సీతారాంపురం (మద్దిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారాంపురం
—  రెవిన్యూ గ్రామం  —
సీతారాంపురం is located in Andhra Pradesh
సీతారాంపురం
సీతారాంపురం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°37′20″N 80°01′23″E / 15.62221°N 80.023014°E / 15.62221; 80.023014
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం మద్దిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ దానియేలు
జనాభా (2011)
 - మొత్తం 907
 - పురుషుల సంఖ్య 457
 - స్త్రీల సంఖ్య 450
 - గృహాల సంఖ్య 245
పిన్ కోడ్ 523227
ఎస్.టి.డి కోడ్ 08592

సీతారాంపురం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 227., ఎస్.టి.డి.కోడ్ నం. 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

తూర్పున నాగులుప్పలపా డు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

మంచినీటి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ దానియేలు సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయo[మార్చు]

ఈ గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న రామాలయానికి 2013 అక్టోబరు 18న భూమిపూజ నిర్వహించారు. [2]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017,జూన్-4వతేదీ ఆదివారంనాడు, ఆలయంలో ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో అగ్నిహోమం, పూర్ణాహుతి, బలిహరణ, ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. 5వతేదీ సోమవారంనాడు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఉన్న సిద్ధివినాయకస్వామి, సాయిబాబా ఆలయాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ ఆలయ ఆవరణలోనే ఏర్పాటుచేసిన భారీ అభయాంజనేయస్వామి విగ్రహానికి క్షీర, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకలౌ తిలకించేటంధుకు గ్రామం నుండియేగాక పరిసర ప్రాంతాలనుండి గూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. [5]

శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం[మార్చు]

(1) ఈ గ్రామ కూడలిలో 2013 ఆగస్టు 15, గురువారం నాడు శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ నవీకరణాంతర పునఃప్రతిష్ఠ, అష్టబంధన మహా సంప్రోక్షణ, నూతన జీవధ్వజ సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. [1]

(2) ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 907 - పురుషుల సంఖ్య 457 - స్త్రీల సంఖ్య 450 - గృహాల సంఖ్య 245

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 858.[2] ఇందులో పురుషుల సంఖ్య 422, మహిళల సంఖ్య 436, గ్రామంలో నివాస గృహాలు 232 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 349 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,ఆగస్టు-16; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2013,అక్టోబరు-19; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే నెల-13వతేదీ; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-23; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-5&6; 1వపేజీ.