విశ్వనాథ్ చారియాలి
విశ్వనాథ్ చారియాలి | |
---|---|
నగరం | |
Coordinates: 26°43′40″N 93°09′06″E / 26.72778°N 93.15167°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | విశ్వనాథ్ |
జనాభా (2011) | |
• Total | 19,145 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఏఎస్ |
విశ్వనాథ్ చారియాలి, అస్సాం రాష్ట్రంలోని విశ్వనాథ్ జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం. 2015 ఆగస్టు 15న విశ్వనాథ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది. విశ్వనాథ్ ఘాట్ నుండి ఈ నగరం పేరు వచ్చింది.
ఇక్కడ అస్సాంలోని మొట్టమొదటి "క్లాక్ టవర్" (ఘంటఘర్, సాధారణంగా ఉత్తర భారత పట్టణాల్లో కనుగొనబడింది) ఏర్పాటు చేశారు. దీని తరువాత డిబ్రూగర్లో క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [1] విశ్వనాథ్ చారియాలిలో 19,145మంది జనాభా ఉండగా అందులో పురుషులు 51% మంది, స్త్రీలు 49% మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం, విశ్వనాథ్ చారియాలి సగటు అక్షరాస్యత 80% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 85% ఉండగా, స్త్రీ అక్షరాస్యత 75% ఉంది. ఈ మెత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
చరిత్ర
[మార్చు]విశ్వనాథ్ ప్రాంతం చాలా చారిత్రక ప్రాముఖ్యతను కలిగివుంది. ఈ ప్రాంతం కామతా రాజ్యం, చుటియా రాజ్యాల మధ్య, ఆ తరువాత కోచ్ రాజ్యం, అహోం రాజ్యాల మధ్య సరిహద్దుగా ఉండేది. చుటియా రాజులు నిర్మించిన ప్రతాప్‌గర్, బురోయ్ మొదలైన కోటల శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి.[2]
విశ్వనాథ్ దృశ్యాలు
[మార్చు]విశ్వనాథ్ ఘాట్
[మార్చు]విశ్వనాథ్ చారియాలికి దక్షిణం వైపున, విశ్వనాథ్ ఘాట్ ఉంది, దీనిని "గుప్తా కాశీ" అని కూడా పిలుస్తారు. ఇక్కడున్న పురాతన విశ్వనాథ్ మందిరం పేరునే ఈ నగరానికి పేరు పెట్టారు. ఈ ఘాట్‌లో వివిధ దేవతల దేవాలయాలు ఉన్నాయి. బృధగంగ (బురిగోంగా) నది బ్రహ్మపుత్రా నదిలో కలిసే ప్రాంతం దగ్గర పాణి విశ్వనాథ్ అనే శివాలయం ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ రాతి గోటలు, ఇతర శిథిలాలు మాత్రమే మిగిలాయి. వేసవికాలంలో ఈ ఆలయం నీటిలోనే ఉంటుంది. బిహు మూడవరోజు పాణి భరాల్ అనే ప్రదేశంలో ఉత్సవం జరుగుతుంది. విశ్వనాథ్ ఘాట్ నుండి దేవతను ఒక రోజు ఈ ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఘాట్ కు తిరిగి వస్తారు. ఇక్కడ ఉన్న ఎత్తైన మైదానంలో మరో శివాలయం నిర్మించబడింది. కానీ 1897లో వచ్చిన భూకంపం సమయంలో ఆ శివాలయం భూమిలో మునిగిపోయింది. ఆ తరువాత దానికి బదులుగా ప్రస్తుత విశ్వనాథ్ ఆలయం నిర్మించబడింది.
నాగసంకర్ మందిరం
[మార్చు]విశ్వనాథ్ చారియాలి నుండి 15 కి.మీ.ల దూరంలో 52వ జాతీయ రహదారిలో ఉన్న నాగసంకర్ గ్రామంలో సా.శ. 4వ శతాబ్దంలో నిర్మించబడిన నాగసంకర్ ఆలయం ఉంది.[3][4] ఈ ఆలయ ప్రాంగణంలో "మోహన్" పేరుకు ప్రతిస్పందించే తాబేలులతో కూడిన అందమైన చెరువు ఉంది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]మోనాబరీ, పెర్టుబ్‌ఘర్, సకోమాత, నిల్పూర్, పావోయి, కలాపాని, జిన్జియా, కేటెలా, బిహాలి, హెలెం, గోహ్‌పూర్, బోర్గాంగ్, ధోలీ, మిజికాజన్, మజులీగర్ అనే పచ్చని గ్రీన్ టీ తోటలు ఈ నగరం చుట్టూ ఉన్నాయి.
రాజకీయాలు
[మార్చు]విశ్వనాథ్ చారియాలి నగరం తేజ్పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[5] విశ్వనాథ్ చారియాలికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రమోద్ బర్తకూర్ (2016-2021) ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎంపిగా పల్లాబ్ లోచన్ దాస్ (2019-2024) లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 21 December 2020.
- ↑ Journal Of The Asiatic Society Of Bengal 1904, p. 257-258
- ↑ "Nagsankar Mandir (Temple)". Retrieved 21 December 2020.
- ↑ "Nag-Sankar Temple". tripadvisor.in. Retrieved 21 December 2020.
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 4 May 2006. Retrieved 21 December 2020.