బిపిన్ చంద్ర పాల్
బిపిన్ చంద్ర పాల్ | |
---|---|
జననం | పోయిల్, హబిగని, సైలెట్ జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. | 1858 నవంబరు 7
మరణం | 1932 మే 20 కలకత్తా | (వయసు 73)
జాతీయత | బ్రిటిష్ ఇండియన్ |
విద్యాసంస్థ | కలకత్తా విశ్వవిద్యాలయం |
వృత్తి | రాజకీయనాయకుడు రచయిత భారత స్వాతంత్ర్యోద్యమ ఉద్యమకారుడు సంఘసంస్కర్త |
బ్రహ్మ సమాజం | |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమం |
సంతకం | |
బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7, 1858 – మే 20, 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు. లాల్, బాల్, పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను మొదలు పెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]బిపిన్ చంద్రపాల్ 1858 నవంబరు 7న నాటి బెంగాల్లోని (నేటి బంగ్లాదేశ్) సిల్హట్‌లో జన్మించారు. బ్రహ్మ సమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్ చౌక్’ అని పిలుస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడిందట. ట్రిబ్యూన్, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి. గాంధీజీతో విభేదించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదంటారు. ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అనే నాయక త్రయాన్ని ‘లాల్, బాల్, పాల్’ అని సగౌరవంగా పిలిచేవారు.
ఉద్యోగం
[మార్చు]పబ్లిక్ ఒపీనియన్, ది ట్రిబ్యూన్, న్యూ ఇండియా పత్రికలకు పాల్ విలేఖరిగా పనిచేశాడు. తను పాత్రికేయుడిగా పనిచేస్తున్న కాలంలో జాతీయవాదాన్ని ప్రచారం చేశాడు. చైనా రాజకీయాల్లో జరుగుతున్న పెనుమార్పులు అలాగే ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా రాజకీయంగా ఉన్న పరిస్థితుల గురించి భారత ప్రజానీకాన్ని చైతన్య పరుస్తూ ఆయన అనేక వ్యాసాలు ప్రచురించాడు. పాల్ తన రచనలలో భారత దేశ భవిష్యత్తుకు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో వివరిస్తూ ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Bipin Chandra Pal: As much a revolutionary in politics, as in his private life". web.archive.org. 2020-01-12. Archived from the original on 2020-01-12. Retrieved 2021-11-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లంకెలు
[మార్చు]- ఒక జీవితచరిత్ర, బంగ్లాపీడియా