ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి దేవాలయం
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసూర్యాపేట
స్థలంఎర్రవరం, కోదాడ మండలం
సంస్కృతి
దైవంలక్ష్మీనరసింహస్వామి

ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, కోదాడ మండలంలోని ఎర్రవరం గ్రామంలో ఉన్న దేవాలయం. తన రూపాన్ని ఉద్భవింపజేసుకోని అతితక్కువకాలంలోనే పేరుగాంచిన ఈ స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం 5వేల మంది భక్తులు వస్తుండగా, ప్రతి శుక్రవారం 25వేల మంది భక్తులు వస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక నుంచీ వస్తున్న భక్తులకు దేవాలయ కమిటీవారు నిత్య అన్నదానం చేస్తున్నారు.[1]

చరిత్ర[మార్చు]

ఎర్రవరం గ్రామానికి చెందిన ఒక మహిళను స్వామివారు ఆవహించి బాల ఉగ్రనరసింహస్వామిని వచ్చానని చెప్పగా గ్రామస్తులు ఎవరూ నమ్మలేదు. కొంతకాలం తర్వాత 2022 ఆగస్టులో గ్రామానికి చెందిన ఒక బాలుడు ఎర్రవరం దుళ్లరాళ్ల గుట్టలో స్వామి ఉన్నాడని చెప్పడంతో గ్రామస్తులు తవ్వగా ఒక బండమీద నామాలు, శంకు చక్రాలతో దేవుని ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఇక్కడ నిత్య పూజలు చేయడం ప్రారంభించారు.

విశిష్టత[మార్చు]

స్వామివారు వెలసిన విషయం అంతటా వ్యాపించి భక్తుల రాక మొదలైంది. దాంతో గ్రామానికి చెందిన పెద్దలు దేవాలయ నిర్మాణానికి 18 మంది సభ్యులతో (ఇద్దరు ముస్లింలు) దేవాలయ అభివృద్ధి కమిటీని వేశారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తాత్కాలిక వసతులు కల్పించడంతోపాటు నిత్య అన్నదానం కూడా చేస్తున్నారు.[2] గురువారం, ఆదివారం రాత్రి సమయంలో, శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు స్వామివారిని స్మరిస్తూ కీర్తనలు, భజనలు చేస్తున్నారు. గ్రామంలోని 50 ముస్లిం కుటుంబాల వారుకూడా ప్రతి శుక్రవారం ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు.

నిర్మాణం[మార్చు]

ఇక్కడికి వస్తున్న భక్తులు దేవాలయ నిర్మాణానికి విరాళాలు కూడా అందిస్తున్నారు. 20 కోట్ల రూపాయలతో దేవాలయ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు దేవాలయానికి సంబంధించిన డిజైన్ కూడా రూపొందించారు.

కొండ పక్కన భూమి ఉన్న ఒక రైతు తన భూమిని భక్తుల సౌకర్యాల అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని కమిటీ అభ్యర్థించింది. అందుకు రైతు నిరాకరించడంతో దేవాలయ అభివృద్ధి కమిటీలోని మస్తాన్‌ తనకున్న 35 లక్షల రూపాయల విలువైన ఎకరం భూమిని ఆ రైతుకు నష్టపరిహారంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఒప్పించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2023-05-13). "ఎర్రవరం.. భక్త జనసంద్రం". www.ntnews.com. Archived from the original on 2023-05-18. Retrieved 2023-08-31.
  2. Chary, Anil (2023-07-30). "ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ దేవాలయానికి భక్తుల తాకిడి". Mana Telangana. Archived from the original on 2023-08-31. Retrieved 2023-08-31.
  3. Today, Telangana (2022-12-11). "This temple in Suryapet has Muslims serving devotees". Telangana Today. Archived from the original on 2023-08-31. Retrieved 2023-08-31.