Jump to content

జోగినపల్లి సంతోష్ కుమార్

వికీపీడియా నుండి
జోగినపల్లి సంతోష్ కుమార్
జోగినపల్లి సంతోష్ కుమార్


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 ఏప్రిల్ 2018
ముందు సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీ

వ్యక్తిగత వివరాలు

జననం (1976-12-07) 1976 డిసెంబరు 7 (వయసు 48)
కొదురుపాక, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి

జోగినపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి 2018, మార్చి 23న రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ దినపత్రికకు ఎండీగా ఉన్నాడు. సంతోష్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు.

జననం

[మార్చు]

జోగినపల్లి సంతోష్ కుమార్ 1976, డిసెంబరు 7న రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం, కొదురుపాక గ్రామంలో జోగినపల్లి రవీందర్ రావు, శశికళ దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు కొదురుపాకలో పూర్తి చేసి, ఉన్నత చదువులకు హైదరాబాదు వచ్చాడు. సంతోష్ కుమార్ పుణెలోని యూనివర్సిటీ అఫ్ పూణే నుండే ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

జోగినపల్లి సంతోష్ కుమార్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పీఏగా పనిచేశాడు. సంతోష్ కుమార్ 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] 2019 జూన్ నెలలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టిఆర్‌ఎస్ విప్‌గా సంతోష్ కుమార్‌ నియమితులయ్యాడు.[2]

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

[మార్చు]

దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో 2018, జూలై 17న జోగినపల్లి సంతోష్ కుమార్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా సంతోష్ కుమార్ మేడ్చల్ జిల్లాలోని 2,042 ఎకరాల్లోని కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నాడు.[3]ఆయన చేప్పట్టిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల్లో మంచి స్పందన వచ్చింది. రాజకీయ నాయకులు, సినీతారలు, వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.[4]

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో భాగంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో "వృక్ష వేదం" పుస్తకాన్ని రూపొందించారుడు. ఈ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించాడు.[5] ఈ పుస్తకంలో వేదాల్లో అడవులు, చెట్లకు సంబంధించిన ప్రస్తావనలను తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రచురించాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. New Indian Express, Home States Telangana (12 March 2018). "Telangana CM KCR picks nephew Joginapally Santosh Kumar, two Backward Community leaders for Rajya Sabha elections". The New Indian Express. Archived from the original on 7 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
  2. మన తెలంగాణ (14 June 2019). "టిఆర్‌ఎస్ పిపి నేతగా కెకె". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 6 ఏప్రిల్ 2021. Retrieved 6 April 2021.
  3. Sunday Guardian Live, Home News Green India Challenge has grown and how (3 April 2021). "Green India Challenge has grown and how". The Sunday Guardian Live. Archived from the original on 7 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
  4. TV9 Telugu, తెలుగు వార్తలు » ఎంటర్టైన్‌మెంట్ » Green India challenge (7 January 2021). "గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన బాలీవుడ్ స్టార్ హీరో.. - Ajay Devgn plants saplings". TV9 Telugu. Archived from the original on 7 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. ఆంధ్రజ్యోతి, హోం తెలంగాణ (8 December 2020). "'వృక్షవేదం' పుస్తకావిష్కరణ". www.andhrajyothy.com. Archived from the original on 7 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
  6. The Hindu (22 February 2021). "Venkaiah Naidu presented Vruksha Vedam book". The Hindu. Archived from the original on 7 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
  7. ఆంధ్రజ్యోతి (9 January 2021). "'వృక్ష వేదం' అద్భుతం". www.andhrajyothy.com. Archived from the original on 7 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.