లింగంగుంట (మద్దిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


లింగంగుంట
రెవిన్యూ గ్రామం
లింగంగుంట is located in Andhra Pradesh
లింగంగుంట
లింగంగుంట
నిర్దేశాంకాలు: 15°33′25″N 80°02′06″E / 15.557°N 80.035°E / 15.557; 80.035Coordinates: 15°33′25″N 80°02′06″E / 15.557°N 80.035°E / 15.557; 80.035 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంమద్దిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం869 హె. (2,147 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,831
 • సాంద్రత330/కి.మీ2 (840/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523262 Edit this at Wikidata

లింగంగుంట, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 262., పిన్ కోడ్ నం. 523 262., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఏడుగుండ్లపాడు 3 కి.మీ, పెదకొత్తపల్లి 5 కి.మీ, దొడ్డవరప్పాడు 4 కి.మీ, పేర్నమెట్ట 4 కి.మీ, మండువారిపాలెం 1.5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన మద్దిపాడు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

  1. అంగనవాడీ కేంద్రం.
  2. ది సెంట్రల్స్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో) నం.జె.618., ఫోన్ నం. 08592/247337.
  3. త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో, అసిస్ట్, జి.పి.ఐ. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో నూతనంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని, 2015,మార్చి-19వ తేదీనాడు ప్రారంభించారు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మన్నం ఈశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఏకశిలా విగ్రహం[మార్చు]

ఈ గ్రామంలో 2017,మార్చి-18వతేదీ శనివారంనాడు, అభయాంజనేయస్వామి యువజనసంఘం ఆధ్వర్యంలో, గ్రామం నడిబొడ్డులో, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, అగ్నిహోమాల నడుమ, ఏకశిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ ఏకశిల ఏర్పాటుకు ముందు గ్రామస్థులు నవధాన్యాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాని వీక్షించేటందుకు చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థుల ఆహ్వానం మేరకు సుదూరప్రాంతాల నుండి విచ్చేసిన బంధుమిత్రులతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [5]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

పద్మశ్రీ మన్నం గోపీచంద్[మార్చు]

లింగంగుంట గ్రామానికి చెందిన శ్రీ మన్నం నరసింహారావు వృత్తిరీత్యా అర్.ఎం.పి.వైద్యులు. వీరి సతీమణి శ్రీమతి వెంకటసుబ్బమ్మ. ఈ దంపతులు ఒంగోలు పట్టణంలో స్థిరపడినారు. వీరి కుమారుడు శ్రీ మన్నం గోపీచంద్ గుంటూరు వైద్యకళాశాలలో వైద్యవిద్యనభ్యసించి, ఆపైన, వెస్ట్ ఇండీస్ లో ఉన్నత చదువులు చదివినారు. ఆ పిమ్మట లండన్ ఎడింబర్గులో గుండె వైద్య నిపుణుడిగా పట్టా పుచ్చుకొని హైదరాబాదు విచ్చేసి, ఇప్పటి వరకు కొన్నివేల గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించి తాను చదివిన చదువుకు సార్థకత చేకూర్చారు. శ్రీ గోపీచంద్ సతీమణి గూడా వైద్యవృత్తిలోనే ఉన్నారు. వీరు ఇంకనూ అనేక సేవాకార్యక్రమాలను నిర్వహించుచున్నారు. వీరి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం, వీరిని, దేశ అత్యుత్తమ పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ పురస్కారానికి ఎంపికచేసింది. [4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,831 - పురుషుల సంఖ్య 1,411 - స్త్రీల సంఖ్య 1,420 - గృహాల సంఖ్య 786

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,636.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,328, మహిళల సంఖ్య 1,308, గ్రామంలో నివాస గృహాలు 648 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 869 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,ఆగస్టు-15; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-20; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016,జనవరి-27; 16వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,మార్చి-19; 1వపేజీ.