Jump to content

ధర్‌పల్లి జగన్నాథస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
ధర్‌పల్లి జగన్నాథస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిజామాబాద్ జిల్లా
ప్రదేశం:ధర్‌పల్లి, ధర్‌పల్లి మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:జగన్నాథస్వామి
ప్రధాన పండుగలు:బ్రహ్మోత్సవాలు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

ధర్‌పల్లి జగన్నాథస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ధర్‌పల్లి మండలంలోని ధర్‌పల్లి గ్రామంలో ఉన్న దేవాలయం.[1]

చరిత్ర

[మార్చు]

శ్రీకృష్ణుడు త్రేతాయుగకాలంలో ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశ పర్యటన నేపథ్యంలో దారిమధ్యలో ఆగిన పల్లెనే దారిలోనిపల్లెగా పేరుగాంచి, ఆ తరువాతికాలంలో అది ధర్‌పల్లిగా ప్రసిద్ధిగాంచిందని ప్రతీతి. శ్రీకృష్ణుడు ఈ గ్రామాన్ని సందర్శించడానికి నిదర్శనంగా పురాతన కాలంలో చిన్న గుడి నిర్మించబడింది. అయితే ఆ పురాతన గుడి కూలీపోవడంతో దాని పక్కనే ఉన్న రెండు పెద్దరాళ్ళ మధ్యన చిన్నపాటి దేవాలయం నిర్మించి మూలవిరాట్టు విగ్రహాలను అందులో ఉంచారు. రానురాను ఆ దేవాలయం కూడా శిథిమైపోయింది. దేవాలయంలోని రాతి స్తంభం మీద దేవాలయ చరిత్ర ఉంది.

నూతన దేవాలయ నిర్మాణం

[మార్చు]

2007లోనే జగన్నాథ దేవాలయ పునర్నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల వరకు చందాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ 20 లక్షల రూపాయలు అందించడంతో నూతన దేవాలయం నిర్మించడింది. ఆ తరువాత శాస్ర్తోక్తంగా దేవాలయం ప్రారంభించబడింది.

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2023-02-24). "Dharpally | శ్రీకృష్ణుడు సేదతీరిన నేల.. మన తెలంగాణ పల్లె.. త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్న ఈ గ్రామం గురించి తెలుసా !". www.ntnews.com. Archived from the original on 2023-02-26. Retrieved 2023-02-26.