Coordinates: 26°00′N 92°52′E / 26.0°N 92.87°E / 26.0; 92.87

హోజాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోజాయ్
పట్టణం
హోజాయ్ is located in Assam
హోజాయ్
హోజాయ్
భారతదేశంలోని అస్సాంలోని ప్రదేశం ఉనికి
హోజాయ్ is located in India
హోజాయ్
హోజాయ్
హోజాయ్ (India)
Coordinates: 26°00′N 92°52′E / 26.0°N 92.87°E / 26.0; 92.87
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyహోజాయ్ పురపాలక సంఘం
 • శాసనసభ సభ్యుడుశిలాదిత్య దేవ్ (బిజెపి)
Area
 • Total21.219 km2 (8.193 సుమారు sq mi)
Population
 (2011)[1]
 • Total36,638
భాష
 • అధికారికఅస్సామీ[2]
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
782435
Area code+91-3674
Vehicle registrationఏఎస్ 31

హోజాయ్, అస్సాం రాష్ట్రంలోని హోజాయ్ జిల్లా లో ముఖ్య పట్టణం, పురపాలక సంఘం.[3] 2016, ఆగస్టు 15న జిల్లా ముఖ్య పట్టణంగా ఏర్పాటు చేయబడింది.

పద వివరణ[మార్చు]

హోజాయ్ అనే పదం దిమాసా ప్రజలలోని ఒక వంశం నుండి వచ్చింది.

భౌగోళికం[మార్చు]

హోజాయ్ పట్టణం 26°00′N 92°52′E / 26.0°N 92.87°E / 26.0; 92.87 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[4] ఇది సముద్ర మట్టానికి 59 మీటర్ల (193 అడుగుల) ఎత్తులో ఉంది.

చరిత్ర[మార్చు]

మధ్యయుగ కాలంలో హోజాయ్ పట్టణం దిమాసా కచారి రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. హోజాయ్ ప్రాంతంలో నివసిస్తున్న దిమాసా కచారీలను "హోజాయ్-కచారీస్" అని పిలిచేవారు. దిమాసా తెగకు చెందిన వంశాలలో "హోజాయ్" (సెంగ్‌ఫాంగ్స్) వంశం ఒకటి. ఈ వంశం పేరుమీదుగా ఈ పట్టణానికి "హోజాయ్" పట్టణమని పేరు వచ్చింది. 1983, ఆగస్టు 15న దీనిని నాగావ్ జిల్లా ఉపవిభాగంగా చేశారు. 2016, ఆగస్టు 15న మరో 3 కొత్త జిల్లాలతో పాటు దీనిని రాష్ట్ర కొత్త జిల్లాగా ప్రకటించారు.[5]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హోజాయ్ పట్టణంలో 36,638 జనాభా ఉంది. ఇందులో 18,762 మంది పురుషులు, 17,876 మంది మహిళలు ఉన్నారు. పట్టణ జనాభాలో 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారు 3,869 మంది ఉన్నారు. పట్టణ అక్షరాస్యత 29,708 కాగా, మొత్తం జనాభాలో ఇది 81.1% గా ఉంది. ఇందులో పురుష అక్షరాస్యత 83.9%, స్త్రీ అక్షరాస్యత 78.1% గా ఉంది. పట్టణంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 3,158 మంది, షెడ్యూల్డ్ తెగల జనాభా 197 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హోజాయ్‌ పట్టణంలో 7049 గృహాలు ఉన్నాయి.[1]

భాష[మార్చు]

హోజాయ్ లోని భాషలు[6]

  హిందీ (16.0%)
  ఇతర భాషలు (2.6%)

ఈ పట్టణంలో 69.6% మంది బెంగాలీ, 16.0% మంది హిందీ, 10.7% మంది అస్సామీ, 1.6% మణిపురి భాషలు మాట్లాడేవారు ఉన్నారు.

మతాలు[మార్చు]

పట్టణ జనాభాలో 81.11% మంది హిందువులు, 18.28% మంది ముస్లీంలు ఉన్నారు. సిక్కు మతం, క్రైస్తవ మతం, ఇతర మతాల వాళ్ళు పట్టణ జనాభాలో ఒక శాతం కన్నా తక్కువ ఉన్నారు.

హోజాయ్ లోని మతాలు[7]
మతం జనాభా శాతం
హిందువులు
  
81.11%
ముస్లీంలు
  
18.28%
ఇతరులు
  
0.61%
ఈస్ట్-వెస్ట్ కారిడార్ లో హోజాయ్ జిల్లా గుండా నాలుగు లైన్లరోడ్డు.
కొత్తగా నిర్మించిన విమానాశ్రయం లాంటి హోజాయ్ రైల్వే స్టేషన్
హోజాయ్ రైల్వే స్టేషను

జిల్లా పరిపాలన[మార్చు]

పట్టణ డిప్యూటీ కమిషనర్ గా సద్నెక్ సింగ్, [8] పోలీసు సూపరింటెండెంట్ గా అంకుర్ జైన్[9] ఉన్నారు.

రవాణా[మార్చు]

రోడ్డుమార్గం[మార్చు]

హోజాయ్ పట్టణం ద్వారా రాష్ట్ర రహదారులు, ఇతర రాష్ట్రాలకు కలుపబడుతున్నాయి. దీనికి సమీపంలో 54వ జాతీయ రహదారి ఉంది.

రైల్వేమార్గం[మార్చు]

లమ్డింగ్ డివిజన్‌లోని గౌహతి-లమ్డింగ్ సెక్షన్ లైనులో హోజాయ్ రైల్వే స్టేషను ఉంది. ఈ స్టేషను ద్వారా భారతదేశంలోని వివిధ నగరాలకు రైల్వే సర్వీసులు ఉన్నాయి.

విమానాశ్రయం[మార్చు]

ఈ పట్టణానికి సుమారు 120 కి.మీ దూరంలో తేజ్పూర్ విమానాశ్రయం ఉంది.

190 కి.మీ. దూరంలోని గువహాటిలో ఎల్‌జిబి[10] అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Census of India: Hojai". www.censusindia.gov.in. Retrieved 23 December 2020.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 డిసెంబరు 2020.
  3. "Assam gets five more districts". Zee News. 15 August 2015.
  4. "redirect to /world/IN/03/Hojai.html". www.fallingrain.com.
  5. "Know about the District | Hojai District | Government Of Assam, India". hojai.assam.gov.in. Archived from the original on 2021-05-14. Retrieved 2020-12-23.
  6. "C-16 Population By Mother Tongue - Hojai (MB)". census.gov.in. Retrieved 23 December 2020.
  7. "C-16 Population By Religion - Assam". census.gov.in. Retrieved 23 December 2020.
  8. "Meet the Deputy Commissioner | Hojai District | Government Of Assam, India". Archived from the original on 4 ఫిబ్రవరి 2020. Retrieved 17 March 2020.
  9. "Ankur Jain, IPS | Hojai District | Government Of Assam, India". hojai.assam.gov.in. Archived from the original on 22 సెప్టెంబరు 2021. Retrieved 23 December 2020.
  10. "Guwahati Airport". aera.gov.in. Archived from the original on 21 నవంబరు 2019. Retrieved 23 December 2020.

ఇతర లంకెలు[మార్చు]

హోజాయ్ అధికారిక వెబ్‌సైట్ Archived 2020-09-18 at the Wayback Machine

"https://te.wikipedia.org/w/index.php?title=హోజాయ్&oldid=3950858" నుండి వెలికితీశారు