Jump to content

సాక్షి మ‌హారాజ్

వికీపీడియా నుండి
సాక్షి మహరాజ్
సాక్షి మ‌హారాజ్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014 (2014-05-16)
ముందు అన్నూ టాండన్
నియోజకవర్గం ఉన్నావ్
పదవీ కాలం
1998 – 1999
నియోజకవర్గం ఫరూఖాబాద్
పదవీ కాలం
1996 – 1998
నియోజకవర్గం ఫరూఖాబాద్
పదవీ కాలం
1991 – 1996
నియోజకవర్గం మథుర

పదవీ కాలం
03 ఏప్రిల్ 2000 – 21 మార్చి 2006
నియోజకవర్గం ఉత్తరప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-12) 1956 జనవరి 12 (వయసు 68)
కాస్గంజ్, ఉత్తరప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
పూర్వ విద్యార్థి
  • పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్
  • మహర్షి దయానంద్ యూనివర్శిటీ, రోహ్తక్
వృత్తి రాజకీయ నాయకుడు , సన్యాసి

స్వామి సచ్చిదానంద హరి సాక్షి జీ మహారాజ్ (జననం 12 జనవరి 1956), సాక్షి మహారాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, హిందుత్వ నాయకుడు. ఆయన ఉన్నావ్, ఫరూఖాబాద్, మథురల నుండి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సాక్షి మహారాజ్ 1991లో జరిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌లో మథుర నియోజ‌క‌వ‌ర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్య‌ర్థి ల‌క్ష్మీ నారాయ‌ణపై 15,512 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1996లో ఫరూఖాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స‌మాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అన్వ‌ర్ మొహ్మ‌ద్ ఖాన్ పై 84, 978 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యాడు.

సాక్షి మహారాజ్ 1998లో ఫరూఖాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స‌మాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అర్వింద్ ప్రతాప్ సింగ్ పై 32,211 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యాడు. ఆయనకు బీజేపీ ఫరూఖాబాద్‌ టిక్కెట్ నిరాకరించడంతో ఆ తరువాత బీజేపీని వీడి ఆయ‌న స‌మాజ్‌వాదీ పార్టీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయి 2000లో రాజ్యస‌భ‌కు ఎన్నిక‌య్యాడు.

సాక్షి మహారాజ్ 2012లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి బీజేపీలో చేరాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉన్నావ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎస్‌పీ అభ్య‌ర్థి అరుణ్ శంక‌ర్ శుక్లాపై 2,10,173 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2]

సాక్షి మహారాజ్ 2019లో లోక్‌సభ ఎన్నికలలో ఉన్నావ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2019). "Sakshi Maharaj". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. The Indian Express (14 January 2015). "The maharaj, a party-hopper, educationist and muscleman" (in ఇంగ్లీష్). Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.