ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ | |
---|---|
పట్టణం | |
![]() ఆసిఫాబాద్ బస్ స్టాండ్ | |
Coordinates: 19°22′N 79°17′E / 19.37°N 79.28°E | |
దేశం | ![]() |
రాష్ట్రం. | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం జిల్లా. |
మండలం | ఆసిఫాబాద్ |
ప్రభుత్వం | |
• సంస్థ | కాగజ్‌నగర్ పురపాలకసంఘం |
జనాభా (11547) | |
• మొత్తం | 23,059 |
• స్థానం | 11512 |
భాషలు: తెలుగు, గోండి, కోలామి, లంబాడి, మరాఠీ, హిందీ. | |
• అధికారిక | తెలుగు |
కాల మండలం | UTC+05:30 (IST) |
పిన్‌కోడ్ | 504293 |
Vehicle registration | TS 20 |
లోక్‌సభ | ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం |
శాసనసభ | ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం |
ఆసిఫాబాద్, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ మండలం లోని జనగణన పట్టణం, గ్రామం.[1] ఇది కుంరంభీం జిల్లాకు పరిపాలనా కేంద్రం. రెవెన్యూ డివిజన్, శాసనసభ నియోజకవర్గ కేంద్రం. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డిపో ఆసిఫాబాదులో ఏర్పాటైంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఆసిఫాబాద్ ను జూన్ గావా అనే పేరుతో పూర్వం వ్యవహరించేవారు.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణం 4954 ఇళ్లతో, మొత్తం 23059 జనాభాతో 16.7 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11547, ఆడవారి సంఖ్య 11512. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3583. కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1947. మొత్తం అక్షరాస్యులు 15924. అందులో పురుష అక్షరాస్యులు 8702, స్త్రీల అక్షరాస్యులు 7222.[3]
సమీప పట్టణాలు
[మార్చు]సమీపంలో, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మందమర్రి, రాజూర,మంచిర్యాల,జైనూర్, పట్టణాలు ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలు.
[మార్చు]రైలు ద్వారా:
10 కిలోమీటర్ల కంటే దూరంలో ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది.సిర్పూర్ కాగజ్ నగర్ రైలు మార్గం (కాగజ్ నగర్ సమీపంలో) పట్టణాల నుండి సమీప రైల్వే స్టేషన్లు చేరుకోవచ్చు. కాజిపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రధానమైన రైల్వే స్టేషన్ 174 కి.మీ దూరంలో ఉంది.
రోడ్డు ద్వారా:
ఆసిఫాబాద్ రహదారి అనుసంధానాన్ని కలిగి ఉన్న కాగజ్ నగర్ పట్టణం సమీపంలో ఉంది.జాతియ రహదారి ఈ నగరం సమీప నుండి నాగ్ పూర్ వేల్లుతుంది.
విమానాశ్రయం:
ఈ సదుపాయం ఈ జిల్లా యందు లేదు, ఈ రాష్ట్ర రాజధాని అయినటు వంటి హైదరాబాద్ విమానాశ్రయం లోను పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర లోని నాగ్ పూర్ ఏర్పోట్ ద్వార ఈ సేవలు వినియోగిస్తున్నారు.
చరిత్ర
[మార్చు]
రాంజీగోండ్ పరిపాలనలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ అప్పట్లో జున గావా అని పిలవబడేది హైదరాబాద్ సంస్థానాధీశుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా రెబ్బెనలో ఉన్న రైల్వేస్టేషన్‌ను ఆసిఫాబాద్ రోడ్‌గా మార్చారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తరువాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తరలిపోయినా, ఆసిఫాబాద్ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తుంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలం భవనంలోనే కొనసాగింది.
కుమురం భీం జిల్లా పరిపాలన కేంద్రం
[మార్చు]గిరిజన పక్షన పోరాడిన యోధుడు కొమురం భీమ్ జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్ జిల్లా. అతనితో పాటు మరెందనో పోరాట యోధుల జన్మనిచిన నేల ఇది.ఈ ప్రాంతంలోనే ఒకప్పుడు లోగడ ఈ పట్టణం జిల్లా కేంద్రం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో మళ్లీ జిల్లా పరిపాలన ప్రధాన కేంద్రంగా కొమురం భీమ్ పేరుతో ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడింది.పురపలక నగరంగా కూడ ఏర్పాటు చేయటమైనది.
కలెక్టరేట్ నూతన సమీకృత భవన సముదాయం
[మార్చు]జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా ఈ పట్టణంలో 20 ఎకరాల్లో రు. 61 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన రెండు అంతస్తులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. కింది అంతస్తులో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్ హాల్స్, రెండు వీడియోకాన్ఫరెన్స్ హాల్స్, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.
సిఎం గారితో సమీకృత భవనం ప్రారంభం.
