Jump to content

బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం,ముశిపట్ల

వికీపీడియా నుండి
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం is located in Telangana
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం
తెలంగాణ రాష్ట్రంలో ఉనికి
భౌగోళికాంశాలు :17°27′00″N 79°16′00″E / 17.45°N 79.2667°E / 17.45; 79.2667
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రదేశం:ముశిపట్ల గ్రామం, మోత్కూర్ మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి

బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలంలోని ముశిపట్ల గ్రామంలో ఉంది. ముశిపట్ల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని గుట్టపై ఉన్న ఈ ఆలయంలో బుగ్గరామలింగేశ్వర స్వామి లింగాకారంలో దర్శనమిస్తాడు. ఈ గుట్టను బుగ్గరామలింగేశ్వర స్వామి గుట్ట అంటారు.[1]

బుగ్గరామలింగేశ్వర స్వామి గుట్ట

ఆలయ చరిత్ర

[మార్చు]

త్రేతాయుగంలో రాముడు, సీతాదేవిని వెతుక్కుంటూ లంకకు వెలుతూ ముశిపట్ల గుట్టమీద కొన్నిరోజులు నివాసం ఉండి, నల్లరంగులో ఉన్న ఒక శివలింగాన్ని ఈ గుట్ట మీద ప్రతిష్టించాడని, అందుకే ఇక్కడి దేవుడిని బుగ్గరామలింగేశ్వర స్వామి అంటారని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇతర దేవుళ్ళు

[మార్చు]

2023, జూన్ 6, 7, 8 తేదీల్లో గుట్ట మీద నిర్మించిన వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ, ముత్యాలమ్మ దేవాలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవాలు జరిగాయి.[2] జూన్ 7న ధ్యానాధివాసం, పుష్పాధివాసం, జలాధివాసం, గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జూన్ 8న ఉదయం 8 గంటలకు విగ్రహాలను ప్రతిష్ఠాపించి, పూజలు నిర్వహించారు.[3]

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ సందర్భంగా రెండు రోజులపాటు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రిరోజు రాత్రి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో శివపార్వతుల వివాహం జరుగుతుంది. అటుతర్వాత పార్వతీ సమేతుడైన రామలింగేశ్వస్వామి ఉత్సవమూర్తిని గ్రామంలోని ప్రతిఇంటికి ఊరేగింపుగా తీసుకెలుతారు.[4] అలా వచ్చిన ఉత్సవమూర్తికి ఆ ఇంటివారు కొబ్బరికాయలు, నైవేద్యంతో పూజిస్తారు. ఊరంతా తిరిగిన ఉత్సవమూర్తిని మరునాడు తెల్లవారుజామున మళ్ళీ గుట్ట దగ్గరున్న అగ్నిగుండాల దగ్గరికి తీసుకెలుతారు. అప్పటికే అక్కడికి ఊరి జనం వచ్చి చేరుతారు.

గ్రామంలోని కొందరు ఉత్సవమూర్తి ముందు కటాలు చదువుతుండగా అగ్నిగుండాల చుట్టూ ఉత్సవమూర్తిని మూడుసార్లు తిప్పుతారు. అటుతర్వాత ఉత్సవమూర్తితో కలిసి గ్రామస్తులు అగ్నిగుండాలు తొక్కి, గుట్టపై ఉన్న ఆలయంలోకి ఉత్సవమూర్తిని తీసుకెలుతారు. గ్రామస్తులంతా గుట్టపైకి చేరుకొని ఆలయ సమీపంలోని గుండంలో స్నానం చేస్తారు. ఏకాలంలోనైనా ఈ గుండంలో నీరు ఎండిపోకపోవడం ఈ గుండం ప్రత్యేకత. గుండం ప్రక్కనే ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి పాదాల వద్ద భక్తులు పూజలు చేసి కొబ్బరి కాయలు కొడుతారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని కానుకలు సమర్పిస్తారు.

మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో నల్లటి లింగాకారంతో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. గుట్ట కింద, చుట్టుప్రక్కల గ్రామాలనుంచి వచ్చిన దుకాణదారులు వివిధ వస్తువులతో దుకాణాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు కోసం ఉత్సవ కమిటీ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది.

ప్రత్యేకతలు

[మార్చు]
  1. బుగ్గ అనగా నల్లనిది అని అర్థం. ఆలయంలోని లింగం (దేవుని విగ్రహం) నల్లని రంగులో ఉండడం వల్ల బుగ్గరామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది.
  2. గర్భగుడిలో ఉన్న పుట్టలో నాగేంద్రుడు నివసిస్తూ ఆలయాన్ని రక్షిస్తుంటాడు.
  3. గుట్టపై ఉన్న గుండంలోని నీరు ఎన్నటికీ ఎండిపోదు.
  4. బుగ్గరామలింగేశ్వర స్వామి పేరుమీదుగా ముశిపట్ల ఊరిలో దాదాపు వందమందికి బుగ్గరామలింగేశ్వర స్వామి (బుగ్గరాములు, బుగ్గరామక్క) పేరు కలిసి వచ్చేలా పేర్లు ఉన్నాయి.
  5. ముశిపట్ల గ్రామస్తులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎక్కువగా ప్రభుత్యుద్యోగులు (ఉపాధ్యాయ వృత్తి, పోలీస్ శాఖ, మిలటరీ శాఖ) గా ఉన్నారు.
  6. బుగ్గరామలింగేశ్వర స్వామి భక్తులు కోరిన కోర్కెలు తీర్చడంతో ఆ భక్తులు గుట్ట, ఆలయం అభివృద్ధి పనులు (గుట్టపైకి మెట్ల దారి, కళ్యాణ మండపం, ప్రదక్షణ దారి, గుట్ట తోరణం) చేస్తుంటారు.[4]
  7. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన పైళ్ళ విజయ నర్సిరెడ్డి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దాతలు అందించిన సహకారంతో గుట్టపైకి రహదారిని ఏర్పాటుచేశారు.[5]

ఉత్సవాల చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, వార్త యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 2023 జూన్ 8, పేజీ 10.
  2. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 2023 జూన్ 8, పేజీ 9.
  3. ముశిపట్ల వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు, నవతెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 2023 జూన్ 8, పేజీ 6.
  4. 4.0 4.1 ఆంధ్రజ్యోతి, యాదాద్రి భువనగిరి జిల్లా. "కళ్యాణోత్సవానికి సిద్ధమైన బుగ్గరామలింగేశ్వరుడు".
  5. మన తెలంగాణ (యాదాద్రి భువనగిరి జిల్లా), మన సర్పంచ్ (21 April 2019). "గ్రామ అభివృద్ధే ధ్యేయం". p. 7. Archived from the original on 23 April 2019. Retrieved 23 April 2019.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.