తేజస్విని కొల్హాపురే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజస్విని కొల్హాపురే
జననం (1980-01-01) 1980 జనవరి 1 (వయసు 44)[1]
వృత్తినటి, మోడల్
జీవిత భాగస్వామిపంకజ్ సరస్వత్
పిల్లలు1
తల్లిదండ్రులు
  • పండరీనాథ్ కొల్హాపురే (తండ్రి)

తేజస్విని కొల్హాపురే (జననం 1980 జనవరి 1) భారతీయ నటి, మోడల్.[2]

కెరీర్

[మార్చు]

ఆమె జీ టీవీలో రాజా బుందేలా దర్శకత్వం వహించిన ముఝే చాంద్ చాహియే అనే టెలివిజన్ ధారావాహికతో తన అరంగేట్రం చేసింది. ఆ తరువాత మోడలింగ్ రంగంలోనూ, చిత్రసీమలోనూ అడుగుపెట్టింది.

ఆమె జీ టీవీలో రిష్తే అనే మినిసిరీస్ ఎపిసోడ్‌లలో, సౌఘత్, తుమ్ బిన్ లలో నటించింది. ఆమె నాటకరంగంలో కూడా రాణించింది.[3]

ఆమె 1992 సంవత్సరంలో కృపా క్రియేషన్స్ - విమల్ ఎన్. ఉపాధ్యాయ ప్రచురించిన ఫ్యాషన్ కేటలాగ్‌లో మోడలింగ్ అసైన్‌మెంట్ చేసింది. ఈ కేటలాగ్ అదే ఎడిషన్‌లో, ఆమెతో పాటు ఐశ్వర్య రాయ్, సోనాలి బింద్రే, నికి అనెజా తదితరులు ఉన్నారు.[4]

ఆమె పాంచ్ (2003), అగ్లీ (2013) హిందీ చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధిచెందింది.[5][6][7][8][9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె ముంబైలో కొల్హాపూర్‌కు చెందిన మరాఠీ కుటుంబంలో జన్మించింది.[10] ఆమె తండ్రి పండరీనాథ్ కొల్హాపురే శాస్త్రీయ గాయకుడు.[11] ఆమె శక్తి కపూర్ భార్య శివంగి కొల్హాపురే, పద్మిని కొల్హాపురే లకు సోదరి. అలాగే శ్రద్ధా కపూర్‌కి ఆమె పిన్ని.

ఆమె గాయని లతా మంగేష్కర్‌కి మేనకోడలు, ఆమె నాన్నమ్మ లత తండ్రి అయిన దీనానాథ్ మంగేష్కర్‌కి సవతి సోదరి.[12] ఆమె తల్లి మంగళూరు వాసి నిరుపమ ప్రభు ఆమె కుటుంబం మంగళూరుకు చెందినది. ఆమె ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేసింది.[13]

తేజస్విని కొల్హాపురే పంకజ్ సరస్వత్‌ ని వివాహం చేసుకుంది. వీరికి 2015లో ఒక కుమార్తె జన్మించింది.[14]

మూలాలు

[మార్చు]
  1. "Tejaswini Kolhapure: Movies, Photos, Videos, News & Biography | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2019-05-20.
  2. "All you want to know about #TejaswiniKolhapure". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2019-05-20.
  3. Dundoo, Sangeetha Devi (16 May 2017). "Politics of water". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-07-08.
  4. "Viral: The Internet Found Aishwarya Rai Bachchan's Modelling Contract From 1992. She Was Paid..." NDTV.com. Retrieved 2023-02-11.
  5. "I trust Anurag Kashyap blindly: Tejaswini Kolhapure". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-12-27. Retrieved 2017-07-08.
  6. Bhattacharya, Roshmila (17 December 2014). "Tejaswini breaks 14-year-old jinx - Times of India". The Times of India. Retrieved 2017-07-08.
  7. "Ugly - An emotional story in the garb of a thriller - Times of India". The Times of India. 24 December 2014. Retrieved 2017-07-08.
  8. Bhattacharya, Roshmila (17 December 2014). "Tejaswini breaks 14-year-old jinx - Times of India". The Times of India. Retrieved 2017-07-08.
  9. Kaushal, Sweta (2014-12-25). "Ugly review: A dark, gripping movie that is a must watch". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2017-07-08.
  10. "Tejaswini Kolhapure Biography". Cinetalkers.com. 26 December 2014. Retrieved 2017-07-08.
  11. If I had my way, I would have worked with Raj Kapoor all my life: Padmini Kolhapure, Times of India, 13 September 2013.
  12. "'I feel bad about it…' | Latest News & Updates at Daily News & Analysis". Dnaindia.com. 16 June 2009. Retrieved 8 July 2017.
  13. If I had my way, I would have worked with Raj Kapoor all my life: Padmini Kolhapure, Times of India, 13 September 2013.
  14. Bhattacharya, Roshmila (1 February 2015). "Tejaswini Kolhapure delivers a baby girl - Times of India". The Times of India. Retrieved 2017-07-08.