వెల్లంపల్లి (మద్దిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వెల్లంపల్లి
రెవిన్యూ గ్రామం
వెల్లంపల్లి is located in Andhra Pradesh
వెల్లంపల్లి
వెల్లంపల్లి
నిర్దేశాంకాలు: 15°38′17″N 80°00′54″E / 15.638°N 80.015°E / 15.638; 80.015Coordinates: 15°38′17″N 80°00′54″E / 15.638°N 80.015°E / 15.638; 80.015 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం576 హె. (1,423 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,592
 • సాంద్రత450/కి.మీ2 (1,200/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523211 Edit this at Wikidata

వెల్లంపల్లి, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

తూర్పున నాగులుప్పలపాడు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

అక్షయ ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2017,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వేణు సర్పంచ్‌గా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ చెన్న మల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక గ్లోబల్ స్పిన్నింగ్ మిల్స్ ఆవరణలో ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో చివరిరోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఈ కళ్యాణమహోత్సవానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి దీపారాధనలు చేసెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరు. [3]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-10వ తేదీ బుధవారంనాడు, అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా, అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బలియాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మద్యాహ్నం, భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

గ్లోబల్ స్పిన్నింగ్ మిల్స్.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,592 - పురుషుల సంఖ్య 1,276 - స్త్రీల సంఖ్య 1,316 - గృహాల సంఖ్య 704;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,216.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,110, మహిళల సంఖ్య 1,106, గ్రామంలో నివాస గృహాలు 531 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 576 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-11; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-12; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జులై-6; 2వపేజీ.