మల్లవరం (మద్దిపాడు మండలం)
మల్లవరం (మద్దిపాడు మండలం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°39′2.196″N 79°59′3.300″E / 15.65061000°N 79.98425000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | మద్దిపాడు |
విస్తీర్ణం | 8.14 కి.మీ2 (3.14 చ. మై) |
జనాభా (2011)[1] | 2,116 |
• జనసాంద్రత | 260/కి.మీ2 (670/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,068 |
• స్త్రీలు | 1,048 |
• లింగ నిష్పత్తి | 981 |
• నివాసాలు | 573 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్‌కోడ్ | 523263. |
2011 జనగణన కోడ్ | 591057 |
మల్లవరం ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మద్దిపాడు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 573 ఇళ్లతో, 2116 జనాభాతో 814 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1068, ఆడవారి సంఖ్య 1048. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 485 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 22. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591057[2].
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]రీ.శ. 13వ శతాబ్దంలో అద్దంకిని పరిపాలించిన రెడ్డిరాజుల వంశానికి చెందిన వేమారెడ్డి, కందుకూరు దుర్గాన్ని ఆక్రమించుకునేటందుకు, తన సోదరుడైన మల్లారెడ్డి నాయకత్వంలో సైన్యాన్ని పంపి విజయాన్ని సాధించాడు. అయితే ఈ దండయాత్రలో అధికంగా ప్రాణనష్టం జరగడంతో వేమారెడ్డి, సా.శ1277 లో చంద్రగ్రహణ సమయంలో యగ్నాన్ని నిర్వహించి, మల్లవరానికి చేరుకొని స్వామిని దర్శించి పూజించి, ఆలయాన్ని నిర్మించినట్లు, తన సోదరుడి పేరుతో "మల్లవరం" అనే గ్రామాన్ని నిర్మించి అగ్రహారంగా ఇచ్చినట్లు చారిత్రిక ఆధారాలు వెల్లడించుచున్నవి.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ గ్రామం, ఒంగోలు పట్టణానికి 20 కి.మీ.దూరంలో, గుండ్లకమ్మ నదీ తీరంలో ఉంది.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామ పంచాయతీకి 2013, జూలై23న జరిగిన ఎన్నికలలో శ్రీ రావిపాటి రాంబాబు, రెండు ఓట్ల మెజారిటీతో, రీ కౌంటింగులో, సర్పంచి పదవిని దక్కించుకున్నారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి దేవాలయం
[మార్చు]మల్లవరం గ్రామంలోని కొండపైన, గుండ్లకమ్మ జలాశయం వద్ద ఉన్న ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులకు నయనానందాన్ని కల్గించుచూ, దర్శనమిస్తుంది. తూర్పు అభిముఖంగా ఉన్న ఈ ఆలయ ప్రధాన ప్రవేశద్వారం పైన గాలిగోపురం నిర్మాణమై ఉంది. ఈ గోపురం ఐదు అంతస్తులతో పై భాగంలో ఏడు గోపుర కలశాలను కలిగి ఉంది. ఈ గోపుర ద్వారానికి ముందు ఇరువైపులా శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుడాళ్వారుల విగ్రహాలున్నవి. 20 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటవి. ఈ గోపురద్వారానికి ఇరువైపులా ఒక ఆలయం ఉంది. ఈ ఆలయానికి దిగువున తొలిపూజలందుకునే వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. తరువాత ఉన్న ఆలయంలో శ్రీ పద్మావతీ అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో రెండు ఆలయాలు ఎదురెదురుగా దర్శనమిచ్చును. ఒక ఆలయం తూర్పు అభిముఖంగా ఉండగా, మరొకటి దానికి ఎదురుగా పశ్చిమాభిముఖంగా ఉంది. తూర్పు అభిముఖంగా ఉన్న ప్రధానాలయ గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తులో, శ్రీవేంకటేశ్వరస్వామివారు చతుర్భుజాలను కలిగి, శంఖు. చక్ర, కటి, వరద హస్తాలతో, దివ్య మనోహర రూపంతో కొలువుదీరి దర్శనమిచ్చెదరు. ఈ ఆలయానికి ఎదురుగా పశ్చిమాభిముఖంగా ఉన్న ఆలయంలో క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామివారు ఆరడుగుల ఎత్తులో, నమస్కార భంగిమలో శ్రీ దాసాంజనేయస్వామిగా కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో (మే నెలలో) వారం రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే ధ్వజారోహణ జరిగే రోజులలో, సంతానం లేనివారు ప్రసాదం స్వీకరించి, రాత్రి నిద్ర చేస్తే, సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేగాక, ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం, కన్నులపడువగా నిర్వహించెదరు. వివాహం ఆలస్యం అవుతున్నవారు స్వామివారి కళ్యాణోత్సవాలలో పాల్గొని స్వామివార్ల తలంబ్రాలను తలపైన వేసుకుంటే శీఘ్రంగా వివాహాలు కుదురుతవని భక్తుల నమ్మకం. [3]&[4]
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]మల్లవరం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ జలాశయం వద్దగల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న ఉపాలయం ఇది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంయంతి ఉత్సవాలు, 11 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ 11 రోజులూ, ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహించెదరు మరియూ హనుమాన్ చాలీసా గానం చేసెదరు. 11వ రోజున స్వామివారికి గ్రామోత్సవం అనిర్వహించెదరు మరియూ విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [5]
కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ జలాశయం
[మార్చు]ఈ గ్రామం ప్రక్కనే గుండ్లకమ్మ ప్రాజెక్టు, జలాశయం, పార్కులూ ఉన్నాయి. ఆదివారాలు, సెలవు దినాలలో ఇక్కడికి యాత్రికులు వచ్చెదరు. ఇది జిల్లావాసుల సాగు, త్రాగునీట్ అవసరాలను తీర్చుచున్నది. ఇందులో భాగంగా మత్స్యశాఖ అధికారులు జలాశయంలో చేపల పెంపకం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ఎందరో మత్స్యకారులు ఇందులో చేపలు పట్టుకుని జీవనం సాగించేలాగా అనుమతులు ఇచ్చారు. ఇలా సుమారు 20,000 మంది మత్స్యకారులు గుండ్లకమ్మ జాలాశయాన్ని నమ్ముకుని జీవనం సాగించుచున్నారు. ఈ సంవత్సరం అధికారులు ఇందులో చేపపిల్లలను వేయుటకు, 60 లక్షల వ్యయంతో, కేజ్ కల్చర్ అను పద్ధతిని పాటించడం మొదలు పెట్టినారు. ఈ విధానం మత్స్యకారుల జీవనవిధానానికి భరోసా ఇచ్చుచున్నది. [6]
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,977. ఇందులో పురుషుల సంఖ్య 1,000, మహిళల సంఖ్య 977, గ్రామంలో నివాస గృహాలు 498 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 814 హెక్టారులు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప మాధ్యమిక పాఠశాల తేళ్ళబాదులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మద్దిపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల ఏడుగుండ్లపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మద్దిపాడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు ఒంగోలులోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]మల్లవరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]మల్లవరంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]మల్లవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 109 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 6 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 18 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 28 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 6 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 645 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 586 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 64 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]మల్లవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 40 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 24 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]మల్లవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
వెలుపలి లింకులు
[మార్చు]
ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ మల్లవరం చూడండి.