్-దుంగ్టి-ఫుక్చే-డెమ్‌చోక్ హైవే (CDFD రహదారి), సింధు నదికి దక్షిణపు టొడ్డున LAC కి గుర్తుగా ఉంది. 2025 మార్చి 31 నాటికి దీన్ని 7.45 మీటర్ల వెడల్పుతో 135 కి.మీ పొడవైన జాతీయ రహదారిగా మార్చే ప్రణాళికలున్నాయి. ఈ హైవే వెంట చుషుల్, ఫుక్చే ఎయిర్‌స్ట్రిప్స్ ఉన్నాయి. న్యోమా వాయు స్థావరానికి ఇది వేగవంతమైన రవాణా మార్గాంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంతంలో సైనిక లాజిస్టిక్సును, పర్యాటకాభివృద్ధికీ ఇది దోహదపడుతుంది. [10]

సరిహద్దు సిబ్బంది సమావేశ స్థలం

[మార్చు]

భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి రెండు సైన్యాల మధ్య పరస్పర చర్యల కోసం సంప్రదింపులు జరిపేందుకు అధికారికంగా అంగీకరించబడిన ఐదు సరిహద్దు సిబ్బంది సమావేశ కేంద్రాలలో (బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్లు) చుషుల్ ఒకటి. [11]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. From map: "THE DELINEATION OF INTERNATIONAL BOUNDARIES ON THIS MAP MUST NOT BE CONSIDERED AUTHORITATIVE"

మూలాలు

[మార్చు]
  1. "Villages | District Leh, Union Territory of Ladakh | India".
  2. "Blockwise Village Amenity Directory" (PDF). Ladakh Autonomous Hill Development Council. Archived from the original (PDF) on 9 September 2016. Retrieved 2015-07-23.
  3. Rubin, Alfred P. (1960), "The Sino-Indian Border Disputes", International and Comparative Law Quarterly, vol. 9, no. 1, pp. 96–124, doi:10.1093/iclqaj/9.1.96, JSTOR 756256
  4. "#ShauryaStories: Major Shaitan Singh, 'The Hero of Rezang La' in 1962 war". DNA Web Team. Retrieved 16 January 2021.
  5. Gazetteer of Kashmir and Ladak, Calcutta: Superintendent of Government Printing, 1890, p. 747
  6. 6.0 6.1 "Leh district census". 2011 Census of India. Directorate of Census Operations. Retrieved 2015-07-23. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "census_2011" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. Photos on www.flickr.com
  8. Lal, P.C. "1962 War: The Role of the IAF". Retrieved 17 February 2021.
  9. "Importance of Chushul sector: Indian Army's consolidation will give New Delhi access to east Ladakh and region's crucial airstrip". First Post. Retrieved 16 December 2020.
  10. BRO starts process for 135-km road near LAC from Chushul to Demchok, News18, 24 Jan 2023.
  11. "Indian soldiers prevent Chinese troops from constructing road in Arunachal". The Times of India. 28 Oct 2014. Retrieved 11 Nov 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=చుషుల్&oldid=3855521" నుండి వెలికితీశారు