సింహవాహిని మహంకాళి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహవాహిని మహంకాళి దేవాలయం
బోనాల పండుగలో సింహవాహిని మహంకాళి దేవాలయం
పేరు
స్థానిక పేరు:లాల్ దర్వాజ మహంకాళి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాదు
ప్రదేశం:లాల్ దర్వాజ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మహంకాళి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
20వ శతాబ్దం

సింహవాహిని మహంకాళి దేవాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ దర్వాజ ప్రాంతంలో ఉన్న దేవాలయం.

చరిత్ర

[మార్చు]

1907లో లాల్ దర్వాజ నిర్మించబడింది. 1908 సంలో మూసినదికి వరద వల్ల హైదరాబాదులో చాలా ప్రాంతాలు మునిగిపోవడంతో నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పెర్షాద్ సలహా మేరకు హైదరాబాదు నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి పూజలు నిర్వహించడంతోపాటు ఒక బంగారు చాటలో పట్టువస్త్రాలు, మేలిమి ముత్యాలు, నగలు, బంగారు గాజులు, కుంకుమ, పసుపుతో అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి వాటిని మూసినదిలో వదిలిపెట్టగా వరద తగ్గింది. ఆ సందర్భంగా ఈ దేవాలయం నుండి బోనాల పండుగ ప్రారంభించబడింది.[1] మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ దేవాలయానికి విరాళాలు, భూమిని ఇచ్చి అభివృద్ధి చేశాడు.[2]

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే బోనాల పండుగ తెలంగాణలో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా పరిగణించబడుతోంది.[3] ఆషాడం బోనాలు రెండు రోజులు పాటు జరుగుతాయి. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి రంగం కార్యక్రమానికి అనేకమంది భక్తులు వస్తారు. మొదటిరోజు తెల్లవారు జామునుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. రెండవరోజు రంగం, ఘటం ఊరేగింపు నిర్వహిస్తారు.[4] రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

అభివృద్ధి

[మార్చు]

2014లో జరిగిన బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమ్మవారికి బంగారు బోనం సమర్పించి, మొక్కు తీర్చుకున్నాడు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా విస్తరణ పనులకోసం నిధులు మంజూరు చేస్తానని ప్రకటించి, అమ్మవారి దేవాలయాన్ని ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడంకోసం చుట్టూ నివాసాలు ఉన్న భక్తులు సహకరించాలని కోరాడు.

2023 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం అమ్మవారి దేవాలయ విస్తరణకు అభివృద్ధికి 8.95 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దేవాలయం చుట్టూ ఉన్న నివాసాలకు సంబంధించిన మొత్తం 11 వందల గజాల స్థలం అమ్మవారి దేవాలయం విస్తరణ కోసం భక్తులు అప్పగిస్తుండడంతో వారందరికి పరిహారం చెల్లించనున్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. Farooqui, M. M. (2019-07-17). "Lal Darwaza Bonalu to make its mark in Maharashtra". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-23. Retrieved 2023-02-23.
  2. "Nizam gave funding for temples, and Hindu educational institutions". 2013-05-28.
  3. "Archived copy". Archived from the original on 24 October 2014. Retrieved 11 January 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. ABN (2022-07-25). "భక్తులతో కిక్కిరిసిన లాల్దర్వాజ మహంకాళి ఆలయం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-02-23. Retrieved 2023-02-23.
  5. telugu, NT News (2023-02-12). "పుణ్యక్షేత్రంగా లాల్‌దర్వాజా ఆలయం". www.ntnews.com. Archived from the original on 2023-02-12. Retrieved 2023-02-23.