గర్మిళ్ల (మంచిర్యాల మండలం)
?గర్మిళ్ల తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°52′17″N 79°26′39″E / 18.8714°N 79.4443°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | మంచిర్యాల జిల్లా |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | మంచిర్యాల పురపాలకసంఘం |
కోడులు • పిన్‌కోడ్ |
• 504209 |
గర్మిళ్ల తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల మండలానికి చెందిన గ్రామం.[1] ఆదిలాబాద్ పట్టణం నుండి తూర్పు వైపు 152 కిమీ దూరంలో గర్మిళ్ల ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]
భౌగోళికం
[మార్చు]గర్మిళ్ల గ్రామానికి ఉత్తరం వైపు మందమర్రి మండలం, దక్షిణం వైపు రామగుండం మండలం, తూర్పు వైపు జైపూర్ మండలం, ఉత్తరం వైపు కాసిపేట మండలం ఉన్నాయి. మంచిర్యాల, రామగుండం, మందమర్రి, బెల్లంపల్లె మొదలైన గ్రామాలు గర్మిళ్లకు సమీపంలో ఉన్నాయి.[3] హమాలీవాడ, రాళ్లపేట, శ్రీ సాయినగర్, ముస్లీంబస్తీ, ఏసీసీ కాలనీ, శ్రీశ్రీ నగర్, క్యాబిన్ ఏరియా, వేముల బస్తీ, ఆంధ్రాకాలనీ మొదలైనవి సమీపంలో ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- భక్త ఆంజనేయ దేవాలయం
- మస్జిద్-ఎ-షాహీన్
- మస్జిద్-ఎ-అహ్లే హదీస్
విద్యాసంస్థలు
[మార్చు]- వివేక వర్ధిని డిగ్రీ & పిజి కళాశాల
- వాగ్దేవి డిగ్రీ కళాశాల
- ఎంవీఎన్ జూనియర్ కళాశాల
- భార్గవి జూనియర్ కళాశాల
- మాంటిస్సోరి హైస్కూల్
- ప్రభుత్వ పాఠశాల
- సరస్వతి శిశు మందిరం
రవాణా
[మార్చు]ఇక్కడికి సమీపంలోని మంచిర్యాలలో రైల్వే స్టేషన్ ఉంది. మంచిర్యాల పట్టణం నుండి గర్మిళ్లకు రోడ్డు కనెక్టివిటీ ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బస్సులు నడుపబడుతున్నాయి. ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా ఉంది.
వ్యవసాయం
[మార్చు]ఈ గ్రామంలో పత్తి, జొన్నలు, ఎర్ర పప్పులు వ్యవసాయ వస్తువులు.
తాగునీరు, పారిశుధ్యం
[మార్చు]చేతి పంపులు, బోర్ల ద్వారా తాగునీరు అందుతోంది. ఈ గ్రామంలో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. వీధిలో చెత్తను సేకరించే వ్యవస్థ లేదు. కాలువ నీరు మురుగు ప్లాంట్‌లోకి విడుదల చేయబడుతుంది.
కమ్యూనికేషన్
[మార్చు]ఈ గ్రామంలో పోస్టాఫీసు అందుబాటులో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Garmilla Village". www.onefivenine.com. Archived from the original on 2020-02-21. Retrieved 2021-12-04.