నేలటూరు (మద్దిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నేలటూరు
రెవిన్యూ గ్రామం
నేలటూరు is located in Andhra Pradesh
నేలటూరు
నేలటూరు
నిర్దేశాంకాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023Coordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంమద్దిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం963 హె. (2,380 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,807
 • సాంద్రత290/కి.మీ2 (750/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523211 Edit this at Wikidata

నేలటూరు, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 211., యస్.ట్.డీ కోడ్=08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గురవారెడ్డిపాలెం 4 కి.మీ, కొలచనకోట 5 కి.మీ, దొడ్డవరం 5 కి.మీ, అన్నంగి 6 కి.మీ, మైనంపాడు 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన సంతనూతలపాడు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ముదిగొండి వాగు:- నేలటూరువారిపాలెం లోని ఈ వాగుపై, రైతుల పంటలకు ఆసరాగా ఉంటుందని, ఒక చెక్ డ్యాంను నిర్మించారు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గాలి సీత, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

ఈ ఆలయంలో, 2015,ఆగష్టు-19వతేదీ బుధవారంనాడు, శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వవహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. [2]

శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ పంచమ (ఐదవ) వార్షికోత్సవం, 2017,జనవరి-30వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమపూజ, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయ ప్రాంగణంలో నేరేడు, మారేడు, మామిడి, కదంబం, మామిడి మొక్కలను నాటినారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం కన్నులపండువగా సాగినది. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [5]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

[1][1] వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,807 - పురుషుల సంఖ్య 1,376 - స్త్రీల సంఖ్య 1,431 - గృహాల సంఖ్య 745

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,291.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,633, మహిళల సంఖ్య 1,658, గ్రామంలో నివాస గృహాలు 789 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 963 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగష్టు-20; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,సెప్టెంబరు-2; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,మే-18; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జనవరి-31; 1వపేజీ.