సూర్యదేవర రాఘవయ్య చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూర్యదేవర రాఘవయ్య చౌదరి (1876 -1937) రచయిత, హేతువాది. సంఘ సంస్కర్త, తెలుగునాట బ్రాహ్మణేతర ఉద్యమ రూపకర్త.

జననం, విద్య[మార్చు]

సూర్యదేవర రాఘవయ్య చౌదరి గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా కొల్లూరు గ్రామములో నాగయ్య, రుక్మిణమ్మ దంపతులకు 1876లో జన్మించాడు. అతను తురుమెళ్ళలోని తన మేనమామ ఇంట ప్రబంధ కావ్య పఠనమునకు విద్య నభ్యసించాడు. అతను చిన్ననాటి నుండి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. సంగంజాగర్లమూడికి చెందిన కాంతమ్మను వివాహం చేసుకున్నాడు. సంతానం కలుగలేదు. తన తమ్ముని కుమారుడు నాగేశ్వరరావును దత్తత చేసుకొన్నాడు.

బ్రాహ్మణేతర ఉద్యమం[మార్చు]

సాంఘికవ్యవస్థలో అగ్రకులముగ నున్నబ్రాహ్మణులకు తప్ప యితరకులజులకు స్థానములేకపోవుటచే జి.ఎస్.పి. సరస్వతి(నెల్లూరు) స్వాములవారి బోధననలననుసరించి, ఒక బ్రహ్మాండమైన ఉద్యమము లేవదీసి ఆంధ్రదేశములో వాడవాడలా, వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని ఉపన్యాసములిచ్చాడు. బ్రాహ్మణేతర సంఘాన్ని స్థాపించి బ్రాహ్మణేతర కులాల స్వాభిమాన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు.[1]

1924లో తెనాలి తాలుకా కొల్లూరులో బ్రాహ్మణ ప్రతినిధులతో జరిగిన చర్చలలో త్రిపురనేని రామస్వామి, పాలడుగు శేషాచార్యులు, దుగ్గిరాల రాఘవచంద్రయ్య తో పాటు సూర్యదేవర రాఘవయ్య గారు పాల్గోని వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని అదే హిందూ మతం అని వాదించారు. ఈ వాదోపవాదాలను వీరు ' బ్రాహ్మనేతర విజయం' అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు,[2] అప్పుడే బ్రాహ్మణేతర ఆత్మాభిమాన ఉద్యమానికి బీజం పడింది.

బ్రాహ్మణ సహాయనిరాకరణోద్యమము చేయుచు స్వసంఘ పౌరోహిత్యము, ప్రత్యేకముగ నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో స్వసంఘములు నెలకొల్పాడు. కాని వ్యక్తిగతముగ ఏయొక బ్రాహ్మణుని ద్వేషించువాడుకాదు[3].

ఇతని ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్ర ప్రదేశ్ లో జస్టిస్ పార్టీ ఏర్పడింది. తెనాలి తాలూకా బోర్డు మెంబరుగా పనిచేశారు[2].

మరణం[మార్చు]

సుర్యదేవర రాఘవయ్య చౌదరి 1937లో మరణించాడు[4].

రచనలు[మార్చు]

 1. బ్రాహ్మణేతర విజయం 1925 [5]
 2. బ్రహ్మణేతరోద్యమతత్వం
 3. ఆర్యకవికుతంత్రం
 4. బ్రాహ్మణేతరసంఘాదర్శం 1927
 5. స్వసంఘపౌరోహిత్యం 1927
 6. విప్ర కుల చరిత్ర
 7. పంచముల చరిత్ర
 8. కమ్మవారి చరిత్ర

మూలాలు[మార్చు]

 1. Civil Disobedience Movement in Andhra By Palle Sivasankarareddi పేజీ.15 [1]
 2. 2.0 2.1 రావిపూడి వెంకటాద్రి, పెనుమత్స సుబ్బరాజు (2003). హేతువాద, మానవవాద ఉద్యమ చరిత్ర. హైదరాబాదు: తెలుగు అకాడమి.
 3. తణుకు నరేంద్ర సాహిత్య మండలి వారిచే1973 సంవత్సరంలో ప్రచురితమైన సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి రచన ‘కమ్మవారి చరిత్ర’ గ్రంధము నుండి.
 4. http://www.sundarayya.org/sites/default/files/2020-08/Kammavaari%20Charithra.pdf
 5. kammasvictory.blogspot.com/2009_11_01_archive.html

బాహ్య లంకెలు[మార్చు]