Jump to content

అబ్దుల్ సత్తార్ ఈది

వికీపీడియా నుండి
అబ్దుల్ సత్తార్ ఈది
జననం
అబ్దుల్ సత్తార్ ఈది

(1928-01-01)1928 జనవరి 1
బంత్వా, బంత్వ మనవదర్, వెస్ట్ ఇండియా స్టేట్ ఏజన్సీ, బ్రిటిష్ రాజ్.
మరణం2016 జూలై 8(2016-07-08) (వయసు 88)
కరాచీ, పాకిస్తాన్
మరణ కారణంకిడ్నీ వ్యాధి
సమాధి స్థలంఈది గ్రామం
జాతీయతపాకిస్తాన్
ఇతర పేర్లుAngel of Mercy[1][2]
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Social work
Simple lifestyle
Humanitarian[3]
జీవిత భాగస్వామిబిల్‌కిష్ ఈది
పిల్లలుఫైసల్ ఈది, కుతుబ్ ఈది
తల్లిదండ్రులు
  • అబ్దుల్ షకూర్ ఈది (తండ్రి)
  • ఘుర్బా ఇది (తల్లి)
పురస్కారాలులెనిన్ శాంతి బహుమతి (1988)
నిషాన్-ఇ-ఇంతిజాత్ (1989)
వోల్ఫ్ ఆఫ్ భోహియో శాంతి అవార్డు (2005), ఇటలీ
అహ్మదియ్యా ముస్లిం శాంతి బహుమతి (2010)
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

అబ్దుల్‌ సత్తార్‌ ఈది (1 జనవరి 1928 – 2016 జూలై 8) పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకులు, దాత. పాక్‌లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది ఫౌండేషన్‌’ను ఏర్పాటుచేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకు దేశవిదేశాల్లో ఎందరో అభిమానులు ఉన్నారు. ఈది ఫౌండేషన్‌ పాకిస్థాన్‌లో ఎన్నో అనాథాశ్రమాలు, మెడికల్‌ క్లినిక్‌లు, అంబులెన్స్‌లు నడుపుతోంది. పేదల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తోంది.[5] తప్పిపోయి పాకిస్థాన్‌ చేరిన భారతీయ బాలిక గీత ఆశ్రయం పొంది, పెరిగి పెద్దదైంది ఈదీ ఫౌండేషన్‌లోనే.[6] ఆయన "ఏంజల్ ఆఫ్ మెర్సీ"గా సుప్రసిద్ధుడు. "అతి గౌరవప్రదమైన" చారిత్రక వ్యక్తిగా పాకిస్తాన్ లో గుర్తింపు పొందాడు.[1][7] 2013లో "ద హఫింగ్టన్ పోస్టు" ఆయనను "ప్రపంచంలో జివించిఉన్న గొప్ప మానవతావాది"గా ప్రకటించింది.[8] మరికొంత మంది ఆయనను "ఫాదర్ ఆఫ్ తెరెసా"గా అభివర్ణిస్తారు.[9]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1928లో బ్రిటిష్ ఇండియాకు చెందిన గుజరాత్ లో బంత్వా గ్రామంలో జన్మించాడు.[10] తన 11వ యేట ఆయన తల్లికి పక్షవాతం వచ్చింది. ఆయన 19వ యేట ఆమె మరణించింది. ఆమెకు తాను చేసిన సేవల అనుభవం వల్ల ఆయనకు ముసలివాళ్ళు, మానసిక వికలాంగులు, వికలాంగులకు సేవచేయాలనే కృక్పథం అభివృద్ధి చెందింది. భారత పార్లమెంటు ప్రకారం ఈది, ఆయాన్ కుతుంబ సభ్యులను 1947లో పాకిస్తాన్ వలస వెళ్ళారు.[7][11] అప్పుడు ఆయన కరాచీ వెళ్ళి ఒక హోల్‌సేల్ షాపులో పనికి చేరాడు. ఆయన తల్లి ఆయనకు ఒక పైసాను తన ఆహారం కొరకు, మరియొక పైసాను ముష్థివానికి దానం చేసింది.[12] ఆయన మొదట పెడ్లర్ గానూ తరువాత ఆయన బట్టల షాపులో కమీషన్ ఎజంటుగా పని చేసాడు. కొన్ని సంవత్సరములు తరువాత ఆయన కులం వాళ్ళ సహకారంతో ఉచిత వైద్యశాలను ప్రారంభించాడు.[11]

