సీతారామ దేవాలయం (గంభీరావుపేట్)
సీతారామ దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°18′00″N 78°35′00″E / 18.30°N 78.58330°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | రాజన్న సిరిసిల్ల జిల్లా |
ప్రదేశం: | గంభీరావుపేట్, గంభీరావుపేట్ మండలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | రాముడు, లక్ష్మణుడు |
ప్రధాన దేవత: | సీత |
ముఖ్య_ఉత్సవాలు: | శ్రీరామనవమి |
సీతారామ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం, గంభీరావుపేట్ గ్రామంలో ఉన్న దేవాలయం. సుమారు 680 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయంలోని అఖండజ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ ఉంది.[1]
చరిత్ర
[మార్చు]కాకతీయులు తమ రాజ్యంలోని కొన్ని గ్రామాలను పాలన ప్రాంతాలుగా పరిగణించి, గంభీరావుపేటను ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. క్రీస్తుశకం 1333లో కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి సంస్థానాధీశుడిగా ఉన్న వేంకటరావు దేశాయి ఈ ఆలయ అభివృద్దికి కృషి చేశాడు.
ప్రత్యేకత
[మార్చు]16 స్తంభాలతో నిర్మించిన కల్యాణమంటపం ఇప్పటికి నిలిచివుంది. దేవాలయానికి కొంత దూరంలో సంస్థానాధీశుడి పేరుమీద నిర్మించిన వెంకటాద్రి చెరువునుంచి ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలకి నీటిని తెస్తారు. ఆలయంలోపల ఉన్న గంటపై 1333 అనే సంఖ్య ఉంది. ఈ సంఖ్యను బట్టి ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఒక నందాదీపం ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ప్రతిష్ఠించబడిన ఈ నందాదీపం నాటినుంచి నేటివరకు వెలుగుతూనే ఉంది.
ఉత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవుడిని రథంపై ఊరేగిస్తారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (17 November 2019). "ఆరని ఆఖండజ్యోతి గంభీరావుపేట సీతారామాలయం". www.ntnews.com. Archived from the original on 19 నవంబరు 2019. Retrieved 19 November 2019.
- ↑ ఈనాడు, పెద్దపల్లి (23 April 2019). "కమనీయం...రథోత్సవం - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 19 నవంబరు 2019. Retrieved 19 November 2019.