ఆదిలాబాదు జిల్లా గ్రామాల జాబితా
స్వరూపం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత ఆదిలాబాదు జిల్లా లోని మండలాలను విడదీసి, ఆదిలాబాదు, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు. కొత్త ఆదిలాబాదు జిల్లా లోని వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.