Jump to content

మనోహర్ చిలువేరు

వికీపీడియా నుండి
మనోహర్ చిలువేరు
మనోహర్ చిలువేరు
జననం1970
వరంగల్లు, తెలంగాణ
ప్రసిద్ధిశిల్పి, చిత్రకారుడు

మనోహర్ చిలువేరు, తెలంగాణకు చెందిన శిల్పి, చిత్రకారుడు.[1] లైవ్ పెయింటింగ్ ఈవెంట్‌లు, శిల్పాలు, పబ్లిక్ ఇన్‌స్టాలేషన్‌లతో ప్రసిద్ధి చెందాడు.[2] ఇతను గీసిన పేయింటింగ్ 2003లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.[3] ఒడిస్సీ (ట్రావెల్) ప్రాజెక్టు పేరుతో ప్రపంచంలోని ప్రముఖ నగరాలను సందర్శించి అంతర్జాతీయ మ్యూజియాలలో, గ్యాలరీలలో ‘స్థానం’ సంపాదించుకున్న మనోహర్, అంతర్జాతీయ చిత్రకారుడిగా గుర్తింపు పొందాడు.

జననం, విద్య

[మార్చు]
పేపర్ తో మనోహర్ రూపొందించిన శిల్పాలు

మనోహర్ 1970లో తెలంగాణ రాష్ట్రం వరంగల్లు పట్టణంలో జన్మించాడు.[4] హైదరాబాదు మాసాబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ శిల్పకళ శాఖలోని బ్యాచిలర్ డిగ్రీ (బిఎఫ్‌ఏ) కోర్సులో చేరి, ‘శిల్పం’ స్పెషలైజేషన్‌గా 1996లో కోర్సు పూర్తిచేశాడు. తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని సరోజిని నాయుడు పర్‌ఫార్మింగ్ ఆర్ట్ సెంటర్‌లో లక్ష్మాగౌడ్ నేతృత్వంలో ప్రింట్‌మేకింగ్ ప్రధాన అంశంగా 1998లో ఎంఎఫ్‌ఏలో చేరి పూర్తి చేశాడు.[5]

చిత్రకళా ప్రస్థానం

[మార్చు]

చిన్ననాటి నుండే చిత్రాల పట్ల, రంగుల పట్ల ఆసక్తి ఉండటంతో తరగతి గదిని అలంకరించి బహుమతులను అందుకున్నాడు. చిత్రకళలో రాణించాలన్న ఆశయంతో 1990లో హైదరాబాదు నగరానికి చేరుకొని, రామకృష్ణ మఠంలో కొన్నినెలలపాటు ఆంగ్లభాషా తరగతులకు హాజరై ఆంగ్లంపై పట్టు సాధించాడు. ఆ తరువాత సినిమా హోర్డింగ్‌లు తయారుచేసే నాగేశ్వరరావు దగ్గర సహాయకుడిగా చేరి, సినిమా హోర్డింగ్‌లు తయారీలో మెళకువలు నేర్చుకున్నాడు. ఎంఎఫ్‌ఏ తరువాత కొంతకాలం బరోడా వెళ్ళాడు.[5]

