రాఫెల్ ఒప్పందం వివాదం
రాఫెల్ ఒప్పంద వివాదం అనేది భారతదేశంలో జరిగిన రాజకీయ వివాదం. ఇది ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నుండి యుద్ధ విమానం కొనుగోలుకు సంబంధించింది. భారతదేశపు రక్షణ మంత్రిత్వ శాఖ 7.8 బిలియన్లు చెల్లింపులపై చెలరేగిన వివాదం.
నేపథ్యము
[మార్చు]2012 జనవరి 31 న, భారత రక్షణ మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళానికి 126 విమానాలు సరఫరా చేయడానికి, ఇంకా 63 అదనపు విమానాలు ఎంపిక చేసుకోవడానికి ఏర్పాటు చేసిన MMRCA పోటీలో డసాల్ట్ రఫేల్ సంస్థ గెలుపొందినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొదటి 18 విమానాలను పూర్తిగా డసాల్ట్ ఏవియేషన్ నిర్మించి సరఫరా చేయవలసి ఉండగా, మిగతా 108 విమానాలను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కి సాంకేతికతను బదలాయించి డసాల్ట్ లైసెన్సుకు లోబడి ఉత్పత్తి చేయవలసి ఉంది.[1] హెచ్‌ఏఎల్ ఉత్పత్తి చేసే విమానాలకు వారంటీపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున డసాల్ట్‌తో చర్చలు జరిగాయి. హెచ్‌ఏఎల్ ఉత్పత్తి చేసే విమానాల నాణ్యతను డసాల్ట్ నిర్ధారించాలని భారత్ కోరింది. కాని డసాల్ట్ అలా చేయడానికి నిరాకరించింది.[2][3]
భారత వాయుసేనకు 126 రాఫెల్ యుద్ధవిమానాలను సరఫరా చేసేందుకు 2012లో ఒక టెండర్ ద్వారా దసౌ కంపెనీని ఎంపిక చేశారు. భారత్‌లో రాఫెల్ విమానం తయారీ కోసం హెచ్‌ఎఎల్‌కు సాంకేతికత బదీలి చేయడానికి సంబంధించిన కాంట్రాక్టు కుదిరిందని దసౌ సిఇఓ 2015 మార్చి 25న వాయుసేన ప్రధానాధికారి, హెచ్ఏఎల్ చైర్మన్ సమక్షంలో ప్రకటించారు. ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరుగుతాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే మార్చి 26న దసౌ, రాఫెల్ తయారీ విషయమై ఒక ప్రైవేట్ భారతీయ కంపెనీతో ‘జాయింట్ వెంచర్’ విషయమై ఒక ఎంవోయుపై సంతకం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంట ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళిన భారతీయ అధికారులు 2015 ఏప్రిల్ 8న పారిస్‌లో దసౌ–-హెచ్ఏఎల్ మధ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు జరుగుతాయని ప్రకటించారు.[4] అయితే ఈ ఒప్పందాన్ని రద్దుచేశామని, ఫ్రాన్స్‌లో తయారైన 36 రాఫెల్స్‌ను భారత వాయుసేన కొనుగోలు చేస్తుందని ప్రధాని మోదీ 2015 ఏప్రిల్ 10న పారిస్‌లో ప్రకటించారు. 2015 నవంబరు 9న దసౌ, ప్రైవేట్ భారతీయ కంపెనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
2016 సెప్టెంబరులో 36 రాఫెల్ యుద్ధ విమానాల విక్రయంపై భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.[5] 2016 నవంబరు 28న వాటాదారుల ఒప్పందంపై దసౌ, ప్రైవేట్ భారతీయ కంపెనీ సంతకాలు చేశాయి. 51 శాతం ఈక్విటీతో దసౌ 159 మిలియన్ యూరోలు సమకూర్చేందుకు, 49 శాతం ఈక్విటీతో ప్రైవేట్ భారతీయ కంపెనీ 10 మిలియన్ యూరోలు సమకూర్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ వాస్తవాలపై నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ కొత్త విచారణ ప్రారంభించింది. ఈ విచారణ ఒక స్వతంత్ర న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతోంది.
వివాదము
[మార్చు]రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసౌ నిబంధనలకు విరుద్ధంగా భారత్‌కు చెందిన ఒక మధ్యవర్తికి 10 లక్షల యూరోలను చెల్లించడానికి అంగీకరించిందని 2021 ఏప్రిల్‌లో ఫ్రెంచ్ వార్తాసంస్థ మీడియా పార్ట్ తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది. డిఫైస్ సొల్యూషన్స్ అనే భారతీయ కంపెనీకి 5,98,925 యూరోలను వాస్తవంగా చెల్లించిందని కూడా ఆ వార్తా కథనం వెల్లడించింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Pandit, Rajat (1 February 2012). "French jet Rafale bags $20bn IAF fighter order; India 'briefs' losing European countries". The Times of India.
- ↑ Prusty, Nigam; Kotoky, Anurag (5 April 2013). "Government's $15 billion Rafale deal faces delays: sources". Reuters. Archived from the original on 11 నవంబరు 2020. Retrieved 10 జూలై 2021.
- ↑ Datt, Gautam (5 April 2013). "HAL's poor track record overshadows IAF plans to buy 126 Dassault Rafale jets". India Today.
- ↑ "India to buy 36 Rafale jets in ready condition". The Hindu. Press Trust of India. 10 April 2015.
- ↑ Peri, Dinakar (27 January 2016). "Rafale deal: only MoU signed". The Hindu.
- ↑ iyervval, iyervval (6 July 2021). "'Expose' by Mediapart and the French 'investigation' into Rafale deal: A ready reckoner on why it's a sham". opindia.