Jump to content

బత్తిన నరసింహా రావు

వికీపీడియా నుండి

బత్తిన నరసింహారావు (1945-2017) గారు ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకులు . ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులైన[1] వీరు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అత్యంత సన్నిహిత మిత్రుడు.[2]

ప్రాథమిక జీవితం

[మార్చు]

బత్తిన నరసింహారావు గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బత్తిన వారి పల్లె గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు బత్తిన రామయ్య, అక్కమ్మ దంపతులు . స్వగ్రామం బత్తిన వారి పల్లె నుంచి చిన్నతనం లోనే ఒంగోలులో ఉన్న మేనమామ కొండ్ల రామయ్య గారి ఇంటికి వచ్చి విద్యాభ్యాసం ప్రారంభించారు .[2]

ప్రాథమిక, ఇంటర్మీడియట్ ఒంగోలులో పూర్తి చేసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

బత్తిన గారి స్వగ్రామైన బత్తిన వారి పల్లె గ్రామంలో దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే ఆర్.ఎస్ .ఎస్ యొక్క శాఖ జరిగేది, గాంధీజీ హత్య జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘ కార్యకలాపాల మీద నిషేధం విధించడంతో వీరి తండ్రి సహకారంతో తమ ఇంట్లో రహస్యంగా శాఖ నిర్వహణ జరిగేది[2], చిన్నతనంలోనే ఆర్. ఎస్. ఎస్ భావాల పట్ల ఆకర్షితుడై సంఘ్ లో చేరడం జరిగింది.[2] ఒంగోలు వచ్చిన తరువాత కూడా స్థానికంగా జరిగే శాఖలో పాల్గొన్నారు, సంఘ్ ద్వారా జాతీయ భావాలను మది నిండా నింపుకున్నారు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే సంఘ్ అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు.[2]

విద్యార్థి రాజకీయాల నుంచి భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో క్రియశీలకంగా పాల్గొంటూ వచ్చిన వీరు 1972 జై ఆంధ్ర, 1975 ఎమర్జెన్సీ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఉద్యమంలో క్రియశీలకంగా వ్యవహరించి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడం జరిగింది . 1977 లో జనతా పార్టీలో చేరి అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి ఒంగోలు లోక్ సభకు పోటీచేసిన వెంకయ్య నాయుడు గారి గెలుపునకు తీవ్రంగా శ్రమించారు, ఆ ఎన్నికల్లో వెంకయ్య గారు ఓటమి పాలైన వీరి పనీతిరుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత 1978 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం ఉదయగిరి నుంచి బరిలోకి దిగిన వెంకయ్య నాయుడు గారిని గెలిపించడంలో తనవంతు పాత్ర పోషించారు.[2]

1980 లో బీజేపీ పార్టీని స్థాపించిన తరువాత పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలో పార్టీని విస్తరణ, బలోపేతానికి చివరి శ్వాస వరకు కృషి చేస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లా పార్టీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతూనే 1982,1987 లలో ఒంగోలు పురపాలక సంఘానికి రెండు పర్యాయాలు కౌన్సిలర్ గా సాధించారు . రామాజన్మభూమి ఉద్యమంలో భాగంగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎల్ . కె. అద్వానీ గారు చేపట్టిన రథ యాత్ర ప్రకాశం జిల్లాకు వచ్చిన సమయంలో ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేయడమే కాకుండా జిల్లావ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తలను సమీకరించి అయోధ్యకు పంపించడంలో వీరు చేసిన కృషిని అద్వానీ కొనియాడారు. 1991 లో ఒంగోలు లోక్ సభ నుంచి, 2009 లో నెల్లూరు లోక్ సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూసిన పార్టీకి గణనీయమైన ఓట్ల శాతాన్ని సంపాదించారు.[2]

ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మూడు సార్లు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర బీజేపీ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. చివరి శ్వాస వరకు బీజేపీ తోనే కొనసాగారు .[2]

వ్యాపార జీవితం

[మార్చు]

నరసింహారావు గారు రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా అందరికీ సూపరిచితులే, హోటల్ వ్యాపార రంగం లోకి ప్రవేశించి 1980 ల్లో ఒంగోలులో ఆధునిక వాసతులతో మౌర్య హోటల్ ను స్థాపించారు, జిల్లాలో హోటల్ రంగం బాగా అభివృద్ధి చెందడంలో కీలకమైన పాత్ర పోషించారు . హోటలియర్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటలియర్స్ సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది .[2]

ఆంధ్ర కేసరి విద్య కేంద్రం (ఏ. కె. వి. కె)

[మార్చు]

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారిలో జాతీయవాద భావాలను పెంపొందించడమే లక్ష్యంగా నరసింహారావు గారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్మారకార్థం ఆంధ్ర కేసరి విద్య కేంద్రాన్ని 1987 ఒంగోలులో ప్రారంభించారు తరువాతి కాలంలో సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు నిరావహించారు, ప్రస్తుతం ఈ సంస్థ క్రింద ఇంటర్మీడియట్, డిగ్రీ, న్యాయ, బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో చదివిన ఏంతో మంది విద్యార్థులు అనేక రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.[2]

వ్యక్తిత్వం

[మార్చు]

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన బత్తిన గారికి అన్నీ పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరుపుతూ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచారు. సిద్దాంత పరమైన వైరుధ్యలే తప్పించి వ్యక్తీగతంగా ఏవరిని విమర్శించేవారు కాదు .

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బత్తిన నరసింహారావు గారి భార్య పేరు వసుంధరాదేవి . వీరికి 3 సంతానం, కుమారులు మహేష్, రాజేష్ లు వైద్యులుగా స్థిరపడగా, కుమార్తె దేవసేన గృహిణి . ప్రముఖ యువ రాజకీయ నాయకులు లంకా దినకర్ గారు వీరి మేనల్లుడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Apr 23, Harie / TNN / Updated:; 2012; Ist, 02:47. "At last, BJP gets its Jai Andhra movement going | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

2. https://www.indiaherald.com/Politics/Read/994462412/BATTINA-NARASIMHA-RAO-POLITICIAN