Jump to content

సల్మాన్ ఖుర్షీద్

వికీపీడియా నుండి
సల్మాన్ ఖుర్షీద్
సల్మాన్ ఖుర్షీద్


విదేశాంగ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 25 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ఎస్.ఎమ్. కృష్ణ
తరువాత సుష్మాస్వరాజ్

న్యాయశాఖ మంత్రి
పదవీ కాలం
28 మే 2011 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు వీరప్ప మొయిలీ
తరువాత అశ్వని కుమార్

మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
19 జనవరి 2009 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ఏ.ఆర్. అంతులే
తరువాత కే. రెహమాన్ ఖాన్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు చంద్ర భూషణ్ సింగ్
తరువాత ముకేశ్ రాజపుట్
నియోజకవర్గం ఫరూఖాబాద్

పదవీ కాలం
1991 – 1996
ముందు సంతోష్ భారతీయ
తరువాత సాక్షి మ‌హారాజ్
నియోజకవర్గం ఫరూఖాబాద్

ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
1999 – 2000
పదవీ కాలం
2005 – 2008

ప్రధాన కార్యదర్శి
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ
పదవీ కాలం
2004 – 2005
అధ్యక్షుడు సోనియా గాంధీ

వ్యక్తిగత వివరాలు

జననం (1953-01-01) 1953 జనవరి 1 (వయసు 71)
అలీగఢ్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఖుర్షీద్ ఆలం ఖాన్[1],సయీదా ఖుర్షిద్
జీవిత భాగస్వామి లూయిస్ ఖుర్షిద్
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ (బిఏ)
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (ఎం.ఏ, బిసిఎల్ )
వృత్తి న్యాయవాది

సల్మాన్ ఖుర్షీద్ ఆలం ఖాన్ (జననం 1953 జనవరి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1981లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

సల్మాన్ ఖుర్షీద్ 1981లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 1991లో ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశాడు. సల్మాన్ ఖుర్షీద్ 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాడు.

సల్మాన్ ఖుర్షీద్ 2009 లోక్‌సభ ఎన్నికలలో ఫరూఖాబాద్ నుండి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కార్పొరేట్ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) బాధ్యతలు చేపట్టి 2011 జూలై 12 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి 4వ స్థానంలో ఎన్నికల్లో  2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి 3వ స్థానంలో నిలిచాడు.

రచనలు

[మార్చు]

ఖుర్షీద్ 1990లో ప్రచురించబడిన "ది కాంటెంపరరీ కన్జర్వేటివ్: సెలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ ధీరేన్ భగత్"కి సంపాదకుడిగా ఉన్నాడు. ఆయన అయోధ్యపై 2021 అక్టోబరులో ''సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్' పుస్తకాన్ని ప్రచురించాడు.[3] అయోధ్యపై రాసిన పుస్తకంలో కొన్ని భాగాలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉత్తరాఖండ్ లోని నైనిటాల్‌లోని ఆయన ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Salman Khurshid's father Khursheed Alam Khan passes away" (in ఇంగ్లీష్). 20 July 2013. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  2. "Cabinet reshuffle: Salman Khurshid Foreign Minister, Moily gets Petroleum". 28 October 2012. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  3. "నేషన్‌హుడ్‌ టైమ్స్‌ పుస్తకాన్ని రచించిన కేంద్ర మాజీ మంత్రి?". 2021. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  4. "సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు.. ఇది హిందూయిజం కాదని వ్యాఖ్య". 15 November 2021. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.