మద్దికేర తూర్పు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మద్దికేర తూర్పు
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో మద్దికేర తూర్పు మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో మద్దికేర తూర్పు మండలం యొక్క స్థానము
మద్దికేర తూర్పు is located in ఆంధ్ర ప్రదేశ్
మద్దికేర తూర్పు
ఆంధ్రప్రదేశ్ పటములో మద్దికేర తూర్పు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°15′00″N 77°25′00″E / 15.2500°N 77.4167°E / 15.2500; 77.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము మద్దికేర తూర్పు
గ్రామాలు 6
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 36,834
 - పురుషులు 18,653
 - స్త్రీలు 18,181
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.13%
 - పురుషులు 70.53%
 - స్త్రీలు 39.07%
పిన్ కోడ్ {{{pincode}}}
మద్దికేర తూర్పు
—  రెవిన్యూ గ్రామం  —
మద్దికేర తూర్పు is located in ఆంధ్ర ప్రదేశ్
మద్దికేర తూర్పు
అక్షాంశరేఖాంశాలు: 15°15′00″N 77°25′00″E / 15.2500°N 77.4167°E / 15.2500; 77.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం మద్దికేర తూర్పు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 14,274
 - పురుషుల సంఖ్య 7,382
 - స్త్రీల సంఖ్య 6,892
 - గృహాల సంఖ్య 2,747
పిన్ కోడ్ 518385
ఎస్.టి.డి కోడ్

మద్దికేర తూర్పు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము.

గుర్రాల పారువేట ఉత్సవం[మార్చు]

విజయదశమి వేడుకల్లో జరిగే పారువేట ఉత్సవం మద్దికేర గ్రామంలో ప్రధాన ఆకర్షణ. స్థానిక యాదవ రాజుల వంశీయులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మద్దికేరలో పెద్దనగిరి, చిన్ననగిరి అనే యాదవ రాజుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబీకులు శ్రీ భోగేశ్వర స్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. పనులు సవ్యంగా జరగాలంటే భోగేశ్వరుని దయ ఉండాలని, ఇందు కోసం ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భోగేశ్వర స్వామిని పూజించాలన్నది వీరి విశ్వాసం. గతం లో ఈ రెండు రాజ కుటుంబాలు విడిపోయినా ఆనవాయితీగా దసరా సంబరాలను మాత్రం విస్మరించలేదు.

ఈ రెండు రాజరికపు కుటుంబాలతోపాటు యామన్న నగిరి అనే మరో రాజు కుటుంబం కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటూ వస్తూంది. పేరుగాంచిన యాదవ రాజులు, తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. యాదవ రాజుల వంశీయులు దసరా పండుగ రోజున గుర్రాలపై కూర్చొని, తల పాగా, రాచరికపు దుస్తులు ధరించి ఖడ్గధారులై మేళతాళాలతో మద్దికేరకు 3 కి.మీ. దూరంలోని నాటి యాదవ రాజులు నిర్మించిన బొజ్జనాయినిపేట మజరా గ్రామంలోని భోగేశ్వరాలయానికి ఊరేగింపుగా వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. వీరికి మద్ది కులస్తులు సైన్యం వలె ఆయుధాలు ధరించి అంగరక్షకులుగా ఉంటారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి గుర్రాలపై వేగంగా వస్తారు. ఆ తరువాత మద్దికేరలో ప్రధాన రహదారుల్లో గుర్రాలపై స్వారీ చేస్తూ తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు.[1]

మద్దికేర మద్దమంబ[మార్చు]

మద్దికేర గ్రామము.[2] లో మద్దమాంబ తిరుణాల చాలా ప్రసిద్ధి గాంచినది.ఈ గ్రామ దేవత పేరు మీదనే ఈ వూరు పేరు మద్దికేర గా పిలువబడుచున్నది.రతోస్త్వవానికి ముందు ఈ గ్రామాన్ని పాలించిన యాదవ రాజులు ఊరేగింపుగా వెళుతారు.ఈ వుత్శావము ప్రతి సంవస్త్రం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరుగును.[3]

గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 36,834 - పురుషులు 18,653 - స్త్రీలు 18,181
అక్షరాస్యత (2011) - మొత్తం 55.13% - పురుషులు 70.53% - స్త్రీలు 39.07%

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,274.[4] ఇందులో పురుషుల సంఖ్య 7,382, మహిళల సంఖ్య 6,892, గ్రామంలో నివాస గృహాలు 2,747 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]