అన్నంగి
అన్నంగి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°40′25″N 79°59′45″E / 15.6736°N 79.9958°ECoordinates: 15°40′25″N 79°59′45″E / 15.6736°N 79.9958°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | మద్దిపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,383 హె. (3,417 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 2,243 |
• సాంద్రత | 160/కి.మీ2 (420/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523211 ![]() |
అన్నంగి, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.[1]
సమీప గ్రామాలు[మార్చు]
కొలచనకోట 3 కి.మీ, బొద్దువానిపాలెం 4 కి.మీ, కీర్తిపాడు 5 కి.మీ, దొడ్డవరం 5 కి.మీ, నేలటూరు 6 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన కొరిసపాడు మండలం, పశ్చిమాన తాళ్ళూరు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం.
గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]
అన్నంగి సమీపంలో గుండ్లకమ్మ నది మీద, "కందుల ఓబులరెడ్డి జలాశయం" నిర్మించారు. దీని వల్ల ప్రకాశం జిల్లాలో 80.000 యెకరాలకు సాగు నీరు, 40 గ్రామాలకు తాగు నీరు అందుతుంది.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కావూరి యలమందమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ ఎం.సుబ్బరాయుడు ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015, ఆగస్టు-31వతేదీ సోమవారంనాడు, పోలేరమ్మ పొంగళ్ళ కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలనీ పూజలు చేసారు. పొంగళ్ళు సమర్పించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. కొలుపులకు బంధుమిత్రుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. సాయంత్రం గ్రామంలో పొంగళ్ళతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వేషధారణలు, వాయిద్యాలతో ఊరేగింపు సందడిగా సాగినది. [4]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,243 - పురుషుల సంఖ్య 1,100 - స్త్రీల సంఖ్య 1,143 - గృహాల సంఖ్య 701
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,631.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,316, మహిళల సంఖ్య 1,315, గ్రామంలో నివాస గృహాలు 645 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,383 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లింకులు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[3] [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, సెప్టెంబరు-1; 2వపేజీ.