ఆయన నేషనల్ పబ్లిక్ రేడియోకు ఇచ్చిన కార్యక్రమం (2009) లో "నేను రోడ్లపక్క అనేక మంది ప్రజలను చూశాను... ఫ్లూ వ్యాధి కరాచీలో వ్యాపించింది, ఎవరూ వారికి వైద్య సహాయం అందించడం లేదు. కానీ నేను కొన్ని బల్లలను అచ్చట అమర్చి మెడికల్ విద్యార్థులను వాలంటీర్లుగా సంపాదించాను. నాకు డబ్బు లేదు. నేను వీధులలో విరాళాల కొరకు అడుక్కున్నాను. ప్రజలు సహాయమందించారు. నేను ఒక 8X8 గదిని తీసుకుని నా పనిని ప్రరంభించాను."[13]

స్వచ్ఛంద సేవ

[మార్చు]

ఆయన తరువాత 60 సంవత్సరాల పాటు తన జీవితాన్ని పేద ప్రజల కొరకు అంకితం చేసారు. పాకిస్తాన్ లో ఆయాన పేదల సంక్షేమం కొరకు ఒంటి చేతితో పనిచేసారు. ఆయన ఈది ఫౌండేషన్ను స్థాపించారు. అదనంగా ఆయన సంక్షేమ ట్రస్టు స్థాపించి దానికి ఈది ట్రస్టుగా నామకరణం చేసారు. దానికి ప్రారంభంలో ఐదువందల పాకిస్తాన్ రూపాయల ప్రారంభ మొత్తాన్ని ఉపయోగించారు. తదుపరి ఆ ట్రస్టు "బిల్‌క్విస్ ఈది ట్రస్టు"గా నామాంతరం చెందింది.[14][15] పేద ప్రజల సంరక్షకునిగా ఉన్న ఆయనకు అనేక విరాలాలు వచ్చాయి. అప్పుడు తన సేవలను విస్తరించారు. ప్రస్తుతం ఆ సంస్థ పరిమాణం లోనూ, సేవలలోనూ అభివృద్ధి చెంది పాకిస్తాన్ లొ అతి పెద్ద సంక్షేమ సంస్థగా ప్రసిద్ధి చెందింది. ప్రారభం నుంచి ఆ సంస్థ 20000 మంది వదిలివేయబడిన శిశువులను, 50000 మంది అనాథలను ఆదుకొంది, 40000 మంది నర్సులకు శిక్షణనిచ్చారు.[16] ఈ సంస్థ 300 లకు పైగా కేంద్రాలను పాకిస్తాన్ లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నెలకొల్పి తన సేవలనందించింది. వివిధ ప్రాంతాలలో వంటశాలలు, వలస కేంద్రాలు, ఎవరూలేని మహిళలకు వసతి గృహాలు, అంగవైకల్యం గలవారికి వైద్యశాలలను స్థాపించింది.[17]

