కోచ్ భాష
స్వరూపం
కోచ్ | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | భారతదేశం, బంగ్లాదేశ్ | |
మాట్లాడేవారి సంఖ్య: | 36,434 | |
భాషా కుటుంబము: | Sino-Tibetan సాల్ బోడో-గారో కోచ్ కోచ్ | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | none | |
ISO 639-2: | — | |
ISO 639-3: | kdq | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
కోచ్ భాష కోచ్ తెగ ప్రజలు మాట్లాడే సినో-టిబెటన్ భాష. ఈ భాష భారతదేశంలోని మేఘాలయ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలోని కాక బంగ్లాదేశ్ దేశంలో కూడా మాట్లాడబడుతుంది. కోచ్ భాష అస్సామీ, బెంగాలీ ఇంకా రోమన్ లిపులతో ఉపయోగంలో ఉంది. ఈ భాష కోచ్, కోచ్-రాజ్ బాంగ్షిలకు చెందిన తేగల వారు ఉపయోగిస్తారు.
మేఘాలయ రాష్ట్రంలోని తుర పట్టణంలో కోచ్ భాషపై పనిచేసే క్రొరాంగ్ మాథోప్ అనే సంస్థ ఉంది, ఈ సంస్థ కోచ్ భాష అభివృద్ధికై కృషి చేస్తుంది. క్రొరాంగ్ మాథోప్ సంస్థ కోచ్ భాషలో పుస్తకాలు ప్రచురించింది, అలాగే ఈ సంస్థ కోచ్ భాషలో ఒక మ్యాగజైన్ కూడా నడుపుతుంది. నాగరికత వల్ల అంతరించిపోతున్న ఈ భాష ఉనికిని ఈ సంస్థ కాపాడుతుంది.
మాండలికాలు
[మార్చు]కోచ్ భాష ప్రస్తుతం ఆరు మాండలీకాలతో మనుగడలో ఉంది, అవి క్రింది విధంగా ఉన్నాయి:
- తింటికియా,
- వనాంగ్/స్వమ్బ్రి,
- హరిగయ,
- చాప్రా,
- మార్గన
- కొచ్చా. (కోచా/కోచ్ - రభా)
భౌగోళిక విస్తీర్ణం
[మార్చు]కోచ్ భాష కింది ప్రాంతాలలో వాడుకలో ఉంది:
- అస్సాం :
- బక్సా జిల్లా - హోడి లేదా కోచ్ మండై
- బొంగైగావ్ జిల్లా - మదాసి కోచ్, కోచ్
- దర్రాంగ్ జిల్లా - హోడి లేదా కోచ్ మండై
- ధేమాజీ జిల్లా - హోడి లేదా కోచ్ మండై
- ధుబ్రి జిల్లా - మదాసి కోచ్, కోచ్
- గోల్పారా జిల్లా - మదాసి కోచ్, కొచా రాభా, కోచో కోరో, హోడి లేదా కోచ్ మందై
- కోక్రాఝర్ జిల్లా - మదాసి కోచ్, కోచ్
- లఖింపూర్ జిల్లా - హోడి లేదా కోచ్ మండై
- నాగోన్ జిల్లా - హోడి లేదా కోచ్ మండై, కొచో కోరో
- ఉదల్గురి జిల్లా - హోడి లేదా కోచ్ మండై
- సోనిత్పూర్ జిల్లా - హోడి లేదా కోచ్ మండై
- దక్షిణ సల్మారా జిల్లా - హోడి లేదా కోచ్ మండై, కోచ్
- బంగ్లాదేశ్ : హోడి లేదా కోచ్ మండై, కోచో కోరో
- బీహార్ : రాజ్బొంగ్షి కోచ్
- మేఘాలయ :
- తూర్పు ఖాసీ కొండలు - హోడి అలియాస్ కోచ్ మండై
- వెస్ట్ గారో హిల్స్ జిల్లా - కోచ రాభా లేదా కోచ్
- త్రిపుర : హోడి లేదా కోచ్ మండై లేదా కోచ్
- పశ్చిమ బెంగాల్ : రాజ్బోంగ్షి కోచ్, కొచా రాభా