2023, జూన్ 30న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు.[4] కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్ హేమంత్ బోర్ఖడేను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]
ఎస్పీ కార్యాలయం
[మార్చు]25.90 కోట్ల రూపాయలతో జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయం నిర్మించబడింది. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహించేందుకు వివిధ గదులు, సమీక్ష సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్, ప్రత్యేక క్యాబిన్, సాయుధ దళపతి కార్యాలయంతోపాటు ఆర్మ్‌డ్ సిబ్బంది ఉండేలా రెండు బరాక్‌లు, ల్యాబ్ సౌకర్యం, ఫోరెన్సిక్, సైబర్, క్లూస్‌టీం కోసం సైతం వసతులు, డాగ్, బాంబ్ స్కాడ్ సిబ్బందికి వసతి వంటివి ఏర్పాటు చేయబడ్డాయి. 2023, జూన్ 30న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోలీస్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించాడు.[6]
పోడు పట్టాల పంపిణీ
[మార్చు]ఆసిఫాబాద్‌లో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో 2023, జూన్ 30న పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, గిరిజన మహిళల పేరుతో 12 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 'పోడు భూములకు కూడా రైతుబంధు ఇవ్వనున్నట్లు, ఈ భూములకు సంబంధించి గతంలో గిరిజనులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించాడు.[7][8]
ఆసిఫాబాద్ కవుల సంఘం
[మార్చు]ఆసిఫాబాద్ కవుల సంఘం 4-12-2011 నాడు ఆవిర్భావించింది. ఆకసం పేరుతో సాహితీవేత్తలకు పరిచయమైన సంస్థను మాడుగుల నారాయణ మూర్తి వ్యవస్థాపన చేశారు. ప్రతి సంవత్సరం ఉగాది కవి సమ్మేళనం ఏర్పాటు చేసి ఉత్తమ గురువులను సత్కరించటం జరుగుతుంది. విద్యాలయాల్లో విద్యార్థులకు సాహితీ సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి బహుమతులు ప్రధానం చేస్తూ బాల కవులుగా తీర్చుదిద్దుకొనేందుకు కృషి చేస్తున్నారు. ఆకసం కవులు ప్రతి నెల మొదటి బుధవారం "నెల పొడుపు" కవి సమ్మేళనాన్ని 2016 జూన్ సంవత్సరం నుంచి ప్రారంభించారు,. నేటికి కొనసాగుతుంది.
● పుస్తకావిష్కరణలు:
- తెలుగు తల్లి శతకమాల-మాడుగుల నారాయణ మూర్తి.
- సిరివెన్నెల - నల్లగొండ రమేశ్,
- గోడు- వనపర్తి తిరుపతి.
- సాధుబాల- శ్రీరాం సత్యనారాయణ.
ప్రత్యేకతలు
[మార్చు]- మొట్టమొదటి ఆర్టీసీ డిపో ఇక్కడ ఏర్పాటైంది.
- గోండి చిత్రలేఖనం -మడావి రాజేశ్వర్, రూపకర్త.
- ఈ జిల్లాలో గిరిజన మ్యూజియం ఉంది.
- సప్త గుండల జల పతము ఈ జిల్లాలోని లింగాపూర్ మండలం పిట్టగూడలో ఉంది.
- తిర్యాణీ మండలంలో గుండల జల పాతం, చింతల మధొర జల పాతము ఉన్నాయి.
- గిరిజనులు ఏంతో భక్తి శ్రద్ధలతో కొలిచే జంగు బాయి పుణ్య క్షేత్రము కెరమెరి మండలం కోట పరోదోలి గుహలలో ఉంది.
- అధిక సంఖ్యలో గిరిజనులు గల మన జిల్లాలో దీపావళి పండుగ గోండులకి చాలా పవిత్రమైన పండగా, గుస్సాడి నాట్యము ఉండును.
- అప్పటి ప్రధానమత్రి శ్రీమతి ఇంధర గాంధీ గారి కాలంలో ఢిల్లీలో గుస్సాడి నాట్య ప్రదర్శన చేసిన శ్రీ కనక. రాజు గారికి 2021 సంవత్సరములో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
- 1938 సం,, నిజాం కాలం నాటి సిర్పూర్ పేపర్ మిల్లు కాగజ్ నగర్ లో ఉంది.
- ఈ జిల్లా గుండ NH-363 హైవే వేల్తుంది.
- కుంరం భీం ప్రాజెక్టు ఉంది.
- కెరమెరి ఘాట్ రోడ్డు కలదు
- కోట్నాక భీంరావు ఉద్యానవనము ఆసిఫాబాదు
- సాయి బాబా మందిరం ఆసిఫాబాదు
ప్రధాన పంటలు
[మార్చు]- పత్తి
- వరి
- జొన్నలు
- కంది
- ఉద్యానవన పంటలు
- ఇతర పప్పు దినుసులు
- చీరు ధాన్యాలు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-12-05. Retrieved 2018-11-04.
- ↑ ABN (2023-06-30). "కుమరం భీం ఆసిఫాబాద్: అట్టహాసంగా కలెక్టరేట్, డీపీవో కార్యాలయాల ప్రారంభం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-30. Retrieved 2023-06-30.
- ↑ telugu, NT News (2023-06-30). "CM KCR | జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-06-30. Retrieved 2023-06-30.
- ↑ telugu, NT News (2023-06-30). "Police Complex | ఆసిఫాబాద్‌లో జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-06-30. Retrieved 2023-06-30.
- ↑ "CM Kcr: 4లక్షలకుపైగా ఎకరాలకు పోడు పట్టాలు.. పంపిణీ ప్రారంభించిన సీఎం కేసీఆర్". EENADU. 2023-06-30. Archived from the original on 2023-06-30. Retrieved 2023-07-14.
- ↑ "Telangana State Portal పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం". www.telangana.gov.in. 2023-07-01. Archived from the original on 2023-07-13. Retrieved 2023-07-14.