Jump to content

శామ్యూల్ లోవెట్ వాల్డో

వికీపీడియా నుండి
శామ్యూల్ లోవెట్ వాల్డో
సెల్ఫ్ పోర్ట్రెయిట్ (1815), మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్
సెల్ఫ్ పోర్ట్రెయిట్ (1815), మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్
జననంఏప్రిల్ 6, 1783
విండ్‌హామ్, కనెక్టికట్ , యు.ఎస్
మరణంఫిబ్రవరి 16, 1861
న్యూయార్క్ నగరం, న్యూయార్క్ ,యు ఎస్
భార్య / భర్తజోసెఫిన్ ఎలిజా వుడ్ (మీ. 1808–1825, మరణం),డెలివరెన్స్ మ్యాప్స్ (మీ. 1826–1865, మరణం)
ఎన్నికకూపర్ ఇన్స్టిట్యూట్ నేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ అసోసియేట్

శామ్యూల్ లోవెట్ వాల్డో ( 1783 ఏప్రిల్ 6 - 1861 ఫిబ్రవరి 16) అమెరికాకు చెందిన పోర్ట్రెయిట్ చిత్రకారుడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

[2] వాల్డో 1783 ఏప్రిల్ 6 న కనెక్టికట్‌లోని విండ్‌హామ్‌లో ఎస్తేర్ (స్టీవెన్స్), జాకియస్ వాల్డో దంపతులకు జన్మించాడు. పదహారేళ్ల వయసులో అతను, ప్రముఖ స్థానిక కళాకారుడు జోసెఫ్ స్టీవార్డ్ ఆధ్వర్యంలో కళా శిక్షణ పొందేందుకు హార్ట్‌ఫోర్డ్‌ వెళ్లాడు.

నాలుగు సంవత్సరాల తరువాత, అతను హార్ట్‌ఫోర్డ్‌లో పోర్ట్రెయిటిస్ట్‌గా దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత కనెక్టికట్‌లోని లిచ్‌ఫీల్డ్‌కు మకాం మార్చాడు. హార్ట్‌ఫోర్డ్‌లో ఉన్నప్పుడు, అతను కాంగ్రెస్ సభ్యుడు జాన్ రూట్‌లెడ్జ్ జూనియర్‌తో పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు, అతను తన పనిని చూసి ముగ్ధుడై, 1803లో, సౌత్ కరోలినాలోని చార్లెస్టన్‌కు రమ్మని ఆహ్వానించాడు. 1803 నుండి 1805 వరకు, వాల్డో తన కమిషన్ల నుండి గణనీయమైన ఆదాయాన్ని సంపాదించాడు. ఆ డబ్బును, లండన్‌లో కళను అభ్యసించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అతను లండన్‌లో బెంజమిన్ వెస్ట్ వద్ద చదువుకున్నాడు.[3] అతను బెంజమిన్ వెస్ట్ జాన్ సింగిల్టన్ కోప్లీలకు పరిచయ లేఖలతో 1806లో లండన్ చేరుకున్నాడు. వారితో చదువుతున్నప్పుడు, అతను రాయల్ అకాడమీలో డ్రాయింగ్ కూడా అభ్యసించాడు 1808లో అక్కడ ఒక చిత్రపటాన్ని ప్రదర్శించాడు.

వ్యక్తి గత జీవితం

[మార్చు]

[4] అతని కళాత్మక కార్యకలాపాల మధ్య, అతను 1808లో లివర్‌పూల్‌కు చెందిన ఎలిజబెత్ వుడ్‌తో పరిచయమై, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. వారికి, శైశవ దశలోనే మరణించినవారు పోగా, ఐదుగురు పిల్లలు మిగిలారు. ఎలిజబెత్ 1825లో మరణించింది. మరుసటి సంవత్సరం, 1826 మే 9 న అతను, డెలివరెన్స్ మ్యాప్స్‌ని వివాహం చేసుకున్నాడు. వారికి మరో ఏడుగురు పిల్లలు కలిగారు.[5]

వృత్తి కార్యకలాపాలు

[మార్చు]

1809లో, అతను యునైటెడ్ స్టేట్స్ కు తిరిగి వచ్చి న్యూయార్క్ నగరంలో పోర్ట్రెయిట్ స్టూడియోను స్థాపించాడు.

మూడు సంవత్సరాల తర్వాత, కనెక్టికట్‌ లోని న్యూ లండన్‌కు చెందిన ఒక యువ కోచ్ పెయింటర్, విలియం జువెట్ (మ. 1874 మార్చి 24), [6] ఒక మంచి కళాకారుడు కావాలనుకుని, వాల్డోను సంప్రదించి, అప్రెంటిస్‌గా తనని తీసుకోమని అడిగాడు. వాల్డో అంగీకరించాడు. చదువుకున్నంత కాలం తన కుటుంబంతో నివసించడానికి అతన్ని అనుమతించాడు. 1818లో, వారు అధికారికంగా వ్యాపార భాగస్వాములయ్యారు.[7] ఇది 1854 లో జ్యువెట్ పదవీ విరమణ చేసేంతవరకు అది కొనసాగింది. ఒక జట్టుగా, వాల్డో వారి వ్యక్తుల తల చేతులకు రంగులు వేయగా, జువెట్ దుస్తులు డ్రేపరీలను పూరించాడని సాధారణంగా భావిస్తారు.

పెయింటింగులు వెయ్యడంతో పాటు వాల్డో, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌కు డైరెక్టర్‌గా, 1817 నుండి 1841లో అది రద్దయ్యే వరకు పనిచేశాడు. అతను నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్‌కు వ్యవస్థాపక సభ్యుడు కూడా.

మరణం, వారసత్వం

[మార్చు]

అతను 1861 ఫిబ్రవరి 16 న న్యూయార్క్ నగరంలో మరణించాడు. గ్రీన్-వుడ్ శ్మశానవాటికలో అతన్ని ఖననం చేసారు.[8] వాల్డో చిత్రాలు మోంట్‌గోమేరీ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌తో సహా అనేక పబ్లిక్ మ్యూజియంలలో ప్రదర్శించారు.

ఎంచుకున్న చిత్తరువులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిషోల్మ్, హగ్, ed. (1911) "వాల్డో, శామ్యూల్ లోవెట్" . ఎన్సైక్లోపీడియా బ్రిటానికా . వాల్యూమ్. 28 (11వ ఎడిషన్). కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్. p. 258. పోర్ట్రెయిట్ పెయింటింగ్

మూలాలు

[మార్చు]
  1. "మిల్స్, సాలీ (2003). "వాల్డో, శామ్యూల్ లోవెట్" . గ్రోవ్ ఆర్ట్ ఆన్‌లైన్ . ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్".
  2. ""వాల్డో, శామ్యూల్ లోవెట్"".
  3. ""మ్యూజియమ్‌కు అక్విజిషన్"".
  4. ""శామ్యూల్ లోవెట్ వాల్డో (1783-1861)"".
  5. ". వాల్డో కుటుంబం వంశావళి: 1647 నుండి 1900 వరకు ఇప్స్విచ్, మాస్.కి చెందిన కార్నెలియస్ వాల్డో వారసుల రికార్డు".
  6. "న్యూజెర్సీ, డెత్స్ అండ్ బరియల్స్ ఇండెక్స్, 1798-1971".
  7. "1870 యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ సెన్సస్".
  8. ""శామ్యూల్ లోవెట్ వాల్డో" ".