ఈది ఫౌండేషన్ "ఈది" స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద అంబులెన్స్ సర్వీసు (1500 ) నడుపుతూ 24 గంటలు అత్యవసర సర్వీసులను కూడా అందిస్తుంది. ఆ సంస్థ ఉచిత నర్సింగ్ హోం లను, అనాధాశ్రయాలను, వైద్యశాలలను, మహిళా వసతి గృహాలను, డ్రగ్స్ తీసుకున్న బాధితులకు పునరావాస కేంద్రాలు, మానసిక వికలాంగుల కేంద్రాలు స్థాపించింది.[18] ఈ సంస్థ 2005లో కత్రినా తుఫాను బాధితుల కొరకు ఆఫ్రికా, మధ్య తూర్పు, కాకసస్ ప్రాంతం, తూర్పు యూరోప్, యునైటెడ్ స్టేట్స్ లలో సహాయ కార్యక్రమాలను చేసింది. ఆయన కుమారుడు ఫైసల్ ఈది, భార్య బిల్‌క్విస్ ఈది, కుమార్తెలు ఆయన వ్యాధితో బాధపడుతున్నప్పుడు సంస్థకోసం తమ సేవలనందించారు.[16] ఆయన పాకిస్తాన్ యొక్క మదర్ తెరెసాగా పిలువబడుతున్నారు.[19]

పురస్కారాలు

[మార్చు]

అంతర్జాతీయ అవార్డులు

[మార్చు]
  • రామన్ మెగసెసే అవార్డు (ప్రజా సేవ కొరకు) (1986) [20][21]
  • లెనిన్ శాంతి బహుమతి (1988) [22]
  • పాల్ హారిస్ ఫెలో (రోటరీ ఇంతనేషనల్ నుండి) (1993) [22]
  • అమెరికన్ భూకంప బాధితులకు సహాయం అందించినందుకు గానూ యు.ఎస్.ఎస్.ఆర్ నుండి శాంతి బహుమతి. (1998)
  • హమ్‌దాన్ అవార్డు (మెడికల్ సేవలకు గానూ) (2000), UAE[22]
  • ఇంటర్నేషనల్ బల్జాన్ ప్రైజ్ (2000) (మానవత్వం, శాంతి, సౌభ్రాతృత్వం, ఇటలీ) [22]
  • పీస్ అండ్ హార్మోనీ అవార్డు (2001), ఢిల్లీ
  • శాంతి పురస్కారం (2004), ముంబై
  • శాంతి బహుమతి (2005), హైదరాబాదు దక్కన్
  • వోల్ఫ్ ఆఫ్ భోగియో పీస్ అవార్డు (2005), ఇతాలీ
  • గాంధీ శాంతి పురస్కారం (2007), Delhi
  • శాంతి పురస్కారం (2008), Seoul
  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కరాచీ నుండి గౌరవ డాక్టరేట్. (2006) .
  • యునెస్కో - మదణ్‌జీత్ సింగ్ ప్రైస్ (2009) [23][24]
  • అహ్మదియ్యా ముస్లిం శాంతి ప్రైజ్ (2010) [25]

జాతీయ అవార్డులు

[మార్చు]

రూ. కోటి విరాళాన్ని తిరస్కరించిన ఈది ఫౌండేషన్

[మార్చు]

భారతదేశానికి చెందిన మూగ చెవిటి బాలిక గీత పదకొండేళ్ల వయసులో పొరపాటున పాకిస్తాన్‌లో ప్రవేశించినప్పుడు ఈది ఆమెను కాపాడారు. ఫౌండేషన్‌లో ఉంచుకుని సంరక్షించి భద్రంగా భారత్‌కు అప్పగించారు. బదిరురురాలైన గీత బాగోగులు చూసుకున్నందుకు భారత ప్రధాని మోదీ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని పాక్ స్వచ్ఛంద సంస్థ ఈది ఫౌండేషన్ మంగళవారం తిరస్కరించింది. మోదీ ప్రకటనపట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది కృతజ్ఞత తెలుపుతూనే ఆర్థికసాయాన్ని సున్నితంగా తిరస్కరించారని సంస్థ ప్రతినిధి అన్వర్ తెలిపారు.[26]

మరణం

[మార్చు]

