వెంకటేశ్వరస్వామి దేవాలయం, జమలాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటేశ్వరస్వామి దేవాలయం
వెంకటేశ్వరస్వామి దేవాలయం
వెంకటేశ్వరస్వామి దేవాలయం
పేరు
ఇతర పేర్లు:జమలాపురం దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఖమ్మం జిల్లా
ప్రదేశం:జమలాపురం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వెంకటేశ్వరుడు
ప్రధాన దేవత:పద్మావతి, అలివేలు మంగ
ముఖ్య_ఉత్సవాలు:వెంకటేశ్వర కల్యాణం
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ

వెంకటేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, జమలాపురం గ్రామంలోని కొండపై ఉన్న దేవాలయం. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వరస్వామి సతీసమేతంగా వెలిసిన ఈ క్షేత్రం తిరుపతిగా పేరుగాంచింది.[1]

చరిత్ర

[మార్చు]
జమలాపురం గుడి వాకిలి

తీర్థయాత్రలు చేస్తూ జమలాపురం గ్రామానికి చేరుకున్న జాబాలి మహర్షి, అక్కడే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు వేదం నేర్పించడంకోసం గురుకులాన్ని స్థాపించాడు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని సూచీగిరి అని పిలిచేవారు.[2]

విశిష్టత

[మార్చు]
వెంకటేశ్వరస్వామి దేవాలయం, జమలాపురం

శ్రీరాముడు తాను కలియుగం ప్రారంభం రోజున వెంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పగా, కలియుగం ప్రారంభం రోజున వెంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో వెలిశాడని, అందుకే ఈ విగ్రహం తిరుమలలోని వెంకటేశ్వరుడి విగ్రహం కంటే పురాతనమైనదని చెబుతారు.[3]

నిర్మాణం

[మార్చు]

1965లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోబడిన ఈ దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ సూచనలతో 1976, మార్చి 26 చైత్రశుద్ధ సప్తమినాడు వెంకటేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది.[1]

ఈ ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు, శ్రీ అలివేలు మంగ అమ్మవారు, శివుడు, వినాయకుడు, అయ్యప్ప, అంజనేయస్వామి లకు ఉప మందిరాలు ఉన్నాయి.

ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారానికి 108 మెట్లు, వెనుక ప్రవేశ ద్వారానికి 11 మెట్లు ఉన్నాయి.

ఉత్సవాలు - పండుగలు

[మార్చు]

ప్రతి సంవత్సరం వెంకటేశ్వరస్వామి కల్యాణం జరిపి, ఉత్సవాలు నిర్వహిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (3 May 2020). "జమలాపురంలో... జగన్నాయకుడు!". ntnews. పసుపులేటి వెంకటేశ్వరరావు. Archived from the original on 3 May 2020. Retrieved 14 May 2020.
  2. తెలుగు ఏపి హెరాల్డ్, తెలుగు వార్తలు (1 February 2020). "జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఎలా వెలిశాడంటే?". www.dailyhunt.in. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
  3. తెలుగు నేటీవ్ ప్లానెట్, ఖమ్మం. "జమలాపురం ఆలయం". www.telugu.nativeplanet.com. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.

ఇతర లంకెలు

[మార్చు]