Jump to content

వే రెబో

వికీపీడియా నుండి
వే రెబో
వే రెబో గ్రామంలోని ఇళ్ళు
వే రెబో గ్రామంలోని ఇళ్ళు
వే రెబో గ్రామంలోని ఇళ్ళు
దేశం ఇండోనేషియా
జిల్లా మంగరాయ్ జిల్లా
జనాభా
 - జనాభా 1,000
 - గృహాల సంఖ్య 7

వే రెబో అనేది ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపంలోని నుసా టెంగ్‌గారా తైమూర్ ప్రావిన్స్‌లోని మంగరాయ్ జిల్లాలోని ఒక గ్రామం. మంగరాయ్ జిల్లాలోని సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలలో వే రెబో ఒకటి. సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఈ గ్రామం ఉంది.[1] ఈ గ్రామంలో కేవలం 7 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. 2012 ఆగస్టు 27న వే రెబోను ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది.[2] వే రెబోను 100 సంవత్సరాల క్రితం ఎంపు మారో స్థాపించినట్లు చెబుతారు. ఈ గ్రామంలో ఉన్న ప్రస్తుత నివాసితులు అతని 18వ తరం వారసులు.

గృహ నిర్మాణం

[మార్చు]

ఈ ఊరిలో ఇళ్ళు గుండ్రంగా, శంఖాకార ఆకారంలో భూమి మీద బోర్లించినట్టుగా ఉంటాయి. వీటిని ఎంబారు నియాంగ్ ఇళ్ళు అని పిలుస్తారు. వీటిని ఒక్క మేకు కూడా వాడకుండా కేవలం చెక్క, తాటి ఆకులతో నిర్మిస్తారు. వీటి పరిమాణం దాదాపు 12-15 మీటర్లు, ఎత్తు సుమారు 8-10 మీటర్లు ఉంటుంది. ఈ ఇంటి లోపల 5 అంతస్తుల అటకలు ఉంటాయి.[3] గాలి, వెలుతురు కోసం అక్కడక్కడ కిటికీలు అమర్చారు. మొదటి అంతస్తు అటకను లూతుర్ లేదా టెంట్ అని పిలుస్తారు, ఇది కుటుంబ గది లేదా సమావేశ స్థలం కోసం ఉపయోగించబడుతుంది. లోబో లేదా అట్టిక్ అని పిలువబడే రెండవ అంతస్తులో ఆహారం, వస్తువులను నిల్వ చేయడానికి వాడతారు. లెంటార్ అని పిలువబడే మూడవ అంతస్తు అటకను తదుపరి పంట కోసం విత్తనాలను నిల్వ చేయడానికి వాడతారు. లెంపా రే అని పిలువబడే నాల్గవ అంతస్తును డ్రాఫ్ట్ సందర్భంలో ఆహార నిల్వల కోసం కేటాయించబడింది. ఐదవ అంతస్తును హేకాంగ్ కోడె అని పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ఇది పూర్వీకులను ప్రార్ధించడం కోసం, వారికీ నైవేద్యాలు పెట్టడానికి వాడతారు. ఇక్కడ ప్రధానంగా కాఫీ గింజలు, వెనిలా గింజలు, దాల్చినచెక్కను పండిస్తారు. వీటిని దాదాపు గ్రామానికి 15 కి.మీ. దూరంలో ఉన్న మార్కెట్‌లో విక్రయిస్తారు.

ప్రయాణం

[మార్చు]

వే రెబో గ్రామం ఫ్లోర్స్ ద్వీప నైరుతి తీరానికి సమీపంలో ఉన్న మౌంట్ రాటోపై 1100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వే రెబో చుట్టూ అందమైన పర్వతాలు, దట్టమైన టోడో అడవులు ఉంటాయి, ఈ అడవులలో ఆర్కిడ్లు, ఫెర్న్లు, ఇతర ఉష్ణమండల మొక్కలు ఉంటాయి. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అలాగే విద్యుత్, రాత్రి ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రదేశానికి ప్రత్యక్ష రవాణా సౌకర్యాలు లేవు. గ్రామానికి వస్తువుల రవాణా దాదాపుగా పర్వత మార్గాల ద్వారా కాలినడకన ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలి అంటే లాబువాన్ బాజో నుండి డెంగే వరకు 3 గంటల ప్రయాణం చేయాలి. ఆ తరువాత డెంగే తీర పట్టణం నుండి మొదట్లో చెట్లతో కూడిన పర్వత మార్గాల పాదాల వరకు సుమారు 5 కి.మీ వరకు రహదారి ఉంటుంది, ఇక్కడ మోటారు వాహనాల మీద వెళ్లొచ్చు. అక్కడి నుండి మౌంట్ రాటోపై ఎత్తైన లోయలో ఉన్న గ్రామానికి దాదాపు 10 కి.మీ. ఉంటుంది, ఈ మార్గంలో పాక్షికంగా నిటారుగా ఉన్న కాలిబాట, మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, నదులను దాటడం, కొండ చరియలను అధిరోహించడం వంటివి ఉంటాయి.[4] దాదాపు 3 గంటల ప్రయాణం తరువాత వే రెబో చేరుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "Wae Rebo: Exploring the Highlands of Flores - Discover Your Indonesia". Retrieved 2023-05-16.
  2. "The Traditional Village of Wae Rebo on the Island of Flores - Indonesia Travel". www.indonesia.travel. Retrieved 2023-05-16.
  3. Mediatama, Grahanusa (2019-09-05). "Kampung adat Wae Rebo, salah satu surga di Bumi Flores". PT. Kontan Grahanusa Mediatama. Retrieved 2023-05-16.
  4. "Wae Rebo, Kisah Sebuah Kampung Di Atas Awan". Indonesia Kaya. Retrieved 2023-05-16.
"https://te.wikipedia.org/w/index.php?title=వే_రెబో&oldid=3901118" నుండి వెలికితీశారు