వెలగపూడి రామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెలగపూడి రామకృష్ణ
Velagapudi ramakrishna.jpg
వెలగపూడి రామకృష్ణ ఛాయాచిత్రపటం.
మాతృభాషలో పేరువెలగపూడి రామకృష్ణ
జననంవెలగపూడి రామకృష్ణ
1896
గుంటూరు జిల్లా నగరం మండలము మండలం బెల్లం వారిపాలెం
మరణం2015 ఏప్రిల్ 18 (2015-04-18)(వయసు 48)
నివాసంకొండాపూర్, హైదరాబాదు
జాతీయతభారతీయుడు
వృత్తిప్రభుత్వోద్యోగి
ప్రసిద్ధులుపారిశ్రామికవేత్త మరియు దాత
మతంహిందూ
జీవిత భాగస్వామిఇందిర
పిల్లలుమారుతీ రావు మరియు లక్ష్మణ దత్తు (కుమారులు) ,రాజేశ్వరి(కుమార్తె)

వెలగపూడి రామకృష్ణ దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త మరియు దాత. బ్రిటిషు వారి పరిపాలనా కాలములో (1941) కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర తయారు చేయు పరిశ్రమ ముఖ్యమైనది[1]. ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు.

జీవిత విశేషాలు[మార్చు]

1896లో గుంటూరు జిల్లా,రేపల్లె తాలూకా,నగరం మండలములోని బెల్లంవారిపాలెం అను గ్రామములో జన్మించారు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామమునకు చెందినవారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో బీఎస్సీ మరియు ఎం.ఏ విద్య నభ్యసించారు.

రామకృష్ణ కు ఇద్దరు కొడుకులు (మారుతీ రావు మరియు లక్ష్మణ దత్తు) మరియు ఒక కుమార్తె (రాజేశ్వరి). లక్ష్మణ దత్తు ఫిక్కీ అధ్యక్షునిగా ఉన్నాడు. కె.సి.పి కంపెనీ కి ప్రస్తుతము మ్యానేజింగు డైరెక్టరు. భార్య ఇందిర ముక్త్యాల రాజా కూతురు. ప్రపంచ తెలుగు ఫెడరేషన్కు అధ్యక్షురాలు[2].

రామకృష్ణ కుమార్తె రాజేశ్వరి రామకృష్ణన్, జయపూరు చక్కెర కర్మాగారానికి మ్యానేజింగు డైరెక్టరు. రాజేశ్వరి కొడుకు ఆర్. ప్రభు నీలగిరి (ఊటీ) పార్లమెంటు స్థానానికి ఐదు సార్లు వరుసగా ఎన్నికైయ్యారు. మాజీ కేంద్రమంత్రి.

అలంకరించిన పదవులు[మార్చు]

 • మద్రాసు ప్రభుత్వములో అభివృద్ధి కమీషనరు
 • జిల్లా కలెక్టరు
 • లేబరు కమీషనరు
 • పరిశ్రమల కమీషనరు
 • పార్లమెంటు సభ్యుడు

విరాళాలిచ్చిన సంస్థలు[మార్చు]

 • వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజి, నగరం
 • వి. యస్. ఆర్ & యన్. వీ. ఆర్. కాలేజి, తెనాలి
 • వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజినీరింగు కాలేజి, విజయవాడ
 • ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్సు భవనము, చెన్నై

మూలాలు[మార్చు]

 1. "KCP Web site". మూలం నుండి 2015-07-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-06-19. Cite web requires |website= (help)
 2. http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2004083006950400.htm&date=2004/08/30/&prd=th&[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]