రాచవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°36′N 80°00′E / 15.6°N 80°E / 15.6; 80Coordinates: 15°36′N 80°00′E / 15.6°N 80°E / 15.6; 80
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
విస్తీర్ణం
 • మొత్తం9.42 కి.మీ2 (3.64 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం2,756
 • సాంద్రత290/కి.మీ2 (760/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1001
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523211 Edit this on Wikidata


రాచవారిపాలెం (Rachavaripalem) , ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్:523211., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఇప్పుడు రాచవారిపాలెంగా పిలువబడే ఈ గ్రామం పూర్వ నామం, రాజువారిపాలెం. అదే రానురాను రాచవారిపాలెంగా రూపాంతరం చెందింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం ఒంగోలు పట్టణానికి 20 కి.మీ దూరంలో ఉంది. మూడు వైపుల నీటిచే ఆవరించబడి ఒక వైపు భూభాగం కలిగిన ఈ గ్రామం చూడచక్కగా ఉంది. గుండ్లకమ్మ నది ఈ గ్రామం ప్రక్కగా ప్రవహించును. 5వ నెంబరు జాతీయ రహదారికి 3.2 km దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

 1. ఈ గ్రామం పశ్చిమాన కీర్తిపాడు గ్రామం, తూర్పున గుండ్లకమ్మ నది ప్రవహిస్తూ ఉంది. ఉత్తరాన నాగన్నపాలెం గ్రామం, దక్షిణాన నందిపాడు గ్రామాలు ఉన్నాయి.
 2. ఇనమనమెల్లూరు 3 కి.మీ, గుండ్లపల్లి 3 కి.మీ, కొత్తకోట 4 కి.మీ, H.నిడమానూరు 4 కి.మీ, కొలచనకోట 5 కి.మీ, నాగన్నపాలెం గ్రామం 1 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున నాగులుప్పలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఆటోలు ఇక్కడ ప్రధాన రవాణా సాధనం. బస్ సౌకర్యం లేదు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఇక్కడ 7వ తరగతి వరకు విద్యా సదుపాయం ఉంది. 1909 లో స్థాపించిన ఈ పాఠశాలలో ఎందరో విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చి-27వ తేదీ నాడు ఘనంగా నిర్వహించారు. [2]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

చెరువులు[మార్చు]

 1. కాపుగారి చెరువు
 2. నాగయ్యగారి చెరువు
 3. కడియాలోల్ల చెరువు
 4. సిబ్బినొల్ల చెరువు
 5. అడపాల్లొల్ల చెరువు

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పిట్టల ఆంజనేయులు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ జనార్ధన స్వామి.
 2. ప్రసన్నాంజనేయస్వామివారల ఆలయం.
 3. శ్రీ వినాయక స్వామి మందిరం.
 4. శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం.
 5. శ్రీ అంకమ్మ అమ్మవారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

పొగాకు, సెనగలు, ప్రత్తి, కూరగాయలు, జామ, మామిడి, కంది.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

దిగువ మధ్య తరగతి రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాదారం.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

 1. రావి రాఘవయ్య.
 2. గుర్రం వెంకయ్య (మాజీ సర్పంచ్).

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం.[2][2]లో కమ్మ, పెరిక కులముల వారు ప్రధానంగా ఉన్నారు.

గ్రామజనాబా[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా = 2,882. గ్రామ జనాభా 2756.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,452, మహిళల సంఖ్య 1,430. గ్రామంలో నివాస గృహాలు 703 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 942 హెక్టారులు.

చిత్రమాలిక[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,756 - పురుషుల సంఖ్య 1,377 - స్త్రీల సంఖ్య 1,379 - గృహాల సంఖ్య 751

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
 2. 2.0 2.1 2.2 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

 • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

గూగల్ ఈ గ్రామం: http://maps.google.com/?ie=UTF8&ll=15.638452,80.040679&spn=0.032524,0.054932&t=h&z=15 న ఉంది.

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చి-28; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-30; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-27; 1వపేజీ.