బుడందేవ్ జాతర
స్వరూపం
బుడందేవ్ జాతర | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఆదిలాబాద్ |
ప్రదేశం: | శ్యాంపూర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | బుడందేవ్, |
బుడందేవ్ జాతర తెలంగాణ రాష్ట్రం, ఉట్నూరు మండల పరిధిలోని శ్యాంపూర్ గ్రామంలో జరుగుతుంది. నాగోబా జాతర ముగింపుతో మెస్రం వంశీయులు తిరుగు ప్రయాణంతో బుడందేవ్ జాతరను ప్రారంభిస్తారు.[1]
చరిత్ర
[మార్చు]పూర్వం గౌరపూర్ గ్రామంలోని ఆవుల మందలో ఉన్న ఒక ఎద్దు పశువుల మంద నుంచి తప్పించుకొని శ్యాంపూర్ ప్రాంతంలోని పంటలను నాశనం చేస్తుండేది. దీంతో ఆగ్రహించిన కోత్వాళ్లు వారి వద్ద ఉన్న ఆయుధంతో సంహరిస్తారు. మృతి చెందిన ఎద్దును దూర ప్రాంతంలో పారేసేందుకు వెళ్తుండగా, అక్కడ బండరాయిగా మారి బుడుందేవ్‌గా ఆవతరించిందని, వంశ పెద్దలు చెప్పుతుంటారు. నాగోబా జాతర ముగిసిన మరుసటి రోజు నుంచే బుడుందేవ్‌ను మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలతో కొలవడంతో జాతర ప్రారంభం అవుతుంది. సుమారు ఈ జాతర 10 రోజుల పాటు కొనసాగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2023-01-31). "బుడుందేవ్ జాతర షురూ." www.ntnews.com. Retrieved 2024-02-02.