Jump to content

శ్రద్ధా కపూర్

వికీపీడియా నుండి
శ్రద్ధా కపూర్
2018 లో స్టార్ స్క్రీన్ అవార్డులలో కపూర్
జననం (1987-03-03) 1987 మార్చి 3 (వయసు 37)[1]
వృత్తి
  • నటి
  • గాయకురలు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులుచూడండి మంగేష్కర్-బర్మన్ కుటుంబం

శ్రద్ధా కపూర్ (జననం 1987 మార్చి 3) భారతీయ సినీ నటి, గాయకురాలు. ఆమె బాలీవుడ్ లో నటించింది. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా, లవ్ కా ది ఎండ్ (2011) సినిమాలో కథానాయికగా నటించింది.

2013లో విడుదలైన ఆషికి 2 లో గాయని పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను, విమర్శకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. ఆ తరువాత 2014లో విలియం షేక్‌స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన హైదర్ సినిమాలో కథానాయికగా నటించింది ఆమె. ఏక్ విలన్ (2014), ఏబిసిడి (2015), భాగీ (2016) వంటి సినిమాల్లో ఆమె నటన ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక, బాలీవుడ్ లో తన స్థానాన్ని స్థిరం చేసుకుంది. ఆమె నటించిన పై సినిమాలన్నీ కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.[2][3]

నటించడంతో పాటు, తన సినిమాల్లో చాలా పాటలు పాడింది శ్రద్ధా. ఆమె చాలా బ్రాండ్ లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా కూడా పనిచేస్తోంది. తన స్వంత ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్ ను కూడా ప్రారంభించింది ఆమె. ఆమె స్టేజ్ షోలలోనూ, కచేరీల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది శ్రద్ధ. 

నటించిన సినిమాలు

[మార్చు]

ఆషికి2, సాహో

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday Shraddha Kapoor: Rare childhood pics of 'Aashiqui' girl". The Indian Express. 3 మార్చి 2016. Archived from the original on 14 నవంబరు 2016. Retrieved 13 నవంబరు 2016.
  2. Groves, Don (15 May 2016). "Bollywood Box Office: Tiger Shroff And Shraddha Kapoor A Hot Item in 'Baaghi'". Forbes. Retrieved 1 May 2016.
  3. "Kangana Ranaut, Deepika Padukone, Shraddha Kapoor, Other Top 5 Actresses of 2015 So Far". ibtimes.co.in. Retrieved 27 June 2016.


బాహ్య లింకులు

[మార్చు]