Jump to content

లారీ టెస్లర్

వికీపీడియా నుండి
లారీ టెస్లర్
జననంలారెన్స్ గోర్డాన్ టెస్లర్
(1945-04-24)1945 ఏప్రిల్ 24
ది బ్రోంక్స్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్
మరణం2020 ఫిబ్రవరి 16(2020-02-16) (వయసు 74)
పోర్టోలా వ్యాలీ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్
పౌరసత్వంఅమెరికన్
రంగములుకంప్యూటర్ సాంకేతికత
వృత్తిసంస్థలుపార్క్ కంపనీ, యాపిల్ ఇన్‌కార్పొరేషన్, అమెజాన్, యాహూ!
చదువుకున్న సంస్థలుస్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధికట్, కాపీ, పేస్ట్ సృష్టికర్త

లారీ టెస్లర్ (ఏప్రిల్ 24, 1945 - ఫిబ్రవరి 16, 2020) న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. కంప్యూటరులో క‌ట్‌, కాపీ, పేస్ట్‌లాంటి క‌మాండ్లును రూపొందించాడు.[1]

ఆపిల్‌ సంస్థలో లీసా, న్యూటన్, మాకింతోష్‌తో కలిసి ఐఫోన్ ఇంటర్ఫేస్‌ రూపకల్పనపై పనిచేసిన టెస్లర్, ఆపిల్‌నెట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. అమెజాన్‌లో చేరడానికిముందు విద్యార్థులకు ప్రోగ్రామింగ్ నేర్పించే స్టేజ్‌కాస్ట్ సాఫ్ట్‌వేర్ సంస్థ సహ వ్యవస్థాపకులుగా పనిచేశాడు. యాహూలో యూజర్స్‌ ఎక్సిపీరియన్స్ అండ్‌ రీసెర్చ్‌ విభాగానికి హెడ్‌గా పనిచేసిన టెస్లర్, తన మరణానికి ముందు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ కన్సల్టింగ్‌ సంస్థలో పనిచేశాడు.[2]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

టెస్లర్ 1945, ఏప్రిల్ 24న యూదులైన ఇసిదోర్ (అనస్థీషియాలజిస్ట్) మురియెల్ దంపతులకు అమెరికా, న్యూయార్క్ లోని ది బ్రోంక్స్ లో జన్మించాడు.[3] 1961లో బ్రోంక్స్ హైస్కూల్ ఆఫ్ సైన్స్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు ఉపాధ్యాయుడు టెస్లర్‌కు కంప్యూటర్ల వైపు మార్గనిర్దేశం చేశాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ప్రోగ్రాం గురించి తెలుసుకొని, ప్రతివారం అరగంటపాటు అక్కడి కంప్యూటర్ సిస్టమ్స్‌లో ప్రోగ్రాం నేర్చకున్నాడు.[3] 1961లో 16 సంవత్సరాల వయసులో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరి, 1965లో గణితంలో పట్టా పొందాడు.[3][4]

కుటుంబం - ఉద్యోగం

[మార్చు]

టెస్లర్ మొదటి భార్యతో 1969లో విడాకులు తీసుకున్నాడు. తరువాత భౌగోళిక భౌతిక శాస్త్రవేత్త కొలీన్ బార్టన్‌ను వివాహం చేసుకున్నాడు.[3] యాపిల్, అమెజాన్, యాహూ, జిరాక్స్ వంటి సంస్థలలో పనిచేశాడు.

కంప్యూటర్ రంగం

[మార్చు]

1960లలో కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ప‌నిచేసిన టెస్ల‌ర్‌.. సులువైన కంప్యూట‌ర్ క‌మాండ్లను రూపొందించాడు. గ్రాడ్యుయేష‌న్ తర్వాత ఇంట‌ర్‌ఫేస్ డిజైన్‌పై దృష్టి పెట్టి, కంప్యూట‌ర్ల వినియోగాన్ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా మార్చాడు. 1973లో పాలో ఆల్టో రీసెర్చ్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో ‘కట్- కాపీ- పేస్ట్’ కీ లను ఆవిష్కరించాడు. టిమ్ మాట్ అనే కంప్యూటర్ నిపుణుని సహాయంతో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్ తయారుచేసిన టెస్లర్, దాన్ని మరింతగా అభివృద్ధిపరచి ‘కట్- కాపీ- పేస్ట్’ ను రూపొందించాడు. దీన్ని ఆపిల్ సంస్థ లిసా కంప్యూటర్లలో ఉపయోగించడంతో ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. బ్రౌజర్ అనే పదాన్ని కూడా 1976లో టెస్లర్ సూచించాడు.[5]

మరణం

[మార్చు]

టెస్లర్ 2020, ఫిబ్రవరి 16న కాలిఫోర్నియాలోని పోర్టోలా వ్యాలీలో మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, అంతర్జాతీయం (20 February 2020). "క‌ట్‌, కాపీ, పేస్ట్‌.. సృష్టిక‌ర్త ఇక లేరు". ntnews. Archived from the original on 22 ఫిబ్రవరి 2020. Retrieved 31 March 2020.
  2. సాక్షి, ప్రపంచం (20 February 2020). "కట్‌, కాపీ, పేస్ట్ సృష్టికర్త లారీ టెస్లర్‌ మృతి". Sakshi. Archived from the original on 31 మార్చి 2020. Retrieved 31 March 2020.
  3. 3.0 3.1 3.2 3.3 Markoff, John (20 February 2020). "Lawrence Tesler, Pioneer of Personal Computing, Dies at 74". The New York Times. Retrieved 31 March 2020.
  4. Cellan-Jones, Rory (6 January 2012). "Larry Tesler: The Silicon Valley history man". BBC. Retrieved 31 March 2020.
  5. ఈనాడు, తాజావార్తలు (20 February 2020). "కట్‌.. కాపీ.. పేస్ట్‌.. సృష్టికర్త ఇక లేరు!". www.eenadu.net. Archived from the original on 31 మార్చి 2020. Retrieved 31 March 2020.
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (20 February 2020). "'కట్-కాపీ- పేస్ట్' ఆవిష్కర్త కన్నుమూత!". www.andhrajyothy.com. Archived from the original on 31 మార్చి 2020. Retrieved 31 March 2020.

ఇతర లంకెలు

[మార్చు]