కిడ్నీ సంబంధిత సమస్యతో ఈది 2016 జూలై 8న మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈదిని ప్రత్యేక చికిత్స కోసం విదేశాలకు తరలిస్తామని ప్రభుత్వం కోరినా ఆయన నిరాకరించారు. తన దేశంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటానని చెప్పారు. జాతీయ స్టేడియంలో జరిగిన ఆయన అంతిమ ప్రార్థనలకు దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు హాజరయ్యారు. పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్, ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌లు సహా పలువురు సైనికాధికారులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఆయన మృతికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంతాపం ప్రకటించారు.[27]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ahmed, Munir (8 July 2016). "Pakistan's legendary 'Angel of Mercy' Abdul Edhi dies at age 88". Toronto Star. Retrieved 8 July 2016.
  2. "The Prime Minister Declared A Day Of National Mourning". Geo News. Retrieved 8 July 2016.
  3. "Revered humanitarian Abdul Sattar Edhi passes away". ARY News. Retrieved 8 July 2016.
  4. "The day I met Abdul Sattar Edhi, a living saint". The Daily Telegraph. 10 April 2011. Retrieved 24 March 2016.
  5. Dawn.com, AFP (8 July 2016). "Celebrated humanitarian Abdul Sattar Edhi passes away in Karachi". Retrieved 9 July 2016.
  6. అబ్దుల్‌ సత్తార్‌ ఈది కన్నుమూత, July 9, 2016[permanent dead link]
  7. 7.0 7.1 "Pakistani philanthropist Abdul Sattar Edhi dies aged 88". BBC News. Retrieved 9 July 2016.
  8. The World’s Greatest Living Humanitarian May Be From Pakistan, The Huffington Post. Retrieved 24 March 2016
  9. Masood, Salman (8 July 2016). "Abdul Sattar Edhi, Pakistan's 'Father Teresa,' Dies at 88". The New York Times. Retrieved 9 July 2016.
  10. Ala, Mustard; T.A.N.S. (12 November 2006). "Honorary Doctorate Degree by IBA awarded to Abdul Sattar Edhi". DAWN. Archived from the original on 4 జనవరి 2009. Retrieved 24 March 2016. Retrieved 24 March 2016
  11. 11.0 11.1 "Abdul Sattar Edhi, legendary Pakistani social worker, dies at 88". CBS News. Retrieved 9 July 2016.
  12. Lorenza Raponi & Michele Zanzucchi 2013.
  13. "Abdul Sattar Edhi, Known As 'Pakistan's Mother Teresa,' Dies At 88". National Public Radio. Retrieved 9 July 2016.
  14. Ke. Ec Aʻvān 1987.
  15. Robert Baer & Dayna Baer.
  16. 16.0 16.1 Web Desk (July 9, 2016). "ABDUL SATTAR EDHI LAID TO REST IN KARACHI". Radio Pakistan. Archived from the original on 2016-07-10. Retrieved July 9, 2016.
  17. Web Desk (July 9, 2016). "Serving from cradle to death". The Nation News Paper. Retrieved July 9, 2016.
  18. "Pakistan's saviour of the desperate". BBC News. 15 March 2001. Retrieved 24 March 2016.
  19. India Today, Volume 15, Part 2 1990.
  20. "Citation for Abdul Sattar Edhi and Bilqis Bano Edhi". Ramon Magsaysay Award Foundation. 31 August 1986. Archived from the original on 23 ఏప్రిల్ 2011. Retrieved 25 March 2016.
  21. "Pakistan's humanitarian Abdul Sattar Edhi dies". Al Jazeera. Retrieved 9 July 2016.
  22. 22.00 22.01 22.02 22.03 22.04 22.05 22.06 22.07 22.08 22.09 22.10 22.11 22.12 "Awards". Edhi Foundation. 8 August 2010. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 24 March 2016.
  23. "UNESCO-Madanjeet Singh Prize – Laureates". UNESCO. Retrieved 25 March 2016.
  24. "UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)" (PDF). UNESCO. 2009. Retrieved 25 March 2016.
  25. "Awards". The Ahmadiyya Muslim Community. Retrieved 9 July 2016.
  26. భారత్-పాక్ ఐక్యతకు చిహ్నానివి Sakshi | October 28, 2015
  27. ఈదీ ఫౌండేషన్ అధిపతి మృతి[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]