తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం
తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:కామారెడ్డి జిల్లా
ప్రదేశం:తిమ్మాపూర్, బీర్కూర్ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వేంకటేశ్వరస్వామి
ప్రధాన పండుగలు:బ్రహ్మోత్సవాలు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలం, తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం.[1]

చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య చారికి ఒకరోజు వేంకటేశ్వరస్వామి కలలోకి వచ్చి బీర్కూర్‌ శివారులోని ఎత్తైన కొండపై తనకోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని కోరగా, బ్రహ్మయ్య స్వయంగా కింది నుంచి పైకి ఒక్కో రాయి తెచ్చి, ఒక్కో బిందెతో కాలినడకన నీరు తెచ్చి సిమెంటుతో వెంకన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తరువాత బీర్కూర్‌కు చెందిన ఓ వ్యక్తి దేవాలయ మెట్లు నిర్మించాడని, అప్పటినుండి ఈ కొండకు చేరుకునే అవకాశాలు దొరికాయి. సిమెంటుతో ఏర్పాటుచేసిన వెంకన్న విగ్రహం, దేవాలయానికి చేరుకునే మెట్లదారి ఇప్పటికీ ఇంకా ఉన్నాయి.[2]

సదుపాయాలు[మార్చు]

2016 ఏప్రిల్‌ 1న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ దేవాలయాన్ని సందర్శించి అభివృద్ధికి 23 కోట్లు కేటాయించాడు. ఆ నిధులతో దేవాలయం చుట్టూ రాజగోపురాలు, మాడ వీధులు, ప్రాకారాలు, కొండ మీదకు రోడ్డు, కళ్యాణ మండపం, వసతి గృహాలు, 54 ఘాట్లు, కళ్యాణకట్ట, చెరువును 15 ఫీట్ల లోతుగా తవ్వించి సకల వసతులు ఏర్పాటుచేశారు.[3]

బ్రహ్మోత్సవాలు[మార్చు]

2023లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా పాల్గొని ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కూడిన పైలాన్ ను ఆవిష్కరించాడు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం చేయించిన రెండు కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి సీఎం కేసీఆర్ దంపతులు సమర్పించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.[4] దేవాలయ అభివృద్ధి కోసం గతంలో కేటాయించిన 23 కోట్లతోపాటు దానికి అదనంగా మరో 7 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బీబీ పాటిల్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు[మార్చు]

  1. "కల్యాణానికి ముస్తాబైన వేంకన్న". EENADU. 2023-03-01. Archived from the original on 2023-03-01. Retrieved 2023-03-01.
  2. telugu, NT News (2021-09-04). "ప్రకృతి ఒడిలో కలియుగ దైవం". www.ntnews.com. Archived from the original on 2023-03-30. Retrieved 2023-03-30.
  3. telugu, NT News (2023-01-01). "ప్రార్థించే హృదయాల్లో దేవుడు కొలువై ఉంటాడు". www.ntnews.com. Archived from the original on 2023-01-01. Retrieved 2023-03-01.
  4. telugu, NT News (2023-03-01). "CM KCR Couple | తిమ్మాపూర్‌ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్‌ దంపతులు". www.ntnews.com. Archived from the original on 2023-03-01. Retrieved 2023-03-01.
  5. telugu, NT News (2023-03-01). "తిమ్మాపూర్‌ ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు.. బాన్సువాడ నియోజకవర్గ వృద్ధికి రూ.50 కోట్లు: సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-03-01. Retrieved 2023-03-01.