ప్రదర్శనలు

[మార్చు]
  • హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలోని బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో లవ్-పీస్-బ్యాలెన్స్ అనే పేరుతో లైవ్ పెయింటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. నేలపై ఓ ప్లాస్టిక్ షీట్ పరిచి దానిపై ఓ పెద్ద కాన్వాసు పెట్టి, పెద్ద బ్రష్‌లతో అనేక రంగులతో తన మానసిక స్థితికి అద్దం పట్టే నైరూప్య చిత్రాలను గీశాడు.[6]
  • ప్రజలను ఒకచోట చేర్చి, వారిలో ఆశను ప్రోత్సహించేందుకు కళను ఒక మాధ్యమంగా ఉపయోగించడం లక్ష్యంగా కోవిడ్ 19 బారిన పడిన ప్రజలకు ఘ‌నంగా నివాళులర్పిస్తూ హోప్ కోస్మోస్ అనే గ్లోబల్ ఆర్ట్ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు. సృష్టి ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ఈ ఎగ్జిబిషన్‌లో అల్లు అరవింద్, సమంత, లక్ష్మి మంచు, రెజీనా కసాండ్రా, అల్లు బాబీ, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి, సృష్టి ఆర్ట్ గ్యాలరీ యజమాని లక్ష్మీ నంబియార్, మోడల్ సుధారెడ్డి, ఆకాష్ పూరి, నేహా శెట్టి, మిహీకా బజాజ్, సుస్మితా కొణిదెల, శ్రీజ కొణిదెల, శోభు యార్లగడ్డ, ప్రకాష్ కోవెలగడ్డ, ప్రకాష్ కొణిదెల, మంజుల అనగాని తదితరులు పాల్గొని చిత్రలేఖనం చేశారు.[7]
  • దేశ, విదేశాల్లోని ప్రముఖ నగరాలలో మనోహర్ భారీ స్థాయి చిత్రకళ ఈవెంట్స్, శిల్పం, పబ్లిక్ ఇన్‌స్టాలేషన్స్ ప్రదర్శనలు చేశాడు.
  • మానిఫెస్టా12 కొలేటరల్ (2018)
  • 'మరేదో ఆఫ్' -బినాలే కైరో 2018
  • 2017 సం. రోమ్‌లో ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ ‘మామ్’లోనూ, భారతదేశంలోని పూణే, కొచ్చి నగరాల్లోనూ జరిగిన అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ తన భారీ చిత్రాలను ప్రదర్శనకు పెట్టాడు.
  • "పాజిబుల్ ఎఫెక్ట్" సోలో షో, కొచ్చి-ముజిరిస్ బినాలే (భారతదేశం, 2015)
  • పాలాజ్జో మోరా, పాలాజ్జో బెంబో, 56వ వెనిస్ ద్వైవార్షిక (2015) సందర్భంగా గ్రూప్ షో[8]
  • "ఇమాగో ముండి", 55వ వెనిస్ ద్వైవార్షిక (2015) ఫోండాజియోన్ క్వెరిని స్టాంపాలియాలో గ్రూప్ షో
  • “అమూర్”, సోలో షో, అలయన్స్ ఫ్రాంకైస్ (హైదరాబాదు, 2014)
  • “ఇమాజిన్ ఎర్త్”, ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో సోలో షో (న్యూఢిల్లీ, 2014)
  • సాలార్ జంగ్ మ్యూజియంలో "మెటా-మేటర్స్" సోలో షో (హైదరాబాదు, 2013)
  • నగరాల్లోని చిత్రకారులను పరిచయం చేసుకుని, వారితో భావాలను పంచుకుని, ఆయా నగరాల జీవితాన్ని అవగతం చేసుకుని కొన్ని చిత్రాలు గీసి వాటిని ప్రదర్శించి, అనుభవాలను, అనుభూతుల్ని చిత్రాలను గ్రంథస్థం చేయడం కోసం ఒడిస్సీ (ట్రావెల్) ప్రాజెక్టు పేరుతో ప్రపంచంలోని 24 ప్రముఖ నగరాలను సందర్శించి ‘ఒడిస్సీ’ పేర ఓ వినూత్న పంథాలో చిత్రరచనను చేయాలని సంకల్పించిన మనోహర్, బార్సిలోనా, రోమ్, కైరో, వెనిస్ తదితర నగరాలను సందర్శించాడు.[9]
  • రోమ్ ఆర్ట్ వీక్ సందర్భంగా ఆండ్రియా పించీ స్టూడియోలో రెసిడెంట్ ఆర్టిస్ట్‌గా ఉన్నాడు.

గుర్తింపు & అవార్డులు

[మార్చు]
  • లలిత కళా అకాడమీ (చెన్నై) వారిచే బెస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
  • భారత ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, 2000 నుండి 2001 వరకు[10]

మూలాలు

[మార్చు]
  1. "Art aficionados meet at Muse Art Gallery in Hyderabad". The Times of India. 2015-02-01. ISSN 0971-8257. Archived from the original on 2023-04-10. Retrieved 2023-04-10.
  2. Dundoo, Sangeetha Devi (2020-10-05). "Hyderabad artist Manohar Chiluveru's month-long Art Yagnam". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-10-06. Retrieved 2023-04-10.
  3. "Manohar Chiluveru – abxtract.art". Archived from the original on 2023-04-10. Retrieved 2023-04-10.
  4. "Preparation for GES : Roads get makeover, sculptures carted away after sundown". The Times of India. 2017-11-23. ISSN 0971-8257. Archived from the original on 2017-11-24. Retrieved 2023-04-10.
  5. 5.0 5.1 "'మనోహర' చిత్రాల చిరునామా." andhrabhoomi.net. 2019-12-28. Archived from the original on 2023-04-10. Retrieved 2023-04-10.
  6. Murthy, Neeraja (2019-12-24). "Of love peace and balance: Love takes centre stage in Manohar Chiluveru's new art series". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2019-12-24. Retrieved 2023-04-10.
  7. "Samantha Ruth Prabhu channels her inner-painter: I'm glad you had fun baby; says Lakshmi Manchu". The Times of India. 2021-10-27. ISSN 0971-8257. Archived from the original on 2021-10-27. Retrieved 2023-04-10.
  8. "Life is like a lemon n' spoon race for artist Manohar Chiluveru". The Times of India. 2017-01-05. ISSN 0971-8257. Archived from the original on 2017-01-06. Retrieved 2023-04-10.
  9. Dundoo, Sangeetha Devi (2018-08-16). "Hyderabad artist Manohar Chiluveru discusses his public art project Odyssey". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2018-08-16. Retrieved 2023-04-10.
  10. "Manohar Chiluveru". You.Art (in ఇంగ్లీష్). Archived from the original on 2022-09-26. Retrieved 2023